అత్యంత శక్తిమంతమైన సూపర్ సోనిక్ బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ వర్గాలు తెలిపాయి.
భూతల లక్ష్యాలను చేధించగల బ్రహ్మోస్‌ను.. ఒడిశా చండీపుర్ సమీపంలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ వద్ద ఉదయం 8 గంటల 30 నిమిషాల సమయంలో ప్రయోగించారు. ఈ క్షిపణి నిర్దేశిత ప్రమాణాలకు తగినట్లు ప్రయాణించినట్లు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) వర్గాలు తెలిపాయి.
బ్రహ్మోస్.. మధ్యశ్రేణి క్షిపణి. భూ ఉపరితలం మీదనే కాక, జలాంతర్గాములు, ఓడలు, యుద్ధవిమానాల నుంచి ఈ క్షిపణిని ప్రయోగించవచ్చు. యుద్ధ సమయాల్లో భారత సైనిక, వైమానిక, నావికా దళాలకు అత్యంత ప్రభావవంతంగా ఉపయోగపడుతుంది.
ఇదీ చదవండి:'పౌర' హింసపై సిట్ దర్యాప్తు- త్వరలో సుప్రీం నిర్ణయం!