కరోనా వైరస్ పుట్టిన చైనాలోని వుహాన్ నగరానికి ఔషధాలు పంపించి, అక్కడ ఉన్న భారతీయులను తీసుకురావడానికి మరో విమానాన్ని పంపాలని నిర్ణయించింది భారత్. అందుకోసం సీ-17 ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసింది. అయితే దీనికి చైనా నుంచి అనుమతి లభించడం లేదు. రెండు దేశాల అధికార విభాగాలు చర్చలు జరిపిన తర్వాత షెడ్యూల్ ఖరారు చేయనున్నారు.
వుహాన్ ఉన్న మరో 80మందిని భారత్‌కు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో ఔషధాలతో ప్రత్యేక విమానాన్ని చైనాకు పంపి, అక్కడ చిక్కుకున్న భారతీయులతో పాటు ఇతర దేశాల పౌరులను తీసుకొస్తామని ఫిబ్రవరి 17న భారత్ ప్రకటించింది. అయితే.. చైనా అనుమతి కోసం ఎదురుచూస్తోంది భారత్.
భారత్‌కు సహకరించాం..
ఇటీవల రెండు ప్రత్యేక విమానాల ద్వారా 647 మంది భారతీయులను, మాల్దీవులకు చెందిన ఏడుగురిని తీసుకొచ్చింది భారత్. అయితే మూడో విమానానికి అనుమతి ఇవ్వడానికి ఎందుకు ఆలస్యం అవుతుందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారిని విలేకరి ప్రశ్నంచిగా.. వుహాన్, హుబేలోని భారతీయులను తరలించడానికి ఇప్పటికే రెండు దఫాలు చైనా సహాయం చేసిందని దాటవేశారు.
ఇదీ చూడండి: వుహాన్‌లోని భారతీయుల కోసం మిలిటరీ విమానం