మురుగు నీటి వ్యవస్థ ద్వారా కరోనా వైరస్ వ్యాపించే ప్రమాదం ఉందని ఓ పరిశోధన హెచ్చరిస్తోంది. ముఖ్యంగా భారీ భవంతుల్లో మురుగునీటి పారుదల పైపులకు లీకులు లేకుండా జాగ్రత్తపడాలని పేర్కొంది. ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెట్‌లో ఈ పరిశోధన పత్రం ప్రచురితమైంది.
"మురుగునీరు వెళ్లే పైపులు ఎక్కడైనా తెరుచుకున్నా, లీక్ అవుతున్నా తక్షణం టేప్ లేక గ్లూతో మూసేయాలి. కరోనా వైరస్ గాలిలో ప్రసరించే అవకాశం ఉన్నందున మురుగునీటి లీకేజీతో అది ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. భారీ భవంతుల మధ్య అనుసంధానమైన మురుగునీటి పారుదల వ్యవస్థలో ఎక్కడైనా లోపాలుంటే కరోనా వైరస్ ఒక భవంతి నుంచి మరో భవంతికి వ్యాపించే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి ముప్పు ఎక్కువగా ఆసుపత్రులు, ఇతర భారీ భవనాల్లో ఎదురుకావొచ్చు"
- పరిశోధన పత్రం.
అన్ని కొళాయిలను ఉదయం, సాయంత్రం 5 సెకన్లపాటు తెరిచి ఉంచాలని తెలిపింది పరిశోధన పత్రం.
ఇదీ చూడండి : దేశంలో 15 జిల్లాల్లోనే 60 శాతం కరోనా కేసులు