ETV Bharat / bharat

తొలి దశలో టీకా ఫ్రీ- త్వరలో 4 వ్యాక్సిన్లు: మోదీ - modi vaccine

రానున్న నెలల్లో 30కోట్ల మందికి టీకా అందించనున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మొదటి దశలో 3కోట్ల మంది ఆరోగ్య సిబ్బంది, కరోనా యోధులకు టీకా ఉచితంగా అందుతుందని స్పష్టం చేశారు. త్వరలోనే మరిన్ని టీకాలు అందుబాటులోకి వస్తాయన్నారు. కరోనా పోరులో కేంద్ర, రాష్ట్రాల మధ్య సహకారం.. సమాఖ్యా వ్యవస్థకు గొప్ప ఉదహరణగా అభివర్ణించారు.

modi
'తొలి దశలో టీకా ఫ్రీ- త్వరలోనే మరిన్ని వ్యాక్సిన్లు'
author img

By

Published : Jan 11, 2021, 8:45 PM IST

'టీకా పంపిణీ తొలి దశలో భాగంగా.. కరోనా యోధులకు వ్యాక్సిన్​ను ఉచితంగా అందించనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. దాదాపు మూడు కోట్లమందికి అయ్యే వ్యయం కేంద్రమే భరిస్తుందని చెప్పారు. కరోనాపై పోరులో ముందుండి సేవ చేస్తున్న వారికే తొలుత టీకా అందుతుందని పేర్కొన్నారు. ఈ జాబితాలో ప్రజా ప్రతినిధులు ఉండరని స్పష్టం చేశారు.

వ్యాక్సిన్ పంపిణీ సహా దేశంలో కొవిడ్ పరిస్థితిని ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు మోదీ.

"రెండు టీకాలు భారత్​లో తయారైనవే కావడం గర్వకారణం. విదేశీ వ్యాక్సిన్లపై ఆధారపడాల్సివస్తే దేశం ఎంత ఇబ్బందులు పడేదో! తొలి దశ వ్యాక్సిన్లు హెల్త్​కేర్ సిబ్బంది, ఫ్రంట్​లైన్ వర్కర్ల కోసమే. వేరే వ్యక్తులు తీసుకోకూడదని నేను వ్యక్తిగతంగా సూచిస్తున్నా. ప్రజాప్రతినిధులైన మేము అందులో భాగం కాదు."

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

జనవరి 16 నుంచి వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం కానుందని పునరుద్ఘాటించిన మోదీ.. వచ్చే కొద్ది నెలల్లో 30 కోట్ల మంది పౌరులకు టీకా అందించనున్నట్లు తెలిపారు. రెండో దశలో 50ఏళ్లు పైబడిన వారు, ఇతర రోగాలు ఉన్న 50ఏళ్లలోపు వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు.

మనదే చౌక

ప్రపంచంలోని ఇతర టీకాలకన్నా.. భారత్​లో తయారైన వ్యాక్సిన్లు అత్యంత చౌక ధరకే లభిస్తాయని మోదీ తెలిపారు. ఇప్పటికే రెండు వ్యాక్సిన్లకు అనుమతులు ఇచ్చామని, త్వరలోనే మరో నాలుగింటిని అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. టీకా పంపిణీ రెండో దశకు చేరే సరికి మరిన్ని వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయన్నారు. వ్యాక్సినేషన్​తో భారత్​లో కరోనా పోరు నిర్ణయాత్మక దశకు చేరనుందని అన్నారు.

ఇదీ చదవండి: 'టీకాల కోసం ప్రభుత్వం ఆర్డర్- ఒక్కోటి రూ.210'

వ్యాక్సినేషన్​కు సంబంధించి వదంతులు వ్యాప్తి చెందకుండా రాష్ట్రాలు జాగ్రత్త వహించాలని మోదీ సూచించారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్​ కరోనా వ్యాప్తి విషయంలో మెరుగ్గా ఉందన్నారు. ఇది కొంతవరకు సంతోషం కలిగించేదైనప్పటికీ, అజాగ్రత్తగా ఉండకూడదని పేర్కొన్నారు. 'ఆరు నెలల క్రితం ప్రజల్లో ఉన్న ఆందోళన ఇప్పుడు కనిపించడం లేదు. ప్రజల్లో పెరిగిన విశ్వాసం.. మహమ్మారి పోరుతో పాటు, ఆర్థిక కార్యకలాపాలపైనా సానుకూల ప్రభావం చూపించింద'ని అన్నారు.

సమాఖ్యా స్ఫూర్తికి జోహార్

గతవారం కరోనా పరిస్థితిపై సమీక్ష నిర్వహించిన మోదీ.. ఆ సమావేశంలో రాష్ట్రాలన్నీ మంచి సలహాలు ఇచ్చాయని అన్నారు. కరోనా పోరులో కేంద్ర, రాష్ట్రాల మధ్య సహకారాన్ని కొనియాడారు. సమాఖ్యా వ్యవస్థకు ఈ సహకారం గొప్ప ఉదహరణగా అభివర్ణించారు.

బర్డ్ ఫ్లూ.. జాగ్రత్త

మరోవైపు, బర్డ్ ఫ్లూపై రాష్ట్రాలంతా అప్రమత్తంగా వ్యవహరించాలని మోదీ సూచించారు. నీటి కొలనులు, జూలు, పౌల్ట్రీ ఫాంలపై స్థానిక యంత్రాంగాలు నిరంతరం పర్యవేక్షణ ఉంచాలని అన్నారు. సమస్యపై పోరాడేందుకు కేంద్ర మత్స్య, పశుసంవర్థక, పాడి పరిశ్రమ శాఖ సిద్ధంగా ఉందని తెలిపారు. బర్డ్ ఫ్లూ వెలుగులోకి రాని రాష్ట్రాలు సైతం జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: పది రాష్ట్రాలకు బర్డ్ ఫ్లూ- పక్షులపై వేటు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.