ETV Bharat / bharat

లాక్​డౌన్​ 5.0 రూల్స్​పై రాష్ట్రాల మాటే ఫైనల్!

మరోసారి లాక్​డౌన్​ పొడిగించాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఈ సారి నిబంధనలను మరింత కఠినతరం చేయాలా లేక సడలించాలా అనే నిర్ణయాధికారం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకే ఇచ్చినట్లు తెలుస్తోంది.

lockdown
లాక్​డౌన్​ 5.0: కేంద్రం సమన్వయం- రాష్ట్రాలకు అధికారం!
author img

By

Published : May 29, 2020, 6:39 PM IST

Updated : May 29, 2020, 10:11 PM IST

రోజురోజుకు దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే అమలులో ఉన్న లాక్​డౌన్​ 4.0 ఈ నెల 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో మరోసారి లాక్​డౌన్​ పొడిగిస్తారని సమాచారం. లాక్​డౌన్​ 5.0లో పాటించాల్సిన నిబంధనలపై రాష్ట్రాలకే కేంద్రం అధికారం ఇచ్చినట్లు తెలుస్తోంది.

అయితే రాష్ట్రాలకు తగిన సూచనలు, సలహాలు ఇస్తూ కేంద్రం సమన్వయం చేయనుంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రాంతాల్లో కరోనా ప్రభావానికి తగినట్లుగా ఆంక్షల విధింపు, సడలింపులు చేపట్టేందుకు కేంద్ర అవకాశం ఇవ్వనుంది.

80 శాతం కరోనా కేసులు నమోదైన 30 మున్సిపాలిటీల్లో మాత్రం కఠిన ఆంక్షలు విధించక తప్పదని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది.

మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్​, మధ్యప్రదేశ్​, బంగాల్​, రాజస్థాన్​, ఉత్తర్​ప్రదేశ్​, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, పంజాబ్​, ఒడిశాలో ఈ 30 మున్సిపాలిటీలు ఉన్నాయి.

"లాక్​డౌన్​ 5.0లో కేంద్రం పరిమిత పాత్ర పోషించే అవకాశం లేకపోలేదు. జూన్​ 1నుంచి ఉండే ఆంక్షల సడలింపు, విధింపుల్లో రాష్ట్రాలకే ఎక్కువ అధికారం ఉండొచ్చు. ఆయా ప్రాంతాల పరిస్థితిని బట్టి రాష్ట్రాలు, యూటీలు నిర్ణయం తీసుకోవచ్చు."

- సీనియర్​ అధికారి

రద్దు అనివార్యం!

వైరస్​ అధికంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నవాటిపై నిషేధం కొనసాగుతుందని సమాచారం.

వీటిపై నిషేధం...

  • అంతర్జాతీయ విమాన సేవలు
  • రాజకీయ సమావేశాలు
  • మాల్స్​, సినిమా థియేటర్లు

తప్పవు...

మాస్క్​ ధరించటం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి.

రాష్ట్రాలదే నిర్ణయం...

పాఠశాలలు, మెట్రో సేవల పునఃప్రారంభంపై రాష్ట్రాలు నిర్ణయం తీసుకునే అవకాశం ఇవ్వనుంది కేంద్రం.

"ఇప్పటినుంచి లాక్​డౌన్​ ఆంక్షలను రెండువారాలకు ఒకసారి సమీక్షిస్తారు. అయితే వీటిపై నిర్ణయాధికారం పూర్తిగా ఆయా రాష్ట్రాలు,యూటీలకే ఉంటుంది."

- సీనియర్​ అధికారి

ఆధ్యాత్మిక ప్రాంతాలైన ఆలయాలు, మసీదులు, చర్చీల పునఃప్రారంభంపైనా రాష్ట్రాలదే నిర్ణయమని అధికారి తెలిపారు.

ముఖ్యంగా వైరస్​ ఉద్ధృతి అత్యధికంగా ఉన్న 30 నగరాలపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించనుంది. మెట్రో నగరాలైన ముంబయి, దిల్లీ, కోల్​కతా, చెన్నై ఈ జాబితాలో ఉన్నాయి.

తొలిసారి...

లాక్​డౌన్​పై నిర్ణయం తీసుకున్న నాలుగు సార్లు ప్రధాని నరేంద్ర మోదీ ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులతో భేటీ అయి సలహాలు, సూచనలు తీసుకున్నారు.

అయితే తొలిసారి కేంద్ర హోంమంత్రి అమిత్​షా లాక్​డౌన్​ పొడిగింపుపై రాష్ట్ర ముఖ్యమంత్రులతో చర్చించారు. ఎక్కువమంది ముఖ్యమంత్రులు లాక్​డౌన్​ పొడిగింపునకే మొగ్గు చూపినట్లు సమాచారం.

Last Updated : May 29, 2020, 10:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.