ETV Bharat / bharat

'సరిహద్దు ఒప్పందానికి కట్టుబడి ఉందాం!' - గల్వాన్ లోయ

జూన్​ 6న కుదిరిన అంగీకారం మేరకు... గల్వాన్ లోయ నుంచి సైనిక బలగాల ఉపసంహరణ ప్రక్రియను పటిష్టంగా అమలు చేయాలని భారత్​-చైనాలు ఓ అంగీకారానికి వచ్చాయి. భారత విదేశాంగశాఖ సంయుక్త కార్యదర్శి (తూర్పు ఆసియా) నవీన్ శ్రీవాస్తవ.. చైనా విదేశాంగశాఖ డైరెక్టర్ జనరల్​ వూ జియాంగ్​వో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిపిన చర్చల్లో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.

India, China hold diplomatic talks to ease border tension
సరిహద్దు ఒప్పందానికి కట్టుబడి ఉందాం!
author img

By

Published : Jun 25, 2020, 3:51 AM IST

తూర్పు లద్దాఖ్​ గల్వాన్​ నుంచి బలగాల ఉపసంహరణపై... జూన్​ 6న కుదిరిన ఒప్పందాన్ని పటిష్టంగా అమలుచేయాలని భారత్​-చైనా నిర్ణయించాయి. సరిహద్దు సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు భారత విదేశాంగశాఖ పేర్కొంది. భారత్​-చైనా మధ్య దౌత్యస్థాయిలో జరిగిన సమావేశం అనంతరం.. ఈ కీలక వ్యాఖ్యలు చేసింది భారత విదేశాంగశాఖ.

గల్వాన్ లోయ వద్ద జూన్​ 15న చెలరేగిన హింసాత్మక ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు వీరమరణం పొందారు. చైనా వైపు కూడా భారీగా ప్రాణనష్టం జరిగింది. ఈ నేపథ్యంలో సరిహద్దు సమస్యను పరిష్కరించుకునేందుకు భారత్​-చైనాలు మిలటరీ, దౌత్య స్థాయిలో చర్చలు నిర్వహించాయి.

ఎల్​ఏసీని గౌరవిద్దాం..

భారత విదేశాంగశాఖ సంయుక్త కార్యదర్శి (తూర్పు ఆసియా) నవీన్ శ్రీవాస్తవ.. చైనా విదేశాంగశాఖ డైరెక్టర్ జనరల్​ వూ జియాంగ్​వో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గల్వాన్ ఘటన సహా తూర్పు లద్దాఖ్​లో నెలకొన్న ఉద్రిక్తతలపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. వాస్తవాధీనరేఖను ఇరుదేశాలు గౌరవించాలని స్పష్టం చేసింది.

"ద్వైపాక్షిక ఒప్పందాలు, ప్రోటోకాల్స్ ప్రకారం, ఈ ఒప్పందాన్ని వేగంగా అమలుచేయాలని భారత్​-చైనాలు ఓ అంగీకారానికి వచ్చాయి. అప్పుడు మాత్రమే సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంతత నెలకొంటాయని అభిప్రాయపడ్డాయి. దీని వల్ల ఇరుదేశాల మధ్య విస్తృత సంబంధాల అభివృద్ధి కూడా జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశాయి." - భారత విదేశాంగశాఖ

మొత్తానికి సరిహద్దు వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు దౌత్య, మిలటరీ స్థాయిలో సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు అధికారులు ఓ అంగీకారానికి వచ్చారు.

చైనా నక్క జిత్తులు

భారత్​తో ఓ వైపు శాంతి చర్చలు జరుపుతున్న చైనా మరోవైపు.. వాస్తవాధీన రేఖ వెంబడి తన అదనపు బలగాలను మోహరిస్తోంది. ముఖ్యంగా అరుణాచల్​ప్రదేశ్, సిక్కిం, ఉత్తరాఖండ్​ల్లోని భారత్-చైనా సరిహద్దుల వద్ద తన సైనిక బలగాలను గణనీయంగా పెంచుకుంటూ పోతోంది.

లద్దాఖ్​లోని దేప్​సంగ్​, దౌలత్​బేగ్​ ఓల్డీలోని తూర్పు ప్రాంతాలకు, గస్తీ పాయింట్​ 14 వద్దకు చొచ్చుకు వచ్చేందుకు చైనా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. పాయింట్ 14కి చేరువగా చైనా కొత్తగా... తన భూభాగంలో పెద్ద నిర్మాణమేదో చేపడుతున్నట్లు ఉపగ్రహా చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. దీనితో అప్రమత్తమైన భారత సైన్యం కూడా భారీ ఎత్తున సైన్యాన్ని వాస్తవాధీన రేఖ వెంబడి మోహరిస్తోంది. సైన్యం, వైమానిక దళం వివిధ ప్రాంతాలకు అదనపు బలగాలను తరలిస్తున్నాయి. సుఖోయ్​ 30 ఎంకేఐ, జాగ్వార్, మిరాజ్​-2000 లాంటి యుద్ధ విమానాలు, అపాచీ పోరాట హెలికాప్టర్లు వైమానిక స్థావరాలకు చేరుకుంటున్నాయి.

ఇదీ చూడండి: నేపాల్ దుస్సాహసం.. భారత భూభాగంలో హెలీప్యాడ్ నిర్మాణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.