ETV Bharat / bharat

నకిలీ రిజిస్ట్రేషన్లతో బస్సులు-ప్రియాంక సెక్రటరీపై కేసు! - ప్రియాంకా గాంధీ

వలస కార్మికుల కోసం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన బస్సుల్లో.. కొన్ని రిజిస్ట్రేషన్లు ఆటోలు, ద్విచక్ర వాహనాలు, కార్ల పేరు మీద ఉన్నాయని యూపీ సర్కార్ ఆరోపించింది. ఈ మేరకు ఆర్​టీఓ ఆర్​పీ త్రివేది ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా.. ప్రియాంకా గాంధీ సెక్రటరీ సహా యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడిపై కేసు నమోదు చేశారు పోలీసులు.

priyanka
ప్రియాంకా గాంధీ
author img

By

Published : May 19, 2020, 11:31 PM IST

Updated : May 20, 2020, 12:13 AM IST

ప్రియాంకా గాంధీ పర్సనల్ సెక్రటరీ సందీప్ సింగ్ సహా ఉత్తర్​ప్రదేశ్​ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ కుమార్ లల్లుపై యూపీ పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిరువురితో పాటు మరికొందరిపై ఫోర్జరీ సహా పలు అభియోగాలతో హజ్రత్​గంజ్​ పోలీసులు ఎఫ్​ఐఆర్​ దాఖలు చేశారు.

ఎందుకోసమంటే?

వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చేందుకు వెయ్యి బస్సులు నడుపుతామని కాంగ్రెస్​ ఇదివరకే ముందుకొచ్చింది. ఇందుకోసం యూపీ సీఎం యోగి అనుమతి కోరుతూ ప్రియాంకా గాంధీ లేఖ రాశారు. ప్రియాంక విజ్ఞప్తిని మన్నించిన ఆయన.. సోమవారం ఆదేశాలు జారీ చేసింది. బస్సుల వివరాలు చెప్పాలని సూచించింది.

అయితే కాంగ్రెస్​ నడిపేందుకు తీసుకొచ్చిన వెయ్యి బస్సుల్లో కొన్నింటి రిజిస్ట్రేషన్లు ద్విచక్రవాహనాలు, కార్లు, ఆటోలకు సంబంధించినవని యూపీ ప్రభుత్వం ఆరోపించింది. ఈ మేరకు రోడ్డు రవాణా అధికారి ఆర్​పీ త్రివేది ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు అధికారులు.

ఇదీ చదవండి: ప్రియాంక ఆఫర్​కు సై అన్న యోగి సర్కార్‌!

Last Updated : May 20, 2020, 12:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.