భారత్లో కరోనా కేసులు పెరుగుతుండటం వల్ల వైరస్ నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ప్రజలు కూడా మాస్క్లు లేకుండా బయటకు రావటానికి ఇష్టపడటం లేదు. పరిశుభ్రతపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. మరోవైపు అంతర్జాల ఆహార సంస్థలు సైతం తమ వంతు సాయం చేసేందుకు ముందుకొస్తున్నాయి.
ఆహారాన్ని డెలివరీ చేయడమే కాకుండా శానిటైజర్లను ఉచితంగా వినియోగదారులను అందిస్తున్నాయి. డెలివరీ బాయ్స్ కూడా.. ఆహారాన్ని అందించిన తర్వాత చేతులు బాగా శుభ్రం చేసుకొని తినాలని చెబుతున్నారు. ఇలా శానిటైజర్లను అందించడంపై వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి:బ్రెజిల్ వరదల్లో 46 మంది ఆచూకీ గల్లంతు