ETV Bharat / bharat

ఓటమిపై రాహుల్​తో నేడు కాంగ్రెస్ సీఎంల భేటీ - ముఖ్యమంత్రులు

రాహుల్​ గాంధీతో నేడు కాంగ్రెస్​ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కానున్నారు. లోక్​సభ ఎన్నికల్లో పార్టీ ఓటమిపై అధ్యక్షుడికి సంఘీభావం తెలపనున్నారు. ఓటమికి సీఎంలే నైతిక బాధ్యత వహిస్తారని రాజస్థాన్​ ముఖ్యమంత్రి అశోక్​ గెహ్లోత్​ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని నడిపించేందుకు రాహుల్​ సమర్థుడని తెలిపారు.

ఓటమిపై రాహుల్​తో నేడు కాంగ్రెస్ సీఎంల భేటీ
author img

By

Published : Jul 1, 2019, 5:36 PM IST

సార్వత్రిక ఎన్నిక్లలో పార్టీ ఓటమిపై కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీకి సంఘీభావం తెలపనున్నారు కాంగ్రెస్​ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు. నేడు పార్టీ అధ్యక్షుడితో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా లోక్​సభ ఎన్నికల్లో ఓటమిపై తమదే నైతిక బాధత్య అని పేర్కొన్నారు రాజస్థాన్​ ముఖ్యమంత్రి అశోక్​ గెహ్లోత్​.

రాజస్థాన్​, పంజాబ్​, మధ్యప్రదేశ్​, ఛత్తీస్​గఢ్​, పుదుచ్చేరిలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. కానీ లోక్​సభ ఎన్నికల్లో 52 స్థానాలకే పరిమితమైంది.

పార్టీ ఓటమిపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉందని తెలిపారు గెహ్లోత్​. పార్టీ అధ్యక్షుడిగా రాహుల్​ సమర్థుడని ట్వీట్​ చేశారు.

" సంఘీభావం తెలిపేందుకు కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీని తన నివాసంలో కాంగ్రెస్​ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులంతా నేడు కలవనున్నారు. కాంగ్రెస్​ పార్టీతోనే ఉంటామని గతంలోనే మేము చెప్పాం. 2019 ఎన్నికల్లో పార్టీ ఓటమికి తమదే నైతిక బాధ్యత. ప్రస్తుత పరిస్థితుల్లో రాహుల్​ మాత్రమే పార్టీని నడిపించగలడని మేము నమ్ముతున్నాం. మన దేశ శ్రేయస్సు పట్ల నిబద్ధత, రాజీలేని తత్వం ఆయనలో ఉన్నాయి. ఆయనకు మరొకరు సాటిరారు. "

- అశోక్​ గెహ్లోత్​, రాజస్థాన్​ ముఖ్యమంత్రి.

2019 ఎన్నిక్లలో కాంగ్రెస్​ పార్టీ ఓటమి తన కార్యక్రమాలు, విధానాలు, ఆలోచనలతో కాదన్నారు గెహ్లోత్​. ప్రభుత్వ వనరులతో భాజపా తన తప్పులను జాతీయ వాదం వెనక దాచిపెట్టిందని ఆరోపించారు.

Intro:Body:

pp

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.