కాంగ్రెస్ నేత డీకే శివకుమార్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా.. ఆయన కుమార్తె ఐశ్వర్య గురువారం ఈడీ ముందుకు హాజరయ్యారు. పీఎంఎల్ఏ (మనీ లాండరింగ్ నిరోధక చట్టం) కింద 22ఏళ్ల ఐశ్వర్య వాంగ్మూలాన్ని నమోదు చేయనుంది ఈడీ.
2017లో తన కుమార్తెతో కలిసి సింగపూర్ పర్యటనకు వెళ్లినట్లుగా శివకుమార్ చేసిన వ్యాఖ్యలపై ఆమెను ప్రశ్నించనున్నారు. పర్యటనకు సంబంధించిన పత్రాలు, వివరాలను ఐశ్వర్య నుంచి సేకరించనున్నారు ఈడీ అధికారులు.
తండ్రి శివకుమార్‌కు చెందిన ఓ విద్యాసంస్థ ట్రస్ట్‌లో సభ్యురాలు ఐశ్వర్య. అనేక ఆస్తులు, ఇంజనీరింగ్ సహా అనేక కళాశాలకు చెందిన కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలను ఈ ట్రస్ట్ చూసుకుంటోంది.
పన్ను ఎగవేత, హవాలా లావాదేవీల విషయంలో.. శివకుమార్‌ను సెప్టెంబర్ 3న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేయగా, ప్రస్తుతం ఆయన ఈడీ కస్టడీలోనే ఉన్నారు.
ఇదీ చూడండి:- మనీ లాండరింగ్ కేసులో డీకే శివకుమార్ అరెస్ట్