ETV Bharat / bharat

వర్సిటీల పునఃప్రారంభంపై యూజీసీ మార్గదర్శకాలు! - UGC news guidelines

కళాశాలలు, విశ్వవిద్యాలయాల పునఃప్రారంభానికి యూజీసీ మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే కంటైన్మెంట్‌ జోన్లలోని విద్యాసంస్థలకు మాత్రమే నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది. దశల వారీగా విద్యా కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది.

COVID-19: UGC releases guidelines for reopening of universities and colleges
యూనివర్శిటీలు తెరవడానికి యూజీసీ మార్గదర్శకాలు ఇవే!
author img

By

Published : Nov 5, 2020, 8:31 PM IST

Updated : Nov 5, 2020, 8:38 PM IST

కరోనా కారణంగా మూసివేసిన విద్యాకార్యకలాపాలను దశల వారీగా నిర్వహించుకోవచ్చని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్​(యూజీసీ)‌ తెలిపింది. ఈ మేరకు కళాశాలలు, విశ్వవిద్యాలయాల పునఃప్రారంభానికి మార్గదర్శకాలు విడుదల చేసిన యూజీసీ.. కంటైన్మెంట్‌ జోన్లలోని విద్యాసంస్థలకు మాత్రమే నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది.

భౌతిక తరగతుల ప్రారంభానికి సాధ్యమయ్యే విషయాలను పరిశీలించాలని, పూర్తిగా సురక్షితం అనుకున్న తర్వాతే కార్యకలాపాలకు సిద్ధం కావాలని స్పష్టం చేసింది. వర్సీటీలు, కళాశాలల క్యాంపస్‌లను దశలవారీగా తెరవడానికి ప్రణాళికలు వేయవచ్చని వివరించింది. వర్సిటీలు, కళాశాలల పరిపాలనా కార్యాలయాలు, పరిశోధన ప్రయోగశాలలు, గ్రంథాలయాలు కూడా తెరిచేందుకు అనుమతిచ్చింది. విద్యార్థులు తమ తమ విద్యాలయాల్లో తిరిగి చేరవచ్చని పేర్కొంది.

సంక్షేమ శాఖ కొత్త మార్గదర్శకాలు

మరోవైపు భారత్‌కు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికుల కోసం కుటుంబ, ఆరోగ్య సంక్షేమ శాఖ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆగస్టు 2న జారీ చేసిన మార్గదర్శకాల్లో మార్పులు చేసిన కేంద్రమంత్రిత్వశాఖ.. ఈ మేరకు నిబంధనలు సడలించింది.

యూజీసీ విడుదల చేసిన మరికొన్ని మార్గదర్శకాలు..

  • ఆయా సంస్థల ప్రధాన అధికారుల నిర్ణయం మేరకు చివరి సంవత్సరం విద్యార్థులను విద్యా, నియామక ప్రయోజనాల కోసం చేరేందుకు అనుమతించవచ్చు.
  • మొత్తం విద్యార్థులలో 50 శాతం కంటే ఎక్కువ మంది ఏ సమయంలోనైనా హాజరుకాకుండా చూసుకోవాలి.
  • కొవిడ్-‌19 వ్యాప్తిని నివారణకు అవసరమైన మార్గదర్శకాలు, ప్రొటోకాల్స్‌ తప్పనిసరిగా పాటించేలా చర్యలు చేపట్టాలి.
  • ఆన్‌లైన్ తరగతులు ఇష్టపడే విద్యార్థుల కోసం బోధనా విధానం కొనసాగుతుంది. అందుకోసం సంస్థలు ఆన్‌లైన్ స్టడీ మెటీరియల్‌ను అందుబాటులోకి తీసుకురావాలి.
  • అవసరమైతే తప్ప విద్యార్థులు అధ్యాపకులతో ఎలాంటి సంప్రదింపులు చేయరాదు. ముందస్తు అనుమతి తీసుకున్న తర్వాతే అధ్యాపకులతో సంప్రదింపులు జరపాలి.
  • అంతర్జాతీయ ప్రయాణ ఆంక్షలు, వీసా సంబంధిత సమస్యల కారణంగా తిరిగి విద్యాలయాల్లో చేరలేని అంతర్జాతీయ విద్యార్థుల కోసం విద్యాసంస్థలు ప్రణాళిక రూపొందించాలి. వారికి ఆన్‌లైన్ ద్వారా బోధన సాగించే విధంగా ఏర్పాట్లు చేయాలి.
  • భద్రత, ఆరోగ్య నివారణ చర్యలను కచ్చితంగా పాటిస్తూ అవసరమైన సందర్భాల్లో మాత్రమే హాస్టళ్లు తెరవాలి. కొవిడ్‌ లక్షణాలు ఉన్న విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ హాస్టళ్లలో ఉండటానికి అనుమతించకూడదు.
  • ఏదైనా క్యాంపస్ తిరిగి తెరిచే ముందు విద్యా సంస్థలు ఉన్న ప్రాంతాన్ని ఆయా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సురక్షిత ప్రాంతంగా ప్రకటించాలి.
  • కొవిడ్‌-19 దృష్ట్యా భద్రత, ఆరోగ్యానికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఆదేశాలు, సూచనలు, మార్గదర్శకాలు, ఉత్తర్వులను ఉన్నత విద్యాసంస్థలు తప్పక పాటించాలి.

ఇదీ చూడండి: మూడురోజులకే నిలిచిపోయిన సీప్లేన్​ సర్వీస్​

Last Updated : Nov 5, 2020, 8:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.