ప్రపంచాన్ని కలవర పెడుతున్న కరోనా మహమ్మారిని ఎవరూ నియంత్రించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో వైరస్‌ను అంతంచేసే విఘ్నేశుడి విగ్రహాన్ని రూపొందిస్తున్నాడు కర్ణాటక హుబ్లీకి చెందిన సచిన్ కుంబర. 'విఘ్న వినాయక్' సందేశంతో దీనిని తయారు చేస్తున్నాడు.
కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ను ఇంకా కనుగొనలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సచిన్ రూపొందిస్తున్న 'కరోనా సంహారి గణేశ్' అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.