ETV Bharat / bharat

కరోనా భయంతో నిద్ర పట్టడం లేదా? ఇలా చేయండి..

author img

By

Published : Apr 5, 2020, 8:31 PM IST

కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రజల జీవన విధానంలో పెను మార్పులు సంభవించాయి. అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. వైరస్ భయాలు ప్రజలను వెంటాడుతున్నాయి. దీంతో ఆందోళన, ఒత్తిడి పెరిగి నిద్రపై ప్రభావం పడుతోంది. మానసిక ఆరోగ్య సమస్యలున్న వారి సంగతి సరేసరి. ఈ నేపథ్యంలో జీవన విధానంలో ఎలాంటి మార్పులు చేసుకోకుండా సాధారణంగానే ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యవంతమైన, ప్రశాంతమైన నిద్రకోసం పలు సలహాలు ఇస్తున్నారు.

corona sleep stress
కరోనా నిద్రలేమి

కరోనా వైరస్ నుంచి కాపాడుకోవడానికి తరచుగా చేతులు కడుక్కోవడమే ఉత్తమమార్గం. దీనికి అదనంగా శరీర రోగనిరోధక వ్యవస్థను మరింత పటిష్ఠం చేసుకోవడం కూడా అంతే ముఖ్యమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

మానవ శరీరానికి రోగ నిరోధక శక్తిని అందించే ఉత్తమమైన ప్రక్రియ నిద్ర. శరీరం, మెదడు ఆరోగ్యానికి ప్రశాంతమైన నిద్ర చాలా అవసరం. రాత్రి సమయంలో తగినంత నిద్రపోవడం వల్ల వైరస్ నుంచి రక్షించుకోవచ్చు.

కరోనా ఎఫెక్ట్

కరోనా వైరస్ నిరంతరాయంగా వ్యాప్తి చెందుతుండటం వల్ల ప్రజల్లో ఆందోళనలు నెలకొన్నాయి. కొంతమంది తమ స్నేహితులు, కుటుంబసభ్యులకు దూరంగా.. స్వీయ నిర్బంధంలో ఉంటున్నారు. కరోనా వ్యాధి పట్ల ఉన్న భయాందోళనలు.. యువత, పిల్లల్ని భావోద్వేగానికి లోనుచేసే అవకాశం ఉంది. పెద్దలు సైతం తమ కుటుంబసభ్యుల ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారు. ఇక మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్న వారి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఈ పరిస్థితుల్లో సరిగా నిద్రపోవడం చాలా కష్టతరమవుతోంది.

"శారీరక ప్రతిస్పందన ఆధారంగా నిద్ర అనేది రోగ నిరోధక శక్తితో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంటుంది. ఒకవేళ సరిగా నిద్రించకపోతే మన రోగనిరోధక వ్యవస్థ క్షీణిస్తుంది. దీంతో శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఫలితంగా వైరస్ లేదా ఇతర వ్యాధులను ఎదుర్కోవడంలో శరీరం విఫలమవుతుంది."

-బ్రిటానీ లెమోండా, సీనియర్ న్యూట్రోసైకాలజిస్ట్, న్యూయార్క్

సరైన నిద్రకోసం...

వీటన్నింటినీ పరిశీలిస్తే నిద్ర ఓ దివ్య ఔషధమని స్పష్టమవుతోంది. అందువల్ల రాత్రి పూట సరిగా నిద్రపోవడానికి అవసరమయ్యే కొన్ని చిట్కాలను నిపుణులు సూచిస్తున్నారు.

మార్పు వద్దు

ప్రజాజీవితాలను కరోనా వైరస్ తలకిందులు చేసింది. చాలామంది ఇంటి నుంచే పనిచేసుకుంటున్నారు. అదే సమయంలో ఇంటి పనులనూ చక్కబెట్టేస్తున్నారు. పాఠశాలలు మూసేయడం వల్ల మరికొందరు ఇంట్లోనే ఉండి పిల్లలను చూసుకుంటున్నారు. అయితే పనులెలా ఉన్నా సాధారణ జీవన విధానమే అలవర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

"మన జీవితాలు ఎంత విభిన్న మార్గాల్లో ఉన్నాయో మనం గుర్తుంచుకోవాలి. సాధ్యమైనంత వరకు మనకు అలవాటైన జీవన విధానాన్నే పాటించాలి. మీరు ఇంట్లో నుంచి పని చేస్తున్నట్లైతే ఎప్పటిలానే నిద్రలేచి సమయానికి తయారవ్వండి. పక్క గదిలోకి వెళ్లినా, బెడ్​రూమ్​ నుంచి పనిచేసుకున్నా క్రమబద్ధమైన దినచర్యను పాటించండి."

-నవ్య సింగ్, సైకాలజిస్ట్, కొలంబియా విశ్వవిద్యాలయం

మరీ కునుకు తీయొద్దు

కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వాలు లాక్​డౌన్​ ప్రకటించాయి. మరోవైపు వైరస్ నుంచి రక్షించుకోవడానికి ప్రజలు స్వీయ నిర్బంధంలో ఉంటున్నారు. దీంతో వేళ కాని వేళల్లో నిద్రకు ఉపక్రమిస్తున్నారు. ఎక్కువగా పగటి పూట కునుకు తీయడం వల్ల రోజంతా నిద్రమత్తు ఉంటుంది. ఇది వేళకు నిద్రించే అలవాటుపై దుష్ప్రభావాన్ని చూపుతుంది.

వ్యాయామం తప్పనిసరి

లాక్​డౌన్ నేపథ్యంలో జిమ్​లు కూడా మూసే ఉన్నాయి. అయినప్పటికీ రోజూ వ్యాయామం తప్పనిసరిగా చేసుకోవాలి. వేళకు నిద్రించడంలో వ్యాయామం పాత్ర ఎనలేనిది.

"రోజూ వ్యాయామం చేసుకోవడం చాలా ముఖ్యం. వ్యాయామం చేయడం వల్ల ఎక్కువ అలసిపోతాం. అంతేగాక ఆ రోజు ఏదో సాధించామన్న అనుభూతి ఉంటుంది."

స్మార్ట్ ఫోన్​ను దూరంగా ఉంచండి

రోజంతా అదేపనిగా స్మార్ట్ ఫోన్​ను చూస్తూ ఉండటం వల్ల నిద్రపై ప్రతికూల ప్రభావం పడుతుంది. నిద్రించడానికి ఒక గంట ముందు టీవీ, ఫోన్ సహా ఆందోళన రేకెత్తించే వాటన్నింటినీ దూరంగా ఉంచాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. నిద్రించే ముందు పుస్తకాలు చదవడం చాలా మంచి అలవాటని సూచిస్తున్నారు.

చివరగా..

ఇవన్నీ పాటించినా ఆందోళన తగ్గకుండా సరిగా నిద్రించలేకపోతే వైద్యుడిని సంప్రదించండి. ఏవైనా ఇబ్బందులు ఉంటే మీ ప్రియమైన వారితో పంచుకోండి. వారితో మనస్ఫూర్తిగా మాట్లాడండి. సన్నిహితుల సాయం తీసుకోండి. మీరు ఒంటరి కాదన్న విషయం ఎప్పుడూ గుర్తుంచుకోండి. సుఖంగా నిద్రించండి.

ఇదీ చదవండి: సొంతంగా మాస్కు​ తయారు చేసుకోవటం ఎలా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.