మహారాష్ట్ర, హరియాణా ఫలితాలతో పాటే 18 రాష్ట్రాల్లో మరో 51 అసెంబ్లీ సీట్లకు జరిగిన ఉపఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. అలాగే మహారాష్ట్ర (సాతారా), బిహార్ (సమస్తిపుర్) లోక్‌సభ స్థానాల ఉపఎన్నికల ఫలితాలూ వెలువడుతాయి.
51 అసెంబ్లీ స్థానాలకు సోమవారం జరిగిన ఉపఎన్నికల్లో 57శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
భాజపా, దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలైన ఉత్తర్‌ప్రదేశ్‌లో 11, గుజరాత్‌లో 6, బిహార్ 5, అసోం 4, హిమాచల్ ప్రదేశ్ 2, తమిళనాడులో 2 అసెంబ్లీ సీట్లకు ఉపఎన్నికలు జరిగాయి. పంజాబ్‌లో 4, కేరళ 5, సిక్కిం 3, రాజస్థాన్ 2 స్థానాల్లో ఉపఎన్నికలు నిర్వహించారు. అరుణాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, పుదుచ్చేరీ, మేఘాలయా, తెలంగాణల్లో ఒక్కో స్థానంలో ఉపఎన్నికలు జరిగాయి. భాజపా పాలిత రాష్ట్రాల్లో ఓటర్లు భాజపా వైపే మొగ్గు చూపే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.
ఇదీ చూడండి: చమురు రంగంలో కీలక సంస్కరణలకు ఆమోదం