ETV Bharat / bharat

దంతెవాడలో 27 మంది మావోయిస్టులు సరెండర్​ - ఛత్తీస్​గఢ్​ వార్తలు

ఛత్తీస్​గఢ్​లో నక్సల్స్​ సమస్యను పరిష్కరించేందుకు అక్కడి పోలీసులు ప్రారంభించిన కార్యక్రమం విజయవంతమవుతోంది. తాజాగా దంతెవాడ జిల్లాలో 27 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇప్పటివరకు ఇలా 53 మంది సరెండర్​ అయ్యారు.

CG-NAXALS-LD SURRENDER
మావోయిస్టులు సరెండర్​
author img

By

Published : Jul 10, 2020, 5:15 AM IST

ఛత్తీస్​గఢ్​ దంతెవాడ జిల్లాలోని రెండు ప్రాంతాల్లో 27 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో రూ.లక్ష నగదు రివార్డు ఉన్న నలుగురు నక్సల్స్​ ఉన్నారని ఓ సీనియర్ అధికారి తెలిపారు. పోలీసులు ఏర్పాటు చేసిన పునరావాస చర్యలు వారిని ప్రభావితం చేసినట్లు ఆయన వెల్లడించారు.

కౌకొండ పోలీస్​ స్టేషన్​లో సీనియర్ అధికారుల ఎదుట నలుగురు మహిళా మావోయిస్టులతో సహా 25 మంది లొంగిపోయారు. ప్రకాశ్ కర్తామీ (పండు), హద్మీ అనే మరో మావోయిస్టు జంట దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ ఎదుట సరెండర్​ అయ్యారు.

ప్రస్తుతం లొంగిపోయిన నక్సల్స్​ చాలా ఆపరేషన్లలో పాల్గొన్నట్లు అధికారి తెలిపారు. 2016 మార్చిలో ఏడుగురు సీఆర్​పీఎఫ్​ జవాన్లు చనిపోయన మెయిల్​వాడా మందుపాతర దాడితో వీరికి సంబంధం ఉందని వివరించారు.

విసిగిపోయామంటూ..

'డొల్ల మావోయిస్టు భావజాలం'తో విసిగిపోయినట్లు లొంగిపోయే సమయంలో నక్సల్స్​ వాంగ్మూలం ఇచ్చారు. గ్రామాలకు తిరిగి వచ్చేలా పోలీసులు చేస్తోన్న ప్రయత్నాలు నచ్చి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. వీరందరికీ తక్షణ సాయంగా రూ.10 వేలు అందించింది ప్రభుత్వం. ప్రభుత్వ పునరావాస పథకం కింద అన్ని సౌకర్యాలను త్వరలోనే కల్పిస్తామని అధికారులు తెలిపారు.

53 మంది...

నక్సల్స్​ ప్రభావం అధికంగా ఉండే ఛత్తీస్​గఢ్​లో 'గ్రామాలకు తిరిగి రండి' అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది పోలీస్ విభాగం. జనజీవన స్రవంతిలో కలవాలని పోస్టర్ల ద్వారా నక్సల్స్​కు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటివరకు ఇలా 53 మంది మావోయిస్టులు లొంగిపోయారు.

ఇదీ చూడండి: ఉత్తర్​ప్రదేశ్​ గ్యాంగ్​స్టర్​ వికాస్​ దూబే అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.