ప్రపంచ దేశాలతో పోల్చితే కరోనా మరణాల రేటు భారత్లో చాలా తక్కువగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.
"భారత్లో 10 లక్షల జనాభాలో 837 మంది మాత్రమే కరోనా బారిన పడుతున్నారు. ఇది ప్రపంచ దేశాలతో పోల్చితే చాలా తక్కువ. భారత్తో పోల్చితే చాలా దేశాల్లో కరోనా కేసులు 12 నుంచి 13 రెట్లు ఎక్కువ. అలాగే మిగతా దేశాలతో పోల్చితే భారత్లో కరోనా మరణాలు చాలా తక్కువ. భారత్లో మిలియన్ జనాభాకు 20.4 మంది కరోనాతో మరణిస్తుంటే.. చాలా దేశాల్లో 21 నుంచి 33 రెట్లు అధికంగా చనిపోతున్నారు."
- రాజేశ్ భూషణ్, కేంద్ర ఆరోగ్య శాఖ ప్రత్యేకాధికారి
కొవిడ్ వ్యాప్తి తక్కువగానే ఉంది!
కరోనా కేసుల విషయంలో భారతదేశ సగటు కంటే.. 30 రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల సగటు చాలా తక్కువగానే ఉందని రాజేశ్ భూషణ్ తెలిపారు.
"భారత్లోని 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ రేటు... జాతీయ పాజిటివిటీ రేటు కంటే తక్కువగా ఉంది. దేశంలో కరోనా పాజిటివిటీ రేటు 8.07 శాతంగా ఉంది."
- రాజేశ్ భూషణ్, కేంద్ర ఆరోగ్య శాఖ ప్రత్యేకాధికారి
ర్యాపిడ్ టెస్టులు చేయాలి
'ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లూహెచ్ఓ) ప్రకారం, ఒక రోజులో మిలియన్ జనాభాలో.. కనీసం 140 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించాలి. అయితే భారత్లోని 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రోజుకు (మిలియన్ జనాభాలో) 180 మందికి పరీక్షలు చేయిస్తున్నాయి. మహమ్మారి విజృంభణను అరికట్టేంత వరకు ఇది కొనసాగుతుంది' అని రాజేశ్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి: '23% దిల్లీ వాసుల్లో కొవిడ్-19 యాంటీబాడీలు'