ETV Bharat / bharat

కుప్పకూలిన భవనం..  శిథిలాల కింద ఐదుగురు!

building-collapses-in-punjabs-mohali-several-feared-trapped
కొనసాతున్న సహాయక చర్యలు..
author img

By

Published : Feb 8, 2020, 3:36 PM IST

Updated : Feb 29, 2020, 3:37 PM IST

17:37 February 08

డ్రిల్లింగ్​ చేస్తుండగా కదలికలు వచ్చి..

పంజాబ్​ ​ మొహాలిలో మూడు అంతస్తుల భవనం కుప్పకూలింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్​ బృందం సహాయక చర్యలు చేపట్టింది. ఓ ఇంటి నిర్మాణం కోసం జేసీబీతో తవ్వుతుండగా.. పక్కనున్న మూడు అంతస్తుల భవనానికి కదలికలు వచ్చి ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

ఇప్పటివరకు శిథిలాల కింద ఉన్న ఇద్దరిని సిబ్బంది రక్షించారు. మరో నలుగురు నుంచి ఐదుగురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

 " ఓ ఇంటి నిర్మాణ పనుల్లో భాగంగా జేసీబీతో తవ్వుతుండగా.. పక్కన ఉన్న మూడంతస్తుల వాణిజ్య సముదాయానికి కదలికలు వచ్చాయి. దీంతో ఆ భవనం నేలమట్టమైంది. ప్రస్తుతం  ​శిథిలాల కింద చిక్కుకున్న జేసీబీ యంత్రం ఆపరేటర్‌తో సహా మరో ఇద్దరు మొబైల్ ఫోన్‌ల ద్వారా రెస్క్యూ సిబ్బందితో మాట్లాడుతున్నారు."

        - హిమాన్షు జైన్, ఖరార్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్

ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి వచ్చి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

15:30 February 08

పంజాబ్​ ​ మొహాలిలో మూడు అంతస్తుల భవనం కుప్పకూలింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్​ బృందం సహాయక చర్యలు చేపట్టింది. జేసీబీ యంత్రంతో  శిథిలాలను తొలగిస్తున్నారు. ఇప్పటివరకు ఇద్దరిని రక్షించిన సిబ్బంది..  మరో ఆరు నుంచి ఏడుగురు ఇంకా భవన శిథిలాల కింద చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. 

Last Updated : Feb 29, 2020, 3:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.