దేశవ్యాప్తంగా నమోదవుతున్న రోజువారీ రికవరీల్లో 60 శాతం మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాలవేనని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే 57 శాతం కేసులు ఈ రాష్ట్రాల నుంచి బయటపడుతున్నట్లు తెలిపింది.
గురువారం 70,880 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 35,42,663కు చేరింది. రికవరీ రేటు 77.65 శాతంగా ఉంది.
రాష్ట్రాల వారీగా కేసులు...
- మహారాష్ట్రను కరోనా వణికిస్తోంది. తాజాగా 24,886 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 10 లక్షలు దాటింది. రాష్ట్రవ్యాప్తంగా 10,15,681 కేసులు ఉన్నాయి. వీరిలో 7,15,023 మంది డిశ్చార్జ్ కాగా.. 2,71,566 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం 28,724 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
- కర్ణాటకలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. తాజాగా 9,464 మందికి పాజిటివ్‌గా తేలింది. మరో 130 మంది మరణించారు. రాష్ట్రవ్యాప్తంగా 3,34,999 మంది డిశ్చార్జ్ కాగా... 98,326 మంది చికిత్స పొందుతున్నారు.
- తమిళనాట మరో 5,519 కేసులు వెలుగు చూడగా.. 77 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు 8,231 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 4,35,422 మంది డిశ్చార్జ్ అయ్యారు.
- ఉత్తర్‌ప్రదేశ్‌లో తాజాగా 4,282 కేసులు బయటపడ్డాయి. మరో 76 మంది మృతి చెందగా.. 7 వేల మంది కోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం బాధితుల సంఖ్య మూడు లక్షలకు చేరువైంది.
- దిల్లీలో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా 4,266 కేసులను గుర్తించారు. మరో 21 మంది వైరస్‌కు బలయ్యారు. రాష్ట్రంలో మొత్తం 1,78,154 మంది కోలుకోగా.. 26,907 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరో 4,687 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఒడిశాలో రికార్డు స్థాయిలో 3,996 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. మరో 14 మంది మృతి చెందగా.. మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 605కు ఎగబాకింది. మొత్తం 1,43,117 మంది బాధితులు ఉన్నారు.
- బంగాల్ మరో 3,157 మందికి పాజిటివ్‌గా తేలగా... మొత్తం 1,96,332 కేసులు ఉన్నట్లు ఆ రాష్ట్ర అధికారులు తెలిపారు.
- కేరళలో కొత్తగా 2,988 కేసులు వెలుగు చూశాయి. రాష్ట్రంలో 27,877 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరో 73,904 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
- జమ్ముకశ్మీర్‌లో మరో 1,578 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది.
- త్రిపురలో మరో 559 మంది కరోనా బారినపడగా... మొత్తం బాధితుల సంఖ్య 17,833కు చేరింది. 172 మంది వైరస్‌కు బలయ్యారు.
- రైల్వే సహాయ మంత్రి సురేశ్ అంగాడికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇటీవల తనను కలిసిన వ్యక్తులు పరీక్షలు చేయించుకోవాలని కోరారు.