వైద్యులపై దాడులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలను కేంద్రం కోరింది. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్... ఈమేరకు ముఖ్యమంత్రులు అందరికీ లేఖలు రాశారు. బంగాల్లో వైద్యులపై దాడి, తదనంతర పరిణామాల నేపథ్యంలో ఈ సూచనలు చేశారు హర్షవర్ధన్.
" దేశవ్యాప్తంగా ఉన్న చాలామంది వైద్యులు నిరసనల్లో పాల్గొంటున్నారు. వైద్య సేవలు అందించటం లేదు. బంగాల్లో వైద్యుల ఆందోళనలతో దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులు సమ్మె చేసే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి ఘటనలు భవిష్యత్లో జరగకుండా చూడాలి. వైద్యులపై దాడులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి."
- హర్షవర్ధన్, కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి
వైద్యులు, వైద్య రంగ నిపుణుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని అన్ని రాష్ట్రాల్ని కోరారు కేంద్ర మంత్రి. భారతీయ వైద్య సంఘం-ఐఎమ్ఏ రూపొందించిన "వైద్య సేవల సిబ్బంది, సంస్థల పరిరక్షణ చట్టం-2017" బిల్లు ముసాయిదాను లేఖతోపాటు జతచేశారు.
ఇదీ చూడండి: బంగాల్లో హింస, సమ్మెపై కేంద్రహోంశాఖ ఆరా