ETV Bharat / bharat

'వచ్చే ఏడాది ఆరంభంలో కరోనా వ్యాక్సిన్​'

author img

By

Published : Sep 13, 2020, 8:42 PM IST

కరోనా వ్యాక్సిన్​ కోసం దేశప్రజలు ఎన్నో ఆశలతో వేచిచూస్తున్న తరుణంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. కొవిడ్​ వ్యాక్సిన్​.. 2021లో అందుబాటులోకి వచ్చే అవకాశముందని ఓ మీడియా సమావేశంలో వెల్లడించారాయన. టీకా భద్రత విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని హామీ ఇచ్చారు.

Covid vaccine likely by early 2021: Union Health Minister Harsh Vardhan
ఈ ఏడాదికి కరోనా వ్యాక్సిన్​ లేనట్టే

ప్రపంచ దేశాలు కోటి ఆశలతో ఎదురుచూస్తున్న కరోనా వ్యాక్సిన్​పై కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్​. కొవిడ్​కు టీకా.. 2021 ఆరంభంలో అందుబాటులోకి వచ్చే అవకాశముందని ఓ మీడియా సమావేశంలో తెలిపారు. వ్యాక్సిన్​ భద్రత విషయంలో ఏ మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న కేంద్రమంత్రి.. దానిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని స్పష్టం చేశారు.

వారికే తొలి ప్రాధాన్యం..

వ్యాక్సిన్​ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనప్పటికీ.. వచ్చే ఏడాది తొలి త్రైమాసికం నాటికి సిద్ధంగా ఉండొచ్చని హర్షవర్ధన్​ పేర్కొన్నారు. అయితే.. వృద్ధులు, వైరస్​ ముప్పు అధికంగా ఉన్నవారికే తొలుత టీకా అందించాలనే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పిన ఆయన.. దీనిపై ఏకాభిప్రాయం కుదరాల్సి ఉందన్నారు. వ్యాక్సిన్​ హ్యూమన్​ ట్రయల్స్​ నిర్వహణలో భాగంగా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు పాటిస్తోందని స్పష్టం చేశారు. టీకా భద్రత, ఖర్చు వంటి అంశాలపై ప్రభుత్వం చర్చిస్తోందన్నారు మంత్రి.

'ఫస్ట్​ డోస్​ నేనే తీసుకుంటా'

వ్యాక్సిన్​ విషయంలో ఎలాంటి లోపాలు ఉండవని.. కావాలంటే ఫస్ట్​ డోస్​ తానే తీసుకుంటానని హామీ ఇచ్చారు హర్షవర్ధన్​. ఆక్స్​ఫర్డ్​ వ్యాక్సిన్​ ట్రయల్స్​లో పాల్గొన్నవారిలో ఒకరికి అనారోగ్య సమస్యలు తలెత్తిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: కోలుకున్నా కొన్ని లక్షణాలుంటాయి‌: కేంద్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.