ETV Bharat / bharat

ఆరుగురు పాక్​ చొరబాటుదారుల అరెస్ట్

భారత భూభాగంలోకి ప్రవేశించిన ఆరుగురు యువకులను సరిహద్దు దళాలు అదుపులోకి తీసుకున్నాయి. డిసెంబరు 31న పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి సరిహద్దు దాటిన మరో వ్యక్తిని సైన్యం పాక్​కు అప్పగించింది. ​

BSF nabs 6 Pakistani men from Punjab border
ఆరుగురు పాక్​ చొరబాటుదారుల అరెస్ట్
author img

By

Published : Jan 8, 2021, 10:38 PM IST

పాకిస్థాన్​ నుంచి భారత భూభాగంలోకి చొరబడిన ఆరుగురు యువకులను సరిహద్దు దళాలు శుక్రవారం అదుపులోకి తీసుకున్నాయి. ఈ మేరకు అధికారిక వర్గాలు వెల్లడించాయి. చొరబాటుదారులు అందరూ 20 లేదా 21 ఏళ్ల వయసు గల వారని అధికారులు పేర్కొన్నారు.

సాయంత్రం 5 గంటలకు పంజాబ్​లోని అమృత్​సర్ సరిహద్దు ​వద్ద వీరిని అదుపులోకి తీసుకున్నారని స్పష్టం చేశారు. ప్రస్తుతం చొరబాటు వెనుక గల కారణాలపై దర్యాప్తు చేపడుతున్నారని తెలిపారు.

పాక్​కు అప్పగింత..

డిసెంబరు 31న పాక్​ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)​ నుంచి దారితప్పి ఓ వ్యక్తి భారత సరిహద్దులోకి ప్రవేశించాడు. సైన్యం అతడిని తిరిగి పాక్​కు అప్పగించిందని అధికారిక వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. అలీ హైదర్​ అనే ఆ యువకుడు పీఓకేలోని మిర్​పూర్​ గ్రామానికి చెందిన వాడని తెలిపాయి.

ఇదీ చదవండి : తల్లీబిడ్డలను మోస్తూ మంచులో 3.5కి.మీ నడక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.