ETV Bharat / bharat

కరోనా కంటే భాజపానే అతి పెద్ద మహమ్మారి: దీదీ - తృణమూల్​ కాంగ్రెస్​

ఉత్తర్​ప్రదేశ్​ హాథ్రస్​ హత్యాచార ఘటనను నిరసిస్తూ బంగాల్​లోని కోల్​కతాలో నిరసన ర్యాలీ చేపట్టింది తృణమూల్​ కాంగ్రెస్​. ఈ ప్రదర్శనలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాల్గొన్నారు. దేశంలో నియంతృత్వ పాలన సాగుతోందంటూ కేంద్రంపై విరుచుకుపడ్డారు దీదీ.

protest march
టీఎంసీ నిరసన ర్యాలీ
author img

By

Published : Oct 3, 2020, 4:32 PM IST

Updated : Oct 3, 2020, 7:35 PM IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తర్​ప్రదేశ్​ హాథ్రస్​ హత్యాచార ఘటనను నిరసిస్తూ ఆందోళన చేపట్టింది తృణమూల్​ కాంగ్రెస్​. కోల్​కతాలోని బిర్లా ప్లానిటేరియం నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ తలపెట్టింది.

ఈ నిరసన ర్యాలీలో పాల్గొన్నారు బంగాల్​ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ. యూపీ ముఖ్యమంత్రి యోగిపై ఆమె విమర్శలు గుప్పించారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.

దేశంలో నియంతృత్వ పాలన సాగుతోందని దీదీ ఆరోపించారు. మోదీ హయాంలో దళితులపై దాడులు పెరిగాయని మండిపడ్డారు. కొవిడ్​ కంటే భాజపానే అతి పెద్ద మహమ్మారి అని విమర్శించిన మమత.. దళితులు, వెనుకబడిన వర్గాల తరఫున నిలబడతామని స్పష్టం చేశారు.

protest march
టీఎంసీ నిరసన ర్యాలీలో మమతా బెనర్జీ
protest march
టీఎంసీ నిరసన ర్యాలీ

ఇదీ చూడండి: హాథ్రస్​ ఘటనకు వ్యతిరేకంగా దీదీ నిరసన

Last Updated : Oct 3, 2020, 7:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.