ETV Bharat / bharat

'దిల్లీలో 2 రోజుల్లో పరీక్షలు రెట్టింపు చేస్తాం' - CORONA VIRUS IN DELHI

దిల్లీలో కరోనా ప్రభావం అంతకంతకూ పెరిగిపోతున్న తరుణంలో చికిత్స కోసం 500 రైల్వే కోచ్​లు అందిస్తామని తెలిపారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. హాట్​స్పాట్లలో ఇంటింటి సర్వే నిర్వహిస్తామన్నారు. పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతామని, అన్ని రకాలుగా సాయం అందిస్తామని భరోసా కల్పించారు కేంద్ర మంత్రి.

Shah
హోంమంత్రి అమిత్​ షా.
author img

By

Published : Jun 14, 2020, 2:22 PM IST

Updated : Jun 14, 2020, 4:49 PM IST

దేశ రాజధాని దిల్లీలో కరోనా కేసులు, మరణాల సంఖ్య భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో పరీక్షల సంఖ్యను రాబోయే రెండు రోజుల్లో రెండు రెట్లు, 6 రోజుల్లో మూడు రెట్లు చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తెలిపారు. దిల్లీలో కరోనా ఉద్ధృతి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కట్టడి చర్యలపై కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌, దిల్లీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌, ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌తో హోం మంత్రి సమీక్ష నిర్వహించారు.

దిల్లీలో కరోనా కట్టడి, అందుబాటులో ఉన్న పడకలు, వైరస్‌ పరీక్షా సదుపాయాలు, ఆరోగ్య మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అంశాలపై అమిత్‌ షా ఆరా తీశారు. రాబోయే రోజుల్లో దిల్లీలోని కంటైన్మెంట్‌ జోన్లలోని ప్రతి పోలింగ్‌ కేంద్రంలో కరోనా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. కరోనా చికిత్స కోసం దిల్లీకి 500 రైల్వే కోచ్‌లు అందించనున్నట్లు వెల్లడించారు. వీటి ద్వారా అదనంగా 8వేల పడకలు అందుబాటులోకి వస్తాయని అమిత్‌ షా వివరించారు. ఆక్సిజన్​ సిలిండర్లు, వెంటిలేటర్లు వంటి అత్యవసరమైన పరికరాలను అందిస్తామని భరోసా కల్పించారు షా. కేసులు అధికంగా ఉన్న హాట్​స్పాట్​లలో ఇంటింటి ఆరోగ్య సర్వే నిర్వహిస్తామని తెలిపారు.

కరోనాపై ఉమ్మడి పోరు..

కేంద్రం, దిల్లీ ప్రభుత్వం కలిసి కరోనాపై ఉమ్మడి పోరు సాగిస్తామని తెలిపారు ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​. హోంమంత్రి అమిత్​ షాతో నిర్వహించిన సమావేశం ఫలప్రదమైందన్నారు. పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలిపారు.

Last Updated : Jun 14, 2020, 4:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.