భారత్‌లో కరోనా కేసులు మరింతగా పెరిగిపోతున్నాయి. ఒక్కరోజులో 28,637 మందికి వైరస్ నిర్ధరణ అయింది. మరో 551 మంది ప్రాణాలు కోల్పోయారు.
- మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తోంది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,38,461కి చేరింది. 9,893 మంది వైరస్‌కు బలయ్యారు.
- తమిళనాడులో కేసులు 1,30,261కి చేరాయి. 1,829 మంది ప్రాణాలు కోల్పోయారు.
- దిల్లీలో కొవిడ్ బాధితుల సంఖ్య 1,09,140గా ఉంది. మొత్తంగా 3,300 మంది మృతి చెందారు.
- గుజరాత్లో మొత్తంగా 40,069 మందికి వైరస్ నిర్ధరణ అయింది. 2,022 మంది కరోనా కారణంగా చనిపోయారు.
ఇదీ చూడండి: కరోనా కాటుకు మానవత్వం మరుగున పడుతోందా!