కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ అల్లుడు, కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ మరణించినట్లు ధ్రువీకరించారు పోలీసులు. ఆయన మృతదేహం నేత్రావతి నదిలో లభించినట్లు వెల్లడించారు.
సోమవారం సాయంత్రం అదృశ్యమయ్యారు సిద్ధార్థ. అప్పటి నుంచి పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. నేత్రావతి నదిలో గజ ఈతగాళ్లతో వెతికించారు. అనేక గంటల తర్వాత సిద్ధార్థ మృతి చెందినట్లు ప్రకటించారు.