ETV Bharat / bharat

ప్రజాస్వామ్యానికే దంతెవాడ ఓటర్ల జై

ఛత్తీస్​గఢ్​ దంతెవాడలో ఎన్నికలు బహిష్కరించాలని పిలుపునిచ్చారు మావోయిస్టులు​. హెచ్చరికగా స్థానిక భాజపా ఎమ్మెల్యేను చంపేశారు. ప్రజలు మాత్రం ప్రజాస్వామ్యానికే జైకొట్టారు. జిల్లాలోని గ్రామీణ ఓటర్లు భారీ ఎత్తున ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.

శ్వామగిరిలో పోలింగ్
author img

By

Published : Apr 11, 2019, 2:03 PM IST

దంతెవాడలో ప్రశాంతంగా పోలింగ్

ఛత్తీస్​గఢ్​లో నక్సల్​ ప్రాబల్య ప్రాంతమైన దంతెవాడలో ప్రజాస్వామ్యం వెల్లివిరిసింది. సార్వత్రిక ఎన్నికలను బహిష్కరించాలన్న ప్రకటనలు, స్థానిక శాసనసభ్యుడ్ని హత్యచేసి నక్సలైట్లు సృష్టించిన భయాందోళనలను స్థానికులు బేఖాతరు చేశారు. పెద్దసంఖ్యలో ఓటింగ్​లో పాల్గొంటున్నారు.

మంగళవారం భాజపా ఎమ్మెల్యే భీమా మండావి హత్యకు గురైన శ్యామగిరి గ్రామ పంచాయతీ పరిధిలోనూ పోలింగ్​ సజావుగా సాగుతోంది. ఘటనా స్థలానికి దగ్గరలోని 220 పోలింగ్​ బూత్​ వద్ద రద్దీ నెలకొంది.

బస్తర్​ నియోజకవర్గంలో 11 గంటల ప్రాంతంలోనే సుమారు 23 శాతం ఓట్లు పోలవటం విశేషం. బస్తర్​లో ఏడుగురు అభ్యర్థులు పోటీలో నిలిచారు.

భారీ బందోబస్తు

నక్సల్స్ దాడి నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. బస్తర్​ నియోజకవర్గంలో సుమారు 80వేల మంది సాయుధ బలగాలతో పహారా కాస్తోంది.

naxals
నక్సల్స్ హెచ్చరిక

నియోజకవర్గంలో 13,72,127 ఓటర్లు ఉండగా 1,879 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 741 కేంద్రాలను అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించింది ఈసీ.

అదుపులో నలుగురు మావోలు

బస్తర్​ పరిధిలోని బిజాపూర్​లో నలుగురు మావోలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారివద్ద నుంచి మూడు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిని మాడ్​ తాలుకాకు చెందిన నక్సలైట్లుగా గుర్తించారు పోలీసులు.

పోలింగ్ ప్రారంభానికి కొద్ది సమయం ముందే నారాయణపూర్​ జిల్లాలో ఐఈడీ పేలుళ్లకు పాల్పడ్డారు మావోలు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. పరిసర ప్రాంతాలను పూర్తిగా అదుపులోకి తీసుకున్నాయి బలగాలు.

ఇదీ చూడండి: సార్వత్రిక సమరం: జోరుగా తొలిదశ పోలింగ్​

Srinagar (JandK), Apr 10 (ANI): Former chief minister of Jammu and Kashmir and president of Jammu and Kashmir National Conference (JKNC), Farooq Abdullah expressed concerns over the arrest of Jammu and Kashmir Liberation Front (JKLF) chief Yasin Malik by National Investigation Agency (NIA). He said, "I am really sorry, it would not yield any result. The more you oppress these people, the fire will get worse. Humans can have differences. It doesn't mean you'll arrest anyone who has difference of opinion. This is not the way of India."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.