దేశవ్యాప్తంగా కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. 24 గంటల్లోనే 36 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 1,553 మందికి వైరస్ సోకింది.
మహారాష్ట్రలో అత్యధికంగా 4,203 కేసులు నమోదయ్యాయి. 223 మంది మరణించారు. మహారాష్ట్ర తర్వాత స్థానంలో 2003 కేసులతో దిల్లీ ఉంది.
గుజరాత్లో కొత్తగా 108మందికి..
గుజరాత్లో కొత్తగా 108 మందికి కరోనా సోకింది. రాష్ట్రంలో వైరస్ బాధితుల సంఖ్య 1851కి చేరింది. రాష్ట్రంలో మరో నలుగురు వైరస్‌కు బలయ్యారు. మొత్తం మృతుల సంఖ్య 67కు పెరిగింది.
బిహార్‌లో..
బిహార్‌లో మరో ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 96కు చేరింది. ఇప్పటివరకు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
రాజస్థాన్‌లో 1478, తమిళనాడులో 1477, మధ్యప్రదేశ్‌లో 1407 మంది వైరస్ బారిన పడ్డారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో 1084 కేసులు నమోదయ్యాయి.