ETV Bharat / bharat

కరోనాపై పోరులో కేంద్రం పనితీరు భేష్​: సుప్రీం - కేంద్ర ప్రభుత్వ పనితీరుపై సుప్రీం స్పందన

కేంద్ర ప్రభుత్వంపై సుప్రీం ధర్మాసనం ప్రశంసల జల్లు కురిపించింది. కరోనాను అడ్డుకునేందుకు కేంద్రం చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తోందని తెలిపింది. విమర్శకులు కూడా మెచ్చుకునే రీతిలో ప్రభుత్వం పనిచేస్తోందని వెల్లడించింది.

Coronavirus: SC expresses satisfaction, says critics also lauding Centre's efforts
కరోనాపై పోరులో కేంద్రం పనితీరు భేష్​: సుప్రీం
author img

By

Published : Mar 23, 2020, 3:15 PM IST

కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ప్రశంసల వర్షం కురిపించింది. కరోనాపై పోరుకు కేంద్రం చేపడుతున్న చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయని వెల్లడించింది. విమర్శకులు కూడా మెచ్చుకునే స్థాయిలో ప్రభుత్వ పనితీరు ఉందని పేర్కొంది.

"కరోనా వైరస్​ కట్టడికి కేంద్రం చేపడుతున్న చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయి. కేంద్రం పనితీరు బాగుందని విమర్శకులు కూడా అంటున్నారు. ఇవి రాజకీయాలు కావు.. వాస్తవాలు."

- జస్టిస్​ ఎస్​ఏ బొబ్డే, భారత ప్రధాన న్యాయమూర్తి

కొవిడ్​-19 పై పోరులో కేంద్రం మరిన్ని చర్యలు చేపట్టాలని దాఖలైన వ్యాజ్యాల విచారణ సమయంలో ఈ వ్యాఖ్యలు చేసింది భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎస్​ఏ బోబ్డే, జస్టిస్​ ఎల్​ఎన్​ రావ్​ల​ ధర్మాసనం. కరోనా అనుమానిత పరీక్షల కోసం ప్రయోగశాలలను పెంచడమే కాకుండా.. మరిన్ని ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

ఇదీ చదవండి: సుప్రీంలో ఒకే ధర్మాసనం.. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.