కాంగ్రెస్, మహాకూటమి పార్టీలపై ధ్వజమెత్తారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. పేదలు, మహిళలను ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే వినియోగించుకున్నారు తప్ప వారికోసం చేసిందేమీ లేదని ఆరోపించారు. ఉత్తర్ప్రదేశ్ గాజీపుర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు మోదీ. కాంగ్రెస్, మహాకూటమిపై విమర్శలు గుప్పించారు. రాజస్థాన్లో ఎస్సీ మహిళపై జరిగిన అత్యాచార ఘటనను కాంగ్రెస్ రాజకీయ లబ్ధి కోసం బయటికి రాకుండా చూస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు.
" నా కులమేంటని వాళ్లు సర్టిఫికెట్ అడుగుతున్నారు. వారికి నా సమాధానం... నాది ఒకటే కులం. పేదలది ఏ కులమే నాదీ అదే కులం. రాజస్థాన్లో ఒక ఎస్సీ మహిళపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులను పట్టుకోవాల్సింది పోయి అధికార కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసులు కేసును దాచే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల వేళ ఈ విషయం బయటికి పొక్కితే వాళ్ల ఓటు బ్యాంకుపై ప్రభావం పడుతుందని వాళ్లు ఇలా చేస్తున్నారు."
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
ఇదీ చూడండి: 'సార్వత్రికం' ఆరో దశకు రంగం సిద్ధం