ఛత్తీస్గఢ్ దంతెవాడలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు నక్సల్స్ హతమయ్యారు. మావోయిస్టుగా అనుమానిస్తున్న ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గుమియాపాల్ గ్రామం సమీపంలో పోలీసు దళాలు కూబింగ్ నిర్వహించాయి. వీరిని చూసిన మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు నక్సల్స్ మరణించగా మిగిలినవారు అడవిలోకి పారిపోయారని పోలీసులు తెలిపారు.
అనంతరం ఘటనా స్థలం నుంచి ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలు, రెండు పిస్తోళ్లు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు. మృతులను దేవా, మంగ్లీ అలియాస్ ముయిగా గుర్తించారు. మలంగీర్ ఏరియా కమిటీలో ప్రముఖ సభ్యులైన వీరిరువురిపై రూ.5 లక్షల చొప్పున రివార్డు ఉంది.
మావోయిస్టుగా అనుమానిస్తున్న కోసి అనే మహిళనూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చూడండి: చంద్రయాన్-2లో వాల్చంద్ విడి భాగాలు!