ETV Bharat / bharat

ఆ రాష్ట్రాలను కరోనా నుంచి కాపాడిన 'పౌర' నిరసనలు!

దేశవ్యాప్తంగా కరోనా రోజురోజుకు విజృంభిస్తోన్న వేళ ఈశాన్య రాష్ట్రాల్లో ఆ అలజడే లేదు. ఈశాన్య రాష్ట్రాలన్నింటిలో కలిపి ఇప్పటివరకు 36 కేసులే నిర్ధరణ అయ్యాయి. 3 రాష్ట్రాల్లో ఒక్క కేసూ నమోదు కాలేదు. ఇందుకు పౌరసత్వ చట్టం వ్యతిరేక ఆందోళనలే కారణమని విశ్లేషిస్తున్నారు సీనియర్ పాత్రికేయులు సంజీవ్ బారువా.

NE states
ఈశాన్య రాష్ట్రాలు
author img

By

Published : Apr 13, 2020, 1:09 PM IST

చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచమంతా విస్తరించింది. 18 లక్షల మందికిపైగా వైరస్ బారినపడగా లక్షమందికిపైగా మృతి చెందారు. భారత్ లోనూ నానాటికీ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా 9 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి.

దేశంలో 3 రాష్ట్రాలకు మాత్రం ఈ మహమ్మారి వ్యాప్తి చెందలేదు. మేఘాలయ, సిక్కిం రాష్ట్రాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. నాగాలాండ్​లో ఈరోజే తొలి కేసు వెలుగు చూసింది. ఇవన్నీ ఈశాన్య రాష్ట్రాలు. అందులోనూ ప్రముఖ పర్యటక ప్రాంతాలు కావటం విశేషం. వీటితో పాటు మిగతా ఈశాన్య రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు అంతంతమాత్రంగానే ఉన్నాయి.

పౌర నిరసనలు..

కరోనా వ్యాప్తి తక్కువగా ఉండడానికి పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వ్యతిరేక నిరసనలే కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2019 డిసెంబర్ 11న అమల్లోకి వచ్చిన సీఏఏకు వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాలు భగ్గుమన్నాయి. పౌరసత్వ సవరణ బిల్లు (సీఏబీ) పార్లమెంటులో ఉండగానే.. 2019 అక్టోబర్​లో ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు మొదలయ్యాయి.

ఆంక్షల విధింపు..

సీఏబీకి పార్లమెంటు ఆమోదంతో చట్టంగా మారినప్పటినుంచి ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఫలితంగా ఆయా రాష్ట్రాల్లో అంతర్ రాష్ట్ర రాకపోకలపై ఆంక్షలు విధించారు. చాలా మంది పర్యటకులు తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారు.

మొత్తం 36 కేసులే..

ఈ సమయంలోనే ఈశాన్య రాష్ట్రాలకు.. దేశంలోని ఇతర ప్రాంతాలు, విదేశాల నుంచి భారీగా పర్యటకులు వస్తారు. కానీ, పర్యటకుల రాక తగ్గిపోవటం వల్ల ఈ రాష్ట్రాల్లో కరోనా ప్రభావం అంతగా లేదని విశ్లేషకులు వివరిస్తున్నారు.

ఈశాన్య ప్రాంతంలోని 8 రాష్ట్రాల్లో కలిపి ఇప్పటివరకు 36 కేసులు నమోదయ్యాయి. అందులో 30 కేసులు తబ్లిగీ జమాత్ ప్రార్థనలకు సంబంధించినవే.

రాష్ట్రంకేసుల సంఖ్య
అసోం 29
త్రిపుర 2
మణిపుర్ 2
అరుణాచల్ ప్రదేశ్ 1
మిజోరం 1
నాగాలాండ్1

మరిన్ని ప్రచారాలు..

ఈశాన్య రాష్ట్రాల్లో కరోనా ప్రభావం ఎక్కువగా లేకపోవటంపై అనేక కారణాలు ప్రచారంలో ఉన్నాయి. ఇక్కడ ఎక్కువమంది తముల్ అనే పాన్ తినే అలవాటు ఉండటమే కారణమని చెబుతున్నారు. ఇది నోట్లోని బ్యాక్టీరియా, ఇతర క్రిములను సంహరిస్తుందని నమ్ముతున్నారు.

తముల్​ను నమిలిన తర్వాత శరీరం వేడెక్కుతుందని.. ఫలితంగా కరోనాను ఎదుర్కొనే శక్తి వస్తుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చూడండి: పాన్​ మసాలానే కాదు.. పొగాకు ఉత్పత్తినే నిషేధించాలి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.