ETV Bharat / bharat

దేశవ్యాప్తంగా ఆపరేషన్​ దియా- విద్యుత్​ గ్రిడ్​ భద్రం - కొరోనా వార్తలు

corona virus live news
కరోనా వార్తలు
author img

By

Published : Apr 5, 2020, 9:14 AM IST

Updated : Apr 8, 2020, 8:45 AM IST

21:53 April 05

  • #WATCH Delhi: PM Narendra Modi lights a lamp after turning off all lights at his residence. India switched off all the lights for 9 minutes at 9 PM today & just lit a candle, 'diya', or flashlight, to mark India's fight against #Coronavirus as per his appeal. pic.twitter.com/9PVHDlOARw

    — ANI (@ANI) April 5, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

21:41 April 05

  • Delhi: PM Narendra Modi lights a lamp after turning off all lights at his residence. India switched off all the lights for 9 minutes at 9 PM today & just lit a candle, 'diya', or flashlight, to mark India's fight against #Coronavirus as per his appeal. pic.twitter.com/apLIVmMCTf

21:33 April 05

విద్యుత్ గ్రిడ్ సురక్షితం

యావద్దేశం 9 నిమిషాల పాటు లైట్లు ఆర్పినా... విద్యుత్ గ్రిడ్​పై ఎలాంటి ప్రభావం పడలేదని, వ్యవస్థ అంతా సజావుగా పనిచేస్తోందని స్పష్టంచేశారు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్​కే సింగ్.

21:21 April 05

  • Defence Minister Rajnath Singh lights up earthen lamps along with his family. PM had appealed to the nation to switch off all lights of houses today at 9 PM for 9 minutes,& just light a candle, 'diya', or flashlight, to mark India's fight against #Coronavirus pic.twitter.com/EB5nFzu9xO

  • Lok Sabha Speaker Om Birla lights up earthern lamps along with family. Prime Minister Narendra Modi had appealed to the nation to switch off all lights of houses today at 9 PM for 9 minutes,& just light a candle, 'diya', or flashlight, to mark India's fight against #Coronavirus pic.twitter.com/cRSaJBnxxj

21:13 April 05

  • Ghaziabad: People light up candles following the call of PM Modi to switch off all the lights of houses today at 9 PM for 9 minutes, and just light a candle, 'diya', or mobile's flashlight, to mark India's fight against #Coronavirus. pic.twitter.com/oN9qMk9CaF

    — ANI UP (@ANINewsUP) April 5, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

21:12 April 05

21:11 April 05

  • Lucknow: UP CM Yogi Adityanath lights earthen lamps to form an 'Om', at his residence. PM Modi had appealed to the nation to switch off all lights of houses today at 9 PM for 9 minutes, and just light a candle, 'diya', or flashlight, to mark India's fight against #Coronavirus. pic.twitter.com/QXrj2oTsVu

  • Vice President Venkaiah Naidu turns off all the lights of his residence & lights earthen lamps. PM had appealed to the nation to switch off all lights of houses today at 9 PM for 9 minutes, & just light a candle, 'diya', or flashlight, to mark India's fight against #COVID19 pic.twitter.com/6NEO4H683i

  • Delhi: Health Minister Dr Harsh Vardhan lights an earthen lamp, to show support for the call by PM Modi to switch off all lights of houses today at 9 PM for 9 minutes&just light candles, 'diyas' or mobile's flashlight, to mark the fight against #Coronavirus. pic.twitter.com/4QhZVogrq5

21:04 April 05

  • Tamil Nadu: Residents of a society in Chennai Central have turned off lights of their houses, following the call by PM Modi to switch off all lights of houses today at 9 PM for 9 minutes&just light a candle, 'diya' or mobile's flashlight, to mark the fight against #Coronavirus. pic.twitter.com/c1O7oU0ewf

చెన్నైలో లైట్లు ఆపి, దీపాలు వెలిగించిన ఓ కాలనీ వాసులు.

20:56 April 05

పులకించిన భారతావని...

ప్రధాని నరేంద్రమోదీ పిలుపునకు కోట్లాది మంది భారతీయులు స్పందించారు. ఇంట్లో విద్యుత్​ దీపాలు  ఆపేసి.. దివ్వెల కాంతులతో భారతావని పులకించిపోయేలా చేశారు. కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా దేశ సమగ్రత, ఐకమత్యాన్ని చాటి చెప్పారు. ఇంటి దగ్గర గీసుకున్న లక్ష్మణ రేఖను దాటకుండా ప్రజలు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.

20:22 April 05

indian diya on april 5th
ఐకమత్య వెలుగు

దివ్వెలు వెలిగించేందుకు మీరు సిద్ధమేనా?

కరోనా రక్కసిపై పోరులో యావత్​ దేశం ఒక్కతాటిపై ఉందని రుజువు చేసేందుకు.. ప్రజలంతా ఈరోజు రాత్రి 9 గంటల 9 నిముషాలకు ఇళ్లలో లైట్లు ఆపి కొవ్వొత్తులు, దివ్వెలను వెలిగించాలని పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ.

  • ఎందుకు లైట్లు ఆర్పాలి?

దేశంలో కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు 21 రోజుల లాక్​డౌన్ విధించిన అనంతరం తొలిసారి దేశ ప్రజలనుద్దేశించి వీడియో సందేశమిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. జనతా కర్ఫ్యూతో భారతీయులు తమ శక్తిసామర్థ్యాలు చాటారని కొనియాడి, ప్రజలంతా ఏకమై భారత్​లో కరోనాను తరిమికొడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉంటే కరోనాను జయించినట్లేనని పునరుద్ఘాటించారు. 

ఈ ఆదివారం రాత్రి లైట్లన్నీ ఆపేసి కేవలం కొవ్వొత్తులు, దివ్వెలను వెలిగించి, సరిగ్గా 9 గంటలకు మొదలుపెట్టి 9 నిమిషాలపాటు దీన్ని కొనసాగించాలన్నారు మోదీ. ఇలా చేయడం సంకట సమయంలో భారతీయులకు శక్తిని, ఉత్సాహాన్ని ఇస్తుందన్నారు. 130 కోట్లమంది భారతీయుల సంకల్పంతో మనమేంటో రుజువు చేసేందుకు లైట్లు ఆర్పి ప్రధాని పిలుపును విజయవంతం చేయాలి.

  • బయటకు రావొచ్చా?

ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రాకూడదు. అలా చేస్తే కరోనా మహమ్మారి వ్యాప్తి ఇంకా పెరిగే ప్రమాదం ఉంది. అందుకే గడప దాటకుండా ఇంట్లోనే లైట్లన్నీ ఆర్పి, కొవ్వొత్తులు, దివ్వెలు వెలిగించాలి. కుదరకపోతే మొబైల్​ ఫ్లాష్, టార్చ్​లైట్లను ఉపయోగించాలి. ఈ సమయంలో సామాజిక దూరం కచ్చితంగా పాటించేలా చూసుకోవాలి. ఇంటి గడపనే లక్ష్మణ రేఖగా భావించాలి. అడుగు బయటపెట్టకూడదు.

  • విద్యుత్​ పరికరాలు అన్నీ ఆపేయాలా?

లేదు. మన ఇంట్లోని లైట్లు మాత్రమే ఆర్పివేయాలి. వీధి లైట్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఫ్యాన్లు యథావిధిగా పనిచేయనివ్వాలి.

  • పవర్​గ్రిడ్ కుప్పకూలుతుందా?

దేశంలోని ప్రజలంతా ఒకేసారి లైట్లు ఆర్పివేస్తే పవర్​గ్రిడ్ కుప్పకూలి అంధకారంలోకి వెళ్తామనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే అలా ఏం జరగదని కేంద్రం భరోసా ఇస్తోంది. ఎలాంటి నష్టం జరగకుండా పవర్​ ఫ్లక్చువేషన్స్​ తట్టుకునేలా అన్ని ఏర్పాట్లు చేశామని చెబుతోంది. విద్యుత్​ డిమాండ్ అకస్మాత్తుగా పడిపోతే దానిని పరిష్కరించే వెసులుబాట్లు ఉన్నాయని స్పష్టం చేస్తోంది. ఇందుకు పవర్​ సిస్టమ్​ ఆపరేషన్​ కార్పొరేషన్ బాధ్యత వహిసస్తుందని వివరణ ఇస్తోంది. 

12 నుంచి 13 గిగావాట్లకు మించి విద్యుత్​ డిమాండ్ తగ్గదని.. ఇది 9 నిమిషాల్లో రికవర్ అవుతుందని చెబుతోంది. బ్లాక్ఔట్ నిర్వహించడం ఇదే తొలిసారి కాదని, ఎర్త్​ అవర్​ సమయాల్లోనూ ఇలా చేస్తామని గుర్తుచేసింది కేంద్రం. 2012లో ఓ సారి పవర్​ గ్రిడ్ ఫెయిల్ అవ్వడానికి సాంకేతిక లోపమే కారణమని తెలిపింది.

  • ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా?

ఐకమత్య వెలుగు కార్యక్రమంలో పాల్గొనే ముందు చేతులకు శానిటైజర్​ను అసలు రాసుకోకూడదు. అందులో ఉండే ఆల్కహాల్​ కారణంగా అగ్నిప్రమాదం జరిగే ప్రమాదం ఉంది. శరీరం కాలి ప్రాణానికే ముప్పు వాటిల్లే ముప్పు ఉంది. అందుకే శానిటైజర్లకు ఆ సమయంలో ఆమడ దూరంలో ఉండాలి. చేతులను సబ్బుతో కడుక్కున్నాక దివ్వెలను వెలిగించాలి.

  • అందరూ పాల్గొనాలా?

ప్రపంచవ్యాప్తంగా కోరలు చాచి మానవాళి మనుగుడకే ప్రమాదకరంగా మారిన కరోనా రక్కసిపై.. దేశ ప్రజలతో కలిసి పోరాడుతున్నామని చాటి చెప్పేందుకు ప్రతి భారతీయుడు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలి. అయితే.. వైద్యులు, వైద్య సిబ్బంది, ఇతర అత్యవసర సేవల సిబ్బంది యథావిధిగా తమ విధుల్లో నిమగ్నమై ఉండాలని సూచించింది కేంద్రం.

20:10 April 05

ఆయా రాష్ట్రాల్లో కరోనా కేసులు

>> మహారాష్ట్రలో ఈరోజు 13 మంది కరోనాతో చనిపోయారు. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 45కు చేరింది. అంతేకాకుండా ఈరోజు 113 కరోనా పాజిటివ్​ కేసులు కూడా నమోదవగా... మొత్తం కొవిడ్​-19 బాధితుల సంఖ్య 747కు చేరింది.

>> దిల్లీలో ఈరోజు కొత్తగా 58 కరోనా కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం పాజిటివ్​ కేసుల సంఖ్య 503కు చేరింది. ఇందులో 320 మంది తబ్లీగీ జమాత్​లోపాల్గొన్నారు కాగా.. 61 మంది విదేశీ ప్రయాణాలు చేసినట్లుగా తెలుస్తోంది. 18 మంది డిశ్ఛార్జి అయ్యారు.

>> రాజస్థాన్​లో కొత్తగా 47 కేసులు నమోదయ్యాయి. మొత్తం కరోనా పాజిటివ్​ కేసుల సంఖ్య 253కు చేరింది. ఈరోజు కేసుల్లో 39 జోధ్​పుర్​ నుంచే వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

>> గుజరాత్​లో కొత్తగా 22 కరోనా పాజిటివ్​ కేసులు నమోదవగా.. మొత్తం బాధితుల సంఖ్య  128కి చేరింది.

>> ఈరోజు కర్ణాటకలో 7 కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్త కొవిడ్​-19 కేసుల సంఖ్య 151కి చేరింది. ఇప్పటివరకు నలుగురు చనిపోయగా, 12 మంది డిశ్ఛార్జి అయ్యారు.

19:40 April 05

robot police
రోబో పోలీస్​

ఉల్లంఘనుల కోసం 'రోబో పోలీస్​'

కొవిడ్‌-19ను అరికట్టేందుకు ఉత్తర ఆఫ్రికా దేశమైన టునీషియా పోలీస్‌ రోబోలను రంగంలోకి దించింది. పీగార్డ్‌గా సుపరిచితమైన ఈ రోబోలు రిమోట్‌ సాయంతో పనిచేస్తాయి. వీటికి ఇన్ఫ్రారెడ్‌, థర్మల్‌ ఇమేజ్‌ కెమెరాలు, సౌండ్‌ అండ్‌ లైట్‌ అలారాలను అమర్చారు. అక్కడ లాక్‌డౌన్‌ సమయంలో వీధుల్లో తిరుగుతూ అనుమానితులను గుర్తించి 'ఏం చేస్తున్నావ్‌..? నీ ఐడీ చూపించు.. లాక్‌డౌన్‌ ఉందని తెలియదా..?' అని ప్రశ్నిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోను టునీషియా ఇంటీరియర్‌ మినిస్ట్రీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసింది.

భారత్​లోనూ లాక్​డౌన్​ సమయంలో ప్రజల రాకపోకలు గమనించేందుకు కొన్ని ప్రాంతాల్లో డ్రోన్​ కెమేరాలను వినియోగిస్తున్నారు.

19:29 April 05

బిగ్​బీ దాతృత్వం

కరోనా సంక్షోభంతో ఉపాధి కరవై ఇబ్బందులు పడుతున్న వారికి అండగా నిలిచేందుకు బాలీవుడ్ మెగాస్టార్​ అమితాబ్ బచ్చన్​ ముందుకు వచ్చారు. అఖిల భారత సినీ కార్మికుల సంఘం పరిధిలోని రోజువారీ వేతన కార్మికులకు రేషన్ సరకులు అందించాలని నిర్ణయించారు. ఇలా లక్ష కుటుంబాలకు నెలకు సరిపడా వంట సామగ్రి, ఇతర నిత్యావసరాలు ఇవ్వనున్నారు బిగ్​ బీ. ఈ సాయం అందించడంలో సోనీ పిక్చర్స్, కల్యాణ్ జువెలర్స్ అమితాబ్​కు తోడుగా నిలుస్తున్నాయి. 

19:20 April 05

భారత్​లో కరోనా మృతులు @ 83

దేశవ్యాప్తంగా కరోనా మృతులు పెరుగుతున్నారు. ప్రస్తుతం మరణాల సంఖ్య 83కు చేరింది. కరోనా పాజిటివ్​ కేసుల సంఖ్య 3,577గా వెల్లడించింది కేంద్ర వైద్య,ఆరోగ్య శాఖ. గత 24 గంటల్లో 505 కొత్త కేసులు నమోదయినట్లు స్పష్టం చేసింది.

19:06 April 05

మతం పేరుతో వైద్యానికి నిరాకరణ.. పురిట్లోనే బిడ్డను కోల్పోయిన తల్లి

పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణికి మతం కారణంగా వైద్యం నిరాకరించారు వైద్యులు. ఫలితంగా ఆ తల్లి పురిట్లోనే బిడ్డను కోల్పోయింది. ఈ ఘటన రాజస్థాన్‌లోని భరత్‌పుర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

ఇర్ఫాన్‌ ఖాన్‌ అనే వ్యక్తి తన భార్యకు పురిటినొప్పులు రాగా.. సిక్రి ఏరియా ఆస్పత్రికి శుక్రవారం రాత్రి తీసుకెళ్లాడు. కేసు తీవ్రతను గుర్తించిన వైద్యులు కేసును భరత్‌పుర్‌ జిల్లా కేంద్రంలోని ఆర్‌బీఎం జెన్నా ఆసుపత్రికి రిఫర్‌ చేశారు. శనివారం ఉదయం వారు ఆస్పత్రికి చేరుకున్నారు. అక్కడి మహిళా వైద్యురాలు తన వివరాలు తెలుసుకుని.. 'మీకు ఇక్కడ వైద్యం చేయడం కుదరదు' అని నిరాకరించినట్లు ఇర్ఫాన్‌ మీడియాకు తెలిపాడు. అందువల్ల తన భార్యను ఆసుపత్రి నుంచి తీసుకొచ్చేశానని చెప్పాడు. అయితే తన భార్య అంబులెన్సులో జన్మనిచ్చిందని, వైద్యం అందక  బిడ్డ చనిపోయిందని తెలిపాడు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే బిడ్డను కోల్పోయానని ఆవేదన వ్యక్తంచేశాడు. దీనిపై రాష్ట్ర ఆరోగ్య మంత్రి సుభాష్‌ గార్గ్‌ స్పందించారు. ఈ ఘటనపై జిల్లా అధికారులను విచారణ జరపాల్సిందిగా ఆదేశించారు.

18:58 April 05

కరోనా ఇబ్బందులు ఎదుర్కొనేందుకు మరో 'ప్యాకేజీ'

మార్చి 24న ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ ప్రకటించగా.. రెండు రోజుల్లో రూ.1.7 లక్షల కోట్ల రిలీఫ్​ ప్యాకేజీని ప్రకటించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​. ఏప్రిల్​ 14 నాటికి ఆ 21 రోజుల లాక్​డౌన్​ పూర్తికానుంది. ఈ సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణించింది. ఈ నేపథ్యంలో సంక్షోభాన్ని గట్టెంక్కించడం, సంక్షేమం, ప్రభుత్వ పథకాల అమలు కోసం కేంద్రం మినీ ప్యాకేజీని ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది. ఇందుకోసం మోదీ అధ్యక్షతన 10 మంది అధికారులతో ఓ కమిటీ సిద్ధమైనట్లు సమాచారం. అంతేకాకుండా లాక్​డౌన్​ ఎత్తివేస్తే తీసుకోవాల్సిన చర్యలపైనా రక్షణశాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ ఆధ్వర్యంలోని ఓ కమిటీ ఏర్పాటైనట్లు తెలుస్తోంది.

18:47 April 05

మధ్యప్రదేశ్​లో మృతులు @ 13

మధ్యప్రదేశ్​లో మరో కరోనా మరణం నమోదైంది. 53 ఏళ్ల మహిళ కొవిడ్​-19 కారణంగా చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 13కు చేరింది.

18:09 April 05

భోపాల్​లో పూర్తిగా లాక్​డౌన్​?

మధ్యప్రదేశ్​లోని భోపాల్​లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్​ వ్యాప్తిని అరికట్టేందుకు నేటి నుంచి పూర్తి స్థాయి లాక్​డౌన్​ అమలుకు రంగం సిద్ధం చేశారు అధికారులు. పాల డెయిరీలు, మెడికల్​ స్టోర్​లు తప్ప అన్నీ మూసివేయాలని ఆదేశాలిచ్చారు. ఇది నేటి అర్ధరాత్రి నుంచి అమలులోకి రానున్నట్లు స్పష్టం చేశారు.

18:04 April 05

తమిళనాడులో కరోనా కేసులు @ 571

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. తమిళనాడులో గత 24 గంటల్లో 85 కరోనా కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఫలితంగా బాధితుల సంఖ్య 571కి చేరింది.

17:54 April 05

10 మంది వల్ల 26 వేల మందికి శిక్ష!

మధ్యప్రదేశ్​కు చెందిన ఓ వ్యక్తి.. తన తల్లి మృతి చెందడం వల్ల పెద్దకర్మ జరిపించాడు. ఈ కార్యక్రమానికి దాదాపు 10 మంది కరోనా లక్షణాలు కలిగిన వ్యక్తులు హాజరయ్యారు. వైద్య పరీక్షల్లో వాళ్లకు పాజిటివ్​ తేలడం వల్ల ఆ రాష్ట్ర అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ కుటుంబంతో సంబంధం ఉన్న దాదాపు 26 వేల మందికి హోమ్​ క్వారంటైన్​లో ఉండాలని ఆదేశాలిచ్చారు.

17:39 April 05

సింగపూర్​లో 72 మంది భారతీయులు

సింగపూర్​లో కరోనా సోకిన 72 మంది భారతీయుల్లో 10 మంది కోలుకున్నట్లు భారత హై కమిషనర్​ కార్యాలయం వెల్లడించింది. ఇందులో విద్యార్థులు, పర్యాటకులు ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఆ దేశంలో 700 మంది భారతీయలు చిక్కుకున్నట్లు స్పష్టం చేసింది.

17:25 April 05

కశ్మీర్​లో 14 కేసులు..

కశ్మీర్​లో 14 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. ఫలితంగా జమ్ముకశ్మీర్​లో మొత్తం కేసుల సంఖ్య 106కు చేరింది.

17:21 April 05

ఇండోర్​ మృతులు @ 9

మధ్యప్రదేశ్​లోని ఇండోర్​లో 53 ఏళ్ల మహిళ కరోనాతో మృతి చెందింది. ఈమె మృతితో జిల్లాలో మొత్తం మరణాల సంఖ్య 9కి చేరింది.

17:15 April 05

అమెరికా దుస్థితికి కారణం ఆ ప్రయాణాలేనా?

కొవిడ్‌-19 వైరస్‌ ధాటికి అగ్రరాజ్యం అమెరికా విలవిల్లాడుతోంది. ముఖ్యంగా న్యూయార్క్‌ రాష్ట్రంలో ప్రతి రెండున్నర నిమిషాలకు ఒకరు చొప్పున శనివారం ఒక్కరోజే మొత్తం 630 మంది మరణించారు. ప్రపంచవ్యాప్తంగా 12 లక్షలకు పైగా కేసులు నమోదవ్వగా.. ఒక్క అమెరికాలోనే కేసుల సంఖ్య 3 లక్షలు దాటింది. అమెరికాలో ప్రయాణాలపై ఆంక్షలు విధించకముందు లక్షల మంది చైనా నుంచి అగ్రరాజ్యానికి వచ్చినట్లు సమాచారం. సుమారు 4.30 లక్షల మంది చైనా నుంచి నేరుగా అమెరికాలోకి ప్రవేశించగా.. అందులో వుహాన్‌ నుంచి వచ్చిన వారి సంఖ్య వేలల్లో ఉందని 'న్యూయార్క్‌ టైమ్స్‌' తన కథనంలో పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రయాణాలపై ఆంక్షలు విధించడానికి ముందే.. సుమారు 1300 విమానాల్లో నేరుగా చైనా నుంచి అమెరికాలోని 17 నగరాలకు వచ్చినట్లు తెలిపింది.

17:10 April 05

పంజాబ్​ కరోనా కేసులు @ 68

పంజాబ్​లో మరో 3 కరోనా కేసులు పెరిగాయి. ఫలితంగా పాజిటివ్​ కేసుల సంఖ్య 68కి చేరింది. ఇప్పటివరకు 6 మరణాలు నమోదయ్యాయి.

17:05 April 05

కేసుల ఆధారంగా కిట్ల కేటాయింపు

దేశవ్యాప్తంగా పీపీఈ కిట్ల కొరతపై కేంద్ర ఆరోగ్య శాఖ స్పందించింది. రాష్ట్రాల్లోని కేసుల పెరుగుదల ఆధారంగా రెండు రోజుల్లో కిట్లు అందజేస్తామని తెలిపింది.

16:59 April 05

ఒడిశాలో 2 కేసులు..

ఒడిశాలోని భువనేశ్వర్​లో మరో రెండు కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. 70 ఏళ్ల ఓ వ్యక్తి ఇటీవలె ఆస్ట్రేలియా నుంచి తిరిగివచ్చాడని.. అప్పట్నుంచి హోమ్​ క్వారంటైన్​లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే వైద్య పరీక్షల్లో అతడికి కరోనా పాజిటివ్​ వచ్చినట్లు చెప్పారు. బొమ్మికల్​ ప్రాంతంలో 29 ఏళ్ల మహిళకూ కరోనా సోకినట్లు ఆ రాష్ట్ర వైద్య విభాగం వెల్లడించింది.

16:51 April 05

'బిహార్​లో పీపీఈ కిట్ల కొరత'

పర్సనల్​ ప్రొటక్టివ్​ ఎక్విప్​మెంట్​(పీపీఈ), ఎన్​ 95 మాస్కులు తగినన్ని లేవని వెల్లడించింది బిహార్​ ప్రభుత్వం. 5 లక్షల కిట్లు అవసరం కాగా 19 వేలు మాత్రమే కేంద్రం సమకూర్చిందని ఆ రాష్ట్ర ముఖ్యకార్యదర్శి వెల్లడించారు. రాష్ట్రంలో మర్కజ్​తో సంబంధం ఉన్న 32 మందిని ఇప్పటికే క్వారంటైన్​కు తరలించినట్లు ఆయన తెలిపారు.

16:46 April 05

కరోనా ఎన్ని జిల్లాల్లో ఉందంటే.?

దేశవ్యాప్తంగా 274 జిల్లాలు కరోనా వైరస్​ కారణంగా ఎఫెక్ట్​ అయినట్లు కేంద్ర వైద్య,ఆరోగ్య శాఖ వెల్లడించింది.

16:39 April 05

గుజరాత్​లో 25 లక్షల ఆరోగ్య భద్రత:

కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిరంతరం పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, వైద్య విభాగంలో పనిచేస్తున్న వారికి, రెవెన్యూ, ఆహార సరఫరా చేసే సిబ్బంది భారీ ఆరోగ్య భద్రతను ప్రకటించింది గుజరాత్​ ప్రభుత్వం. ఎవరైనా కరోనా వైరస్​తో మృతి చెందితే వారికి రూ.25 లక్షల పరిహారం అందజేయనున్నట్లు తెలిపింది.

16:30 April 05

దేశవ్యాప్తంగా మొత్తం కరోనా కేసులు @ 3374

భారత్​లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది. ప్రస్తుతం 4.1 రోజుల్లో కేసుల సంఖ్య రెట్టింపు అవతున్నట్లు కేంద్ర వైద్యశాఖ వెల్లడించింది. అయితే తబ్లీగీ జమాత్​ కేసులు లేకపోతే రెట్టింపు అయ్యేందుకు 7.4 రోజులు పట్టేదని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 3374 కేసులు నమోదయ్యాయి. ఇందులో గత 24 గంటల్లో 472 కేసులు చేరినట్లు వెల్లడించింది. మొత్తం 79 మంది మృతి చెందారని.. 267 మంది కోలుకున్నట్లు అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి.

16:20 April 05

దేశవ్యాప్తంగా 472 కొత్త కేసులు

భారత్​లో గత 24 గంటల్లో 472 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 11 మంది చనిపోయారు. ఫలితంగా మొత్తం మృతుల సంఖ్య 79కి చేరింది.

15:52 April 05

అంగన్వాడీలకు ప్రత్యేక క్లాసులు:

21 రోజుల లాక్​డౌన్​ ముగిశాక గర్భిణులు, బాలింతలు, పసిపిల్లలకు ఎటువంటి సూచనలు చేయాలో చెప్పేందుకు అంగన్వాడీ వర్కర్లకు ప్రత్యేక ఆన్​లైన్​ క్లాసులు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని మహిళా, శిశు సంక్షేమ శాఖ వెల్లడించింది. ఈ విధంగా దాదాపు 2 లక్షల మంది అంగన్వాడీ కార్యకర్తలతో సమావేశం కానున్నట్లు అధికారులు వెల్లడించారు.

15:47 April 05

మహారాష్ట్రలో కరోనా కేసులు @ 690

మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది. మొత్తం 690 కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్య విభాగం వెల్లడించింది. గత 24 గంటల్లో కొత్తగా 55 పాజిటివ్​ కేసులు వచ్చినట్లు తెలిపారు. కొత్త కేసులు ముంబయిలో 29, పుణెలో 17, పీసీఎమ్​సీలో 4, అహ్మద్​నగర్​లో 3, ఔరంగాబాద్​లో 2 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఆసుపత్రుల నుంచి 56 మంది డిశ్ఛార్జి అయినట్లు స్పష్టం చేశారు.

15:35 April 05

'లాక్​డౌన్​ పొడిగిస్తే ప్రణాళిక మారుస్తాం'

విద్యార్థులు, టీచర్ల ఆరోగ్యమే ప్రభుత్వానికి ఎక్కువ ప్రధాన్యమని వెల్లడించారు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి పోఖ్రియాల్​. ఒక వేళ ఏప్రిల్​ 14 తర్వాత లాక్​డౌన్​ పొడిగిస్తే అందుకు అనుగుణంగా ప్రణాళిక మార్చుతామని చెప్పారు. స్కూలు, కళాశాల విద్యార్థుల విద్యాసంవత్సరం నష్టపోకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే ఆయా విశ్వవిద్యాలయాలు, కళాశాలల యాజమాన్యాలతో చర్చలు జరిపినట్లు తెలిపారు. కరోనా పరిస్థితులు అంచనా వేశాక విద్యాసంస్థల పునః ప్రారంభంపై ఏప్రిల్​ 14న నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.

15:28 April 05

హరియాణాలో కరోనా కేసులు @ 76

హరియాణాలో ఇప్పటివరకు 76 కరోనా పాజిటివ్​ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్యవిభాగం వెల్లడించింది. ఇందులో నలుగురు శ్రీలంక, 20 మంది వివిధ రాష్ట్రాలకు చెందినవారు, ఒకరు నేపాల్​కు చెందిన వ్యక్తి ఉన్నట్లు తెలిపారు. అంబాలాలో తాజాగా ఒక వ్యక్తి మృతి చెందినట్లు పేర్కొన్నారు.్

15:24 April 05

  • I dialed several helpline numbers when my wife experienced labour pain on April 1 but couldn't contact with any of them. Then I rang Delhi Police which reached to us in 20 minutes&took us to a hospital. We're grateful to them: Pankaj, father of newborn baby in Badarpur #lockdown pic.twitter.com/57ODhrORx7

గర్భిణికి దిల్లీ పోలీసుల సాయం

నెలలు నిండిన ఓ గర్భిణి పురిటి నొప్పులతో బాధపడుతోందని సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ మహిళ ఇంటికి చేరుకుని.. ఆమెను 20 నిమిషాల్లో ఆస్పత్రికి తరలించిన ఘటన దిల్లీలోని బదర్‌పూర్‌లో చోటు చేసుకుంది. ఏప్రిల్‌ 1న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ మహిళకు పురిటి నొప్పులు రాగా ఆమె భర్త పలు హెల్ప్‌లైన్‌ నంబర్లకు ఫోన్‌ చేసినా ప్రయోజనం లేకుండా పోయింది.  వెంటనే అతను దిల్లీ పోలీసు సహాయ నెంబరుకు ఫోన్‌ చేయడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు కేవలం 20 నిమిషాల్లో మహిళను తమ కారులో ఆస్పత్రికి తరలించారు. ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా మహిళ భర్త పంకజ్‌ పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.

15:18 April 05

ఔరంగాబాద్​లో 5 పాజిటివ్​ కేసులు

మహారాష్ట్రలోని ఔరంగాబాద్​లో కొత్తగా 5 కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా ఈ జిల్లాలో బాధితుల సంఖ్య ఎనిమిదికి చేరింది.

15:14 April 05

గోవాలో నమోదుకాని కొత్త కరోనా కేసులు

గోవాలో 18 మంది కరోనా అనుమానితులకు వైద్య పరీక్షలు నిర్వహించగా.. ఎవరికీ నెగిటివ్​ రాలేదని ఆ రాష్ట్ర వైద్య విభాగం వెల్లడించింది. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో 7 కేసులు యాక్టివ్​గా ఉన్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో ఒక్క కరోనా మరణం సంభవించలేదని అధికారులు స్పష్టం చేశారు.

14:59 April 05

మధ్యప్రదేశ్​లో మరొకరు మృతి:

కరోనా కారణంగా మధ్యప్రదేశ్​ ఇండోర్​లో 50 ఏళ్ల ఓ వ్యక్తి మరణించాడు. ఇండోర్​లో మొత్తం మరణాల సంఖ్య ఎనిమిదికి చేరింది. అంతేకాకుండా ఈరోజు 9 పాజిటివ్​ కేసులూ ఇదే ప్రాంతంలో నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 122కు చేరింది.

14:51 April 05

ఏప్రిల్​ 15 నుంచి ఉత్తరప్రదేశ్​లో రాకపోకలు!

దేశవ్యాప్తంగా ఏప్రిల్​ 14 వరకు 21 రోజుల లాక్​డౌన్​ విధించింది కేంద్ర ప్రభుత్వం. లాక్​డౌన్​ పొడిగింపుపై ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ కీలక ప్రకటన చేశారు. ఆ రాష్ట్రంలో విడతల వారీగా ఏప్రిల్​ 15 నుంచి కర్ఫ్యూ ఎత్తివేస్తామని చెప్పారు. అయితే ప్రజలు గుంపులుగా ఉండేందుకు అనుమతి ఇవ్వమని సీఎం స్పష్టం చేశారు.

14:45 April 05

మాజీ రాష్ట్రపతుల సూచనలు కోరిన మోదీ

కరోనాపై పోరులో భాగంగా ఇప్పటికే విపక్ష పార్టీలతో సమావేశానికి పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. తాజాగా మాజీ రాష్ట్రపతులు ప్రణబ్​ ముఖర్జీ, ప్రతిభా పాటిల్​ను ఆహ్వానించారు. కరోనా కట్టడిపై తమ సూచనలు ఇవ్వాలని కోరారు. అంతేకాకుండా మాజీ ప్రధానులు మన్మోహన్​ సింగ్​, హెచ్​డీ దేవగౌడనూ కొవిడ్​-19 నియంత్రణపై సలహాలివ్వాలని కోరారు. ఇప్పటికే ఆయా పార్టీల ముఖ్యనేతలు సోనియా గాంధీ, ములాయం సింగ్​ యాదవ్​, అఖిలేశ్​ యాదవ్​, మమతా బెనర్జీ, నవీన్​ పట్నాయక్​, కే.చంద్రశేఖర్​ రావు, ఎమ్​కే స్టాలిన్​, ప్రకాశ్​ సింగ్​ బాదల్​కూ పిలుపునిచ్చారు. వీరందరూ ఈ నెల 8న దేశంలో పరిస్థితులపై వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా చర్చించనున్నారు.

13:41 April 05

'పీఎం కేర్స్​'కు ఇండియన్​ బ్యాంక్​ భారీ విరాళం:

కరోనాపై పోరాటంలో భాగంగా ప్రధాని మోదీ ప్రారంభించిన 'పీఎం కేర్స్'​కు బారీ విరాళం ఇస్తున్నట్లు ప్రకటించింది ఇండియన్​ బ్యాంక్​. దేశవ్యాప్తంగా ఈ బ్యాంక్​ల్లో పనిచేస్తున్న 43వేల మంది ఉద్యోగులు ఒకరోజు వేతనాన్ని ఇందుకు విరాళంగా ఇస్తున్నట్లు తెలిపింది. ఈ విధంగా సేకరించిన రూ.8.10 కోట్లను ప్రధానమంత్రి సహాయనిధికి అందజేయనున్నట్లు స్పష్టం చేసింది.

13:15 April 05

మర్కజ్​కు దిల్లీ క్రైమ్ బ్రాంచ్​ అధికారులు​:

దిల్లీ క్రైమ్​ బ్రాంచ్​ పోలీసులు.. నిజాముద్దీన్​లోని మర్కజ్​ను పరిశీలించారు. ఏప్రిల్​ 1న దాదాపు 2,300 మంది పైగా ఈ కార్యక్రమానికి హాజరవడంపై పలు విషయాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే తబ్లీగీ జమాత్​ అధ్యక్షుడు మౌలానా సాద్​పై కేసు నమోదు చేశామని.. ఆ దర్యాప్తులో భాగంగానే మర్కజ్​ను పరిశీలించేందుకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా నమోదైన 30 శాతం కరోనా కేసులు మర్కజ్​కు హాజరైన వ్యక్తుల ద్వారే వ్యాపించినట్లు.. శనివారం కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.

13:04 April 05

స్వయం సహాయక బృందాలతో.. మాస్కుల తయారీ

కరోనా వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో మాస్కుల వినియోగం ఎక్కువైంది. ఈ నేపథ్యంలో డిమాండ్​కు తగ్గ సరఫరా లేనందు వల్ల ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలోని 400 స్వయం సహాయక బృందాల(ఎస్​హెచ్​జీ) సహకారంతో దాదాపు 10 లక్షల మాస్కులు తయారు చేసి ప్రజలకు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మిషన్​ శక్తి కార్యక్రమంలో భాగస్వాములైన మహిళలు ఇందులో పనిచేస్తున్నారు. వీరి ద్వారా రోజుకు 50వేల మాస్కులు తయారు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర అధికారులు వెల్లడించారు.

12:55 April 05

'మళ్లీ ఐసోలేషన్​ వార్డులో పనిచేస్తా'

కేరళలో 32 ఏళ్ల రేష్మ మోహన్​దాస్​ అనే నర్సు కొవిడ్​-19 నుంచి బయటపడింది. కరోనా పాటిజివ్​ వచ్చిన ఇద్దరు దంపతులను పర్యవేక్షించే క్రమంలో ఆమెకు వైరస్​ సోకింది. అయితే 14 రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆ నర్సు.. ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నట్లు వైద్యులు తెలిపారు. అనంతరం మాట్లాడిన రేష్మ.. కరోనాను జయించడం పట్ల హర్షం వ్యక్తం చేసింది. అంతేకాకుండా కరోనాపై పోరాటంలో భాగంగా మళ్లీ ఐసోలేషన్​ వార్డులో పనిచేసేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు చెప్పింది.

12:43 April 05

లాక్​డౌన్​ తర్వాతే భారత్​కు ఆ 40వేల మంది!

ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆయా దేశాలు లాక్​డౌన్ విధించాయి. ఈ​ నేపథ్యంలో భారత్​కు చెందిన 40వేల మంది నేవీ సంబంధిత అధికారులు అక్కడక్కడ చిక్కుకుపోయారు. వారిలో మర్చంట్​ నేవీకి చెందిన వాళ్లు 15వేల మంది, 500 మంది కార్గో ఓడల్లో పనిచేసేవాళ్లు, 25వేల మంది క్రూయిజ్​ షిప్​ల్లో పనిచేస్తున్నవాళ్లు నిర్బంధంలో ఉండిపోయినట్లు అధికారులు స్పష్టం చేశారు. భారత్​లో లాక్​డౌన్​ పూర్తికాగానే వారందరినీ స్వదేశానికి తీసుకొస్తామని నేవీ అధికారులు వెల్లడించారు.  ఇప్పటికే ప్రభుత్వం ఈ విషయంపై చర్చలు జరిపినట్లు స్పష్టం చేశారు.

12:21 April 05

diyas
రోడ్లపై మట్టి దివ్వెల అమ్మకాలు

మట్టి దివ్వెలకు గిరాకీ:

ఈరోజు రాత్రి 9 గంటల 9 నిముషాలకు దీపాలు, కొవ్వొత్తలు, టార్చి లైట్ల ద్వారా అందరూ ఇళ్లలో కాంతులు వెలిగించాలని ప్రధాని మోదీ ప్రకటించారు. ఇందుకు ప్రజల నుంచి విశేష స్పందన లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్​లోని మొరాదాబాద్​లో మట్టి దివ్వెలకు బాగా గిరాకీ పెరిగింది.

12:00 April 05

food serve to people
ఆహార తయారీలో నిమగ్నమైన మహిళలు

సామాజిక సేవ..

పంజాబ్​ లుధియానాలో 'రాధా సోమి సంత్సంగ్​ బియాస్​ కేంద్రం' నిర్వాహకులు​ సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రతి రోజు దాదాపు 6.50 లక్షల ఆహారాన్ని ప్యాకెట్ల రూపంలో ప్రజలకు స్వచ్ఛందంగా అందజేస్తున్నట్లు తెలిపారు.

11:51 April 05

పుణెలో మృతుల సంఖ్య @ 4

కరోనా కారణంగా పుణెలోని ఓ ప్రైవేసు ఆసుపత్రిలో 52 ఏళ్ల మహిళ చనిపోయింది. గత 24 గంటల్లో మహమ్మారితో ఇద్దరు చనిపోయినట్లు వైద్య విభాగం ప్రకటించింది. ఫలితంగా జిల్లాలో మొత్తం మృతుల సంఖ్య నాలుగుకు చేరింది.

11:46 April 05

మహారాష్ట్రలో మహమ్మారి:

మహారాష్ట్రలో కరోనా వైరస్​ బాధితుల సంఖ్య పెరుగుతోంది. మరో 26 కొత్త వైరస్​ పాజిటివ్​ కేసులు వచ్చినట్లు ఆ రాష్ట్ర వైద్య విభాగం ప్రకటించింది. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 661కి చేరింది.

11:36 April 05

drone
ఉత్తరాఖండ్​లో డ్రోన్లతో పోలీసుల గస్తీ

ఉత్తరాఖండ్​లో డ్రోన్​ గస్తీ:

లాక్​డౌన్​ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో గస్తీ కాసేందుకు డ్రోన్లను వినియోగిస్తున్నారు ఉత్తరాఖండ్​ పోలీసులు. ఈ విధంగా ప్రజల రాకపోకలు, ఉల్లంఘనులపై నిరంతరం కన్నేసి ఉంచుతున్నట్లు తెలిపారు.

11:28 April 05

కరోనాతో విలవిల్లాడుతున్న న్యూయర్క్​:

కరోనా విజృంభణతో అమెరికా కంటిపై కునుకులేకుండా పోతోంది. ఈ నేపథ్యంలో ప్రధాన పట్టణం న్యూయర్క్​లో గత 24 గంటల్లో భారీగా మరణాలు నమోదయ్యాయి. 630 మంది చనిపోయినట్లు గవర్నర్​ ఆండ్రూ కుమో వెల్లడించారు. అగ్రరాజ్యంలో ప్రతీ రెండున్నర నిముషాలకు ఒకరు వైరస్​ బారిన పడుతున్నట్లు ఆ దేశ అధికారులు వెల్లడించారు.

11:16 April 05

birthday cake
ఆసుపత్రిలోనే కరోనా సోకిన​ బాలుడికి పుట్టినరోజు

ఆసుపత్రిలోనే కరోనా సోకిన​ బాలుడికి పుట్టినరోజు:

రెండేళ్ల కరోనా పాజిటివ్‌ బాలుడికి పుట్టిన రోజు వేడుకలు జరిపిన ఘటన పంజాబ్‌లోని నవన్‌షార్‌ సివిల్‌ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. నవన్‌షార్‌ ప్రాంతానికి చెందిన ఓ 70 ఏళ్ల వృద్ధుడు ఇటీవల కరోనా వైరస్‌ సోకడం వల్ల మృతిచెందాడు. ఈ నేపథ్యంలోనే అతని కుటుంబంలోని 14 మందికి వైరస్‌ వ్యాపించింది. అందులో రెండేళ్ల బాలుడితో పాటు అతని తల్లి కూడా ఉన్నారు. వీరిద్దరినీ ఆసుపత్రికి తరలించి ఐసోలేషన్‌ కేంద్రంలో చికిత్స అందిస్తున్నారు. శనివారం ఆ బాలుడి రెండో పుట్టిన రోజుగా గుర్తించిన ఆసుపత్రి సిబ్బంది వేడుకలు నిర్వహించారు. బాలుడికి కొత్త బట్టలు, చాక్లెట్లు బహుమతులుగా ఇచ్చారు. బర్త్‌డే కేక్‌ కూడా తెద్దామనుకున్నారని, లాక్‌డౌన్‌ కారణంగా అది వీలుకాలేదని ఆస్పత్రి సీనియర్‌ వైద్యాధికారి హర్విందర్‌ సింగ్‌ పేర్కొన్నారు.

11:12 April 05

ఆర్డినెన్స్​ ఫ్యాక్టరీ ముందడుగు:

దేశవ్యాప్తంగా 10 ఆసుపత్రుల్లో 280 ఐసోలేషన్​ బెడ్​లు ఏర్పాటు చేసేందుకు ఆర్డినెన్స్​ ఫ్యాక్టరీ ప్రణాళిక రచిస్తోంది. బెంగళూరులోని హిందుస్థాన్​ ఎరోనాటిక్స్​ లిమిటెడ్​(హాల్​)లో 3 బెడ్​లు కలిగిన ఐసీయూ, 30 బెడ్​లతో వార్డులు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా 93 మందికి వైద్య సదుపాయం అందించవచ్చని అధికారులు తెలిపారు.

11:08 April 05

ముందు నెగిటివ్​.. తర్వత మృతి

పుణెలోని ఓ ఆసుపత్రిలో 60 ఏళ్ల మహిళ కరోనాతో మృతి చెందింది. ఏప్రిల్​ 3న మృతి చెందిన ఈమెకు తొలుత వైద్య పరీక్షలు చేశారు. అందులో కరోనా నెగిటివ్​ వచ్చిందని.. తాజాగా చనిపోయిన తర్వాత పరీక్షించగా పాజిటివ్​ వచ్చినట్లు వైద్యులు వెల్లడించారు.

10:59 April 05

drdo enclosure
డీఆర్​డీఓ రూపొందించిన ఎన్‌క్లోజర్‌

కరోనాపై 'డీఆర్​డీఓ' వినూత్న అస్త్రం:

కరోనా బారి నుంచి తప్పించుకోవడానికి మనం మాటిమాటికీ చేతులు కడుక్కుంటున్నాం. మరి మనిషి మొత్తంగా ఒకేసారి శుభ్రపడాలంటే?.. అందుకే ఓ పరికరాన్ని (ఎన్‌క్లోజర్‌) డీఆర్‌డీఓ రూపకల్పన చేసింది. మహారాష్ట్రలోని అహమ్మద్‌నగర్‌ ల్యాబొరేటరీలో దీన్ని రూపొందించారు. ఒకసారి ఒక వ్యక్తి ఇందులోకి వెళ్లి నిలబడితే విద్యుత్‌ ఆధారంగా నడిచే పంపు 25 సెకన్లపాటు ఇన్‌ఫెక్షన్లను నిర్మూలించే హైపోసోడియం క్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేస్తుంది. తర్వాత దానంతట అదే ఆగిపోతుంది. 700 లీటర్ల సామర్థ్యంతో ఉండే ట్యాంకును ఒకసారి నింపితే 650 మందిని శుభ్రం చేస్తుంది. లోపల జరుగుతున్న ప్రక్రియ బయటకు కనిపించేలా ఎన్‌క్లోజర్‌కు ఇరువైపులా అద్దాలు ఏర్పాటు చేశారు. దూరంగా ఏర్పాటుచేసిన కేబిన్‌ ద్వారా ఓ ఆపరేటర్‌ మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షిస్తారు. ఇందులోకి వెళ్లే వ్యక్తులు తప్పనిసరిగా ఓ జాగ్రత్త తీసుకోవాలి. పిచికారీ సమయంలో కళ్లు, చెవులను పూర్తిగా మూసుకొని ఉండాలి. ఉత్తరప్రదేశ్‌లోని డీహెచ్‌ లిమిటెడ్‌ అనే సంస్థతో కలిసి డీఆర్‌డీఓ దీన్ని 4 రోజుల్లో తయారు చేసింది. ఆసుపత్రులు, మాల్స్‌, కార్యాలయాలు, ఇతర వ్యవస్థల్లోకి వెళ్లి వచ్చేవారిని శుభ్రం చేయడానికి ఇది ఉపయోగపడుతుందని డీఆర్‌డీఓ తెలిపింది.

10:53 April 05

గుజరాత్​లో 11 కేసులు:

గుజరాత్​లో కొత్తగా 11 కరోనా వైరస్​ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒక మహిళ కూడా ఉన్నట్లు ఆ రాష్ట్ర వైద్య విభాగం వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం పాజిటివ్​ కేసుల సంఖ్య 122కు చేరగా.. ఇందులో 55 కేసులు అహ్మదాబాద్​ నుంచే వచ్చాయి.

10:47 April 05

మూడో అంతస్థు నుంచి దూకేశాడు!

కరోనా అనుమానిత వ్యక్తి ఆసుపత్రి మూడో అంతస్థు నుంచి దూకేసిన ఘటన దిల్లీలో చోటు చేసుకుంది. ఆ వ్యక్తి కాలుకు బలమైన గాయమైనట్లు వైద్యులు వెల్లడించారు. అయితే చికిత్స అనంతరం క్షేమంగానే ఉన్నట్లు తెలిపారు. కరోనా టెస్టులూ పూర్తయ్యాయని.. ఫలితాల కోసం ఎదురుచూస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

10:41 April 05

ఛత్తీస్​గఢ్​లో ముగ్గురు సేఫ్​...

ఛత్తీస్​గఢ్​లో మరో ముగ్గురు కరోనాను జయించారు. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య ఏడుకు చేరిందని అధికారులు వెల్లడించారు.

10:36 April 05

mobile super market
మొబైల్​ సూపర్​మార్కెట్

మొబైల్​ సూపర్​మార్కెట్లు:

కరోనా లాక్​డౌన్​ నేపథ్యంలో నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచేందుకు కేరళ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. తిరువనంతపురంలో 12 మొబైల్​ సూపర్​మార్కెట్లను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా ఇంటివద్దకే వచ్చి ప్రజలకు అవరసమైన సరకులు అందజేస్తున్నారు.

10:29 April 05

తమిళనాడులో ఇద్దరు మృతి:

తమిళనాడులో కరోనా వైరస్​ పాజిటివ్​ లక్షణాలతో ఇద్దరు మృతి చెందారు. ఫలితంగా ఈ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 5కు చేరింది.

10:26 April 05

చైనాలో మళ్లీ కరోనా కేసులు...

కొవిడ్​-19 స్వస్థలం చైనాలో మళ్లీ కరోనా వైరస్​ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 30 కొత్త కేసులు వచ్చినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. వీటిలో పాటు 47 మందికి లక్షణాలు లేని కరోనా సోకినట్లు స్పష్టం చేశారు. 

కరోనా తగ్గిన తర్వాత కొత్తగా లక్షణాలు లేకుండా వైరస్​ కేసులు నమోదవుతున్నట్లు చైనా ఇటీవలె ప్రకటించింది. ఇలాంటి వారిని ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచినట్లు ఆ దేశ వైద్య విభాగం వెల్లడించింది. మొత్తం కరోనా 2.ఓ కేసులు 1024కు పెరిగాయి.

10:18 April 05

రాష్ట్రాల వారీగా కరోనా లెక్కలు..

దేశవ్యాప్తంగా కరోనా వైరస్​ వ్యాప్తి ఎక్కువగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో అత్యధికంగా 490 మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. తమిళనాడులో 485, దిల్లీలో 445, కేరళలో 306, తెలంగాణలో 269, ఉత్తరప్రదేశ్​లో 227 కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది.

రాజస్థాన్​లో 200, ఆంధ్రప్రదేశ్​లో 161, కర్ణాటకలో 144, గుజరాత్​లో 105, మధ్యప్రదేశ్​లో 104 కేసులు నమోదవగా.. జమ్ముకశ్మీర్​లో 92, పశ్చిమ బంగాలో 69, పంజాబ్​లో 57, హరియాణాలో 49, బిహార్​లో 30, అసోంలో 24, ఉత్తరాఖండ్​లో 22, ఒడిశాలో 20, ఛత్తీస్​గఢ్​లో 22, లద్ధాఖ్​లో 14 మంది కరోనా బారిన పడినట్లు వెల్లడించారు.

అండమాన్​ నికోబార్​ దీవుల్లో 10, ఛండీగఢ్​లో 10, గోవాలో 7, హిమాచల్​ ప్రదేశ్​లో ​6, పుదుచ్చేరిలో 5 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా జార్ఖండ్​, మణిపుర్​లో చెరో రెండు కేసులు, మిజోరాం, అరుణాచల్​ప్రదేశ్​​లో చెరో కేసు వచ్చినట్లు గణాంకాలు విడుదల చేసింది కేంద్ర ఆరోగ్యశాఖ.

10:02 April 05

దేశంలో కరోనా మృతులు @ 77

భారత్​లో కరోనా వైరస్​ కేసులు 3,374కు పెరిగాయి. ఇప్పటివరకు మొత్తం 77 మంది చనిపోయినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. 3030 కేసులు యాక్టివ్​లో ఉండగా, 26 మందిని డిశ్చార్జి చేశారు. ఒక వ్యక్తి విదేశాలకు వెళ్లిపోయాడు.

ఇప్పటివరకు మహారాష్ట్రలో అత్యధికంగా 24 మంది మృతి చెందారు. గుజరాత్​లో 10, తెలంగాణలో 7, మధ్య ప్రదేశ్​, దిల్లీలో చెరో ఆరు, పంజాబ్​లో 5 మంది మరణించారు. కర్ణాటక - 4, పశ్చిమ బంగా - 3, తమిళనాడు - 3, జమ్ముకశ్మీర్​, ఉత్తరప్రదేశ్, కేరళలో చెరో రెండేసి మరణాలు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్​, బిహార్​, హిమాచల్​ ప్రదేశ్​లో ఒక్కొక్కరు చనిపోయారు.

09:46 April 05

రాజస్థాన్​లో మరో మరణం..

రాజస్థాన్​లోని జైపూర్​కు చెందిన ఓ వ్యక్తి కరోనాతో మృతిచెందాడు. ఫలితంగా ఈ రాష్ట్రంలోని మొత్తం మృతుల సంఖ్య 6కు చేరింది.

09:12 April 05

77కు చేరిన కరోనా మరణాలు- కేసుల సంఖ్య 3,374

దేశంలో కరోనా మరణాల సంఖ్య 77కు చేరింది. మొత్తం 3,374 కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య శాఖ ఈమేరకు తాజా గణాంకాలు విడుదల చేసింది.

Last Updated : Apr 8, 2020, 8:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.