ETV Bharat / bharat

స్వాతంత్య్ర వేడుకలు హింసాత్మకం.. భాజపా కార్యకర్త మృతి

author img

By

Published : Aug 15, 2020, 6:55 PM IST

బంగాల్​లోని హూగ్లీ జిల్లాలో స్వాతంత్య్ర వేడుకల్లో అధికార టీఎంసీ, భాజపా మద్దతుదారుల మధ్య ఘర్షణ తలెత్తి.. హింసాత్మకంగా మారింది. ఈ దుర్ఘటనలో ఓ భాజపా కార్యకర్త ప్రాణాలు కోల్పోయాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

BJP worker dies in clash over flag in West Bengal
స్వాతంత్ర్య వేడుకలు హింసాత్మకం

బంగాల్​లోని హూగ్లీ జిల్లాలో స్వాతంత్య్ర వేడుకలు హింసాత్మకంగా మారాయి. అధికార తృణమూల్​ కాంగ్రెస్​, భారతీయ జనతా పార్టీ మద్దతుదారుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ దుర్ఘటనలో ఓ భాజపా కార్యకర్త ప్రాణాలు కోల్పోయాడు.

రాష్ట్ర రాజధాని కోల్​కతాకు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖనకుల్​లో ఒకే ప్రాంతంలో ఉన్న తమ కార్యాలయాల్లో స్వాతంత్య్ర వేడుకలకు భాజపా, టీఎంసీ మద్దతుదారులు హాజరయ్యారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరువర్గాల మధ్య మాటమాటా పెరిగి ఘర్షణకు దారితీసింది.

ఖండించిన భాజపా..

అనంతరం పోలీసులకు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళన చేశారు. ఈ ఘటనను భాజపా ఖండించింది. కారణమైన వారిని అరెస్ట్​ చేయాలని డిమాండ్​ చేసింది.

మృతుడిని భాజపా హూగ్లీ జిల్లాా పరిషత్​ సభ్యుడు సుదర్శన్​ ప్రమాణిక్​గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని చెప్పారు.

ఇదీ చూడండి: 'భారత సరిహద్దులు పూర్తి భద్రం, సురక్షితం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.