దిల్లీలో కరోనా వ్యాప్తి ఆందోళనకర స్థాయికి చేరిన నేపథ్యంలో కొవిడ్ పరిస్థితులపై గురువారం అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. వైరస్‌పై అవగాహన కల్పించడంలో ఆయా నియోజకవర్గ పార్టీ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేల సహకారం కోరనున్నట్టు తెలుస్తోంది.
ఈ సమావేశంలో దిల్లీ భాజపా అధ్యక్షుడు అదేశ్ గుప్తా, పీసీసీ చీఫ్ అనిల్ చౌదరితో పాటు ఇతరులు పాల్గొంటారని సమాచారం.
కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. వైరస్ బాధితులకు 660 ఐసీయూ పడకలను ఏర్పాటుచేసేందుకు సన్నాహాలు ముమ్మరం చేసింది. అంతేకాకుండా రైల్వేతో కలిసి మరో 800 పడకలను అందించనున్నట్టు సమాచారం. అధునాతన వైద్య సదుపాయాలతో.. 45మంది వైద్యులు, పారామిలటరీ దళాల నుంచి 160 మంది డాక్టర్లు ఇప్పటికే దిల్లీకి చేరుకున్నారు.
ఇదీ దిల్లీ పరిస్థితి..
అక్టోబర్ 28 నుంచి దిల్లీలో కరోనా కేసులు తీవ్రస్థాయిలో పెరుగుతున్నాయి. తాజాగా బుధవారం ఒక్కరోజులోనే 7,486 మంది కరోనా బారినపడ్డారు. ఫలితంగా బాధితుల సంఖ్య 5లక్షల 3వేల 84కు ఎగబాకింది. అదే సమయంలో రికార్డు స్థాయిలో 131మంది మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 8వేలకు సమీపించింది.
ఇదీ చదవండి: కరోనా పంజా- దిల్లీలో 5లక్షలు దాటిన కేసులు