ETV Bharat / bharat

'పార్లమెంట్​ సమావేశాలను వర్చువల్​ విధానంలో నిర్వహించాలి'

పార్లమెంట్​ సమావేశాలను వర్చువల్​ విధానం ద్వారా నిర్వహించాలని కాంగ్రెస్​ పార్టీ డిమాండ్​ చేసింది. భారత్​ చైనా సరిహద్దు వివాదంతో పాటు చర్చించటానికి అనేక ముఖ్యమైన అంశాలు ఉన్నాయని ఆ పార్టీ అధికార ప్రతినిధి పవాన్​ ఖేరా వెల్లడించారు.

Cong seeks virtual Parliament session to discuss LAC stand-off
'వర్చువల్​ విధానం ద్వారా పార్లమెంట్​ సమావేశాలను నిర్వహించండి'
author img

By

Published : Jun 25, 2020, 5:34 PM IST

వర్చువల్​ విధానం ద్వారా పార్లమెంట్​ సమావేశాలు నిర్వహించాలని కేంద్రాన్ని డిమాండ్​ చేసింది కాంగ్రెస్. దేశంలో చర్చించాల్సిన సమస్యలు ఎన్నో ఉన్నాయని.. వాటిల్లో భారత్​-చైనా సరిహద్దు వివాదం అతి ముఖ్యమైనదని తెలిపింది.

ఈ సందర్భంగా 1962 యుద్ధ సమయంలోనూ అప్పటి భాజపా నేత అటల్​ బిహారీ వాజ్​పేయి పార్లమెంట్​ సమావేశాలను జరపాలని డిమాండ్​ చేసినట్లు గుర్తుచేశారు కాంగ్రెస్​ అధికార ప్రతినిధి పవాన్​ ఖేరా. ఆయన డిమాండ్​ను స్వాగతిస్తూ నాటి ప్రధానమంత్రి జవహర్​లాల్​ నెహ్రూ​ సమావేశాలను నిర్వహించినట్లు స్పష్టం చేశారు.

"ముఖ్యమైన అంశాలపై చర్చించటానికి పార్లమెంటు సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. చర్చించాల్సిన అంశాలు ఎన్నో ఉన్నప్పటికీ పార్లమెంటరీ కమిటీలు కూడా సమావేశం కావటం లేదు" అని పవన్​ ఖేరా అభిప్రాయపడ్డారు.

సమస్యలను ప్రతి ఒక్కరూ చర్చించి, వాటి పరిష్కారాలపై ఒక వ్యూహాన్ని రచించటానికి ఉన్న ఏకైక మార్గం.. పార్లమెంట్ సమావేశాలని ఖేరా పేర్కొన్నారు.

అయితే సమస్యలను చర్చించకుండా ఉండేందుకు ప్రభుత్వం వివిధ మార్గాలను అన్వేషిస్తున్నట్లు ఎద్దేవా చేశారు కాంగ్రెస్​ పార్టీ ప్రతినిధి మనీశ్​ తీవారి. ఉభయసభలను నిర్వహించటానికి అధికారులు ప్రయత్నించాలే కానీ.. వాటిని అడ్డుకుంటుండటం దురదృష్టకరమన్నారు.

రష్యా, భారత, చైనా త్రైపాక్షిక శిఖరాగ్ర సమావేశాలు, జీ-20 సదస్సు, చైనాపై అఖిలపక్ష సమావేశం నిర్వహించగలిగినప్పుడు.. పార్లమెంట్​ సమావేశాలను వర్చవల్​ విధానంలో ఈ ప్రభుత్వం ఎందుకు నిర్వహించటం లేదని ప్రశ్నించారు కాంగ్రెస్​ ప్రతినిధి.

ఇదీ చూడండి:రేపటినుంచి ఆ రాష్ట్రాల్లో కేంద్ర బృందం పర్యటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.