ETV Bharat / bharat

నేపాల్‌ చర్య సమర్థనీయం కాదు: భారత్‌

author img

By

Published : Jun 13, 2020, 10:59 PM IST

భారత్​లోని మూడు భూభాగాలు తమవంటూ నేపాల్​ తీసుకొచ్చిన కొత్త మ్యాప్​ను ఆ దేశ పార్లమెంట్​ ఆమోదించటాన్ని భారత్​ తప్పుబట్టింది. నేపాల్​ ప్రభుత్వ చర్య సమర్ధనీయం కాదని, చారిత్రక వాస్తవాలను మరిచి వ్యవహరిస్తోందని ఆరోపించింది.

Communist group tries to march to Lipulekh to plant a Nepali flag, stopped by Nepal
నేపాల్‌ చర్య సమర్థనీయం కాదు: భారత్‌

భారత్‌కు చెందిన మూడు భూభాగాలను తమవిగా పేర్కొంటూ నేపాల్‌ తీసుకొచ్చిన మ్యాప్‌కు ఆ దేశ పార్లమెంట్‌ ఆమోదం తెలపడంపై భారత్‌ స్పందించింది. నేపాల్‌ ప్రభుత్వ చర్య ఎంతమాత్రం సమర్థనీయం కాదని పేర్కొంది. చారిత్రక వాస్తవాలను ఆ దేశం విస్మరించిందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాత్సవ పేర్కొన్నారు.

"భారత భూభాగాలను తమవిగా పేర్కొంటూ చేసిన రాజ్యాంగ సవరణ బిల్లుకు నేపాల్ దిగువ సభ ఆమోదం తెలిపింది. మ్యాప్‌ విషయంలో ఇది వరకే మా వైఖరిని స్పష్టంచేశాం. చారిత్రక వాస్తవాలను, సాక్ష్యాలను విస్మరించి కృత్రిమంగా ఆ భూభాగాలను నేపాల్‌ తమవిగా చెప్పుకోవడం ఎంతమాత్రం సమర్థనీయం కాదు "

-అనురాగ్‌ శ్రీవాత్సవ, భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి

సరిహద్దు అంశానికి సంబంధించి కలిసి చర్చించుకోవాలన్న అవగాహనను నేపాల్‌ ఉల్లంఘించిందన్నారు. భారత్‌ భూభాగాలైన లిపులేఖ్‌, కాలాపానీ, లింపియాధురా ప్రాంతాలను తమ భూభాగాలుగా పేర్కొంటూ నేపాల్‌ తీసుకొచ్చిన వివాదాస్పద కొత్త మ్యాప్‌కు పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు దిగువ సభ శనివారం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో భారత్‌ ఈ విధంగా స్పందించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.