ETV Bharat / bharat

పెరుగుతున్న రికవరీ.. మరణాల రేటు తగ్గుముఖం

దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రికవరీ రేటు 68 శాతానికి పైగా పెరిగినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. అలాగే మరణాల రేటు 2 శాతానికి తగ్గిందని వెల్లడించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న సమర్థమైన చర్యల వల్లే ఇది సాధ్యమవుతోందని పేర్కొంది.

COVID-19 recovery rate rises to 68.32 pc, case fatality rate further dips to 2.04 pc: Centre
పెరుగుతున్న రికవరీ రేటు.. క్షీణిస్తున్న మరణాల రేటు
author img

By

Published : Aug 8, 2020, 10:41 PM IST

Updated : Aug 8, 2020, 11:42 PM IST

భారత్​లో కొవిడ్​ కేసులు భారీగానే నమోదవుతున్నాయి. అయితే దీనికి తగిన విధంగా వైరస్​ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. మరణాల రేటు స్థిరంగా క్షీణిస్తోంది. వైరస్​ రికవరీ రేటు 68.32 శాతానికి పెరగగా... మరణాల రేటు 2.04కు తగ్గిందని కేంద్ర ఆరోగ్యశాఖ వివరించింది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొవిడ్​ నివారణకు తీసుకున్న సమర్థమైన చర్యలే దీనికి కారణమని తెలుస్తోంది. టెస్టింగ్​, ట్రాకింగ్​, ట్రీట్​ వ్యూహంతో బాధితులను గుర్తించి.. సకాలంలో చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఫలితంగా మరణాల రేటు తగ్గుతోందని మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఆరోగ్య శాఖ తెలిపిన కీలక అంశాలు

  • దేశంలో ప్రతి 10 లక్షల జనాభాకు సగటున 1,469 మందికి వైరస్​ పాజిటివ్​గా తేలుతున్నారు. ఇది ప్రపంచ సగటు 2,425 కంటే తక్కువ.
  • మరణాల రేటు స్థిరంగా క్షీణిస్తోంది. ప్రపంచంలో సగటున 10 లక్షల జనాభాలో 91 మంది మృతి చెందగా.. దేశంలో 30 మరణాలు సంభవిస్తున్నాయి.
  • ఇప్పటివరకు 14,27,005 మంది వైరస్​ను జయించారు. ఫలితంగా రికవరీ రేటు 68.32 పెరిగింది.
  • 6,19,088 మంది ఆసుపత్రుల్లో బాధితులు చికిత్స పొందుతున్నారు. ఈ సంఖ్య... మొత్తం కేసుల్లో 29.64 శాతంగా ఉంది.
  • రోజుకు దాదాపు 6 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నాం. దీంతో మొత్తం 2 కోట్లు 33 లక్షల మందికి పైగా పరీక్షించాం.
  • మిలియన్​ జనాభాలో కొవిడ్​ నిర్ధరణ పరీక్షల సగటు 16,947కు పెరిగింది.
  • కరోనా నిర్ధరణ ల్యాబ్​ల సంఖ్య పెంచడం కరోనా నివారణలో కీలక అంశం.

ఇదీ చూడండి: దిల్లీలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

Last Updated : Aug 8, 2020, 11:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.