ETV Bharat / bharat

రాజకీయ పులిస్వారీ.. 'పీఠ'ముడి వీడేనా..! - భాజపా

హిందూత్వ సిద్ధాంతమనే ఒరలో ఒద్దికగా ఒదిగిపోగల రెండు కత్తుల్లాంటివి భాజపా, శివసేన పార్టీలు. పాలక కూటమిగా పునరధికారం కట్టబెడుతూ మహారాష్ట్ర ఓటర్లు విస్పష్ట తీర్పు వెలువరించి వారం రోజులవుతున్నా భాజపా, శివసేనల మధ్య పదవుల పంపకాలపై బిగిసిన ‘పీఠముడి’ ఎప్పుడు ఏ తీరుగా వీడుతుందో తెలియడం లేదు!

రాజకీయ పులిస్వారి
author img

By

Published : Oct 31, 2019, 10:01 AM IST

మహారాష్ట్రతోపాటే అసెంబ్లీ ఎన్నికలు జరిగిన హరియాణాలో రాజకీయ దిగ్దంతుల ముందస్తు అంచనాల్ని తప్పాతాలూగా తేల్చేస్తూ ఓటర్లు త్రిశంకు సభను ఆవిష్కరించడం తెలిసిందే. తొంభై స్థానాల అసెంబ్లీలో ‘మిషన్‌ 75 ప్లస్‌’ లక్ష్యంతో అవిశ్రాంతంగా శ్రమించిన కమలనాథులు అంతిమంగా సాధారణ మెజారిటీకి ఆరు సీట్లు తరుగుపడటంతో వడివడిగా పావులు కదిపి పది సీట్లు గెలిచిన జన్‌నాయక్‌ జనతా పార్టీతో పొత్తు ఖరారు చేసి ప్రభుత్వ ఏర్పాటు కానిచ్చేయడం ఇటీవలి ముచ్చటే! ఇచ్చిపుచ్చుకొనే చాకచక్యంతో హరియాణాలో పునరధికారమనే ఉట్టిని అనాయాసంగా కొట్టగలిగిన కమలం పార్టీకి మహారాష్ట్రలో శివసేన మంకుపట్టు గట్టి సవాలు రువ్వుతోంది.

మొన్న మే నెల నాటి లోక్‌సభ ఎన్నికలకు ముందు నోటిమాటగా కుదిరిన ‘పదవీకాలం చెరిసగం’ ఒప్పందాన్ని నేడు లిఖితపూర్వకంగా మన్నించాలని, ముఖ్యమంత్రిగా తొలి రెండున్నరేళ్లు ఆదిత్య ఠాక్రేకు అవకాశం ఇవ్వాలని శివసేన బిగదీసుకుని కూర్చుంది. 25.7 శాతం ఓట్లు, 105 సీట్లతో ఏకైక పెద్దపార్టీగా ఆవిర్భవించిన భాజపా- దేవేంద్ర ఫడణవీస్‌ నేతృత్వంలోనే అయిదేళ్ల కూటమి సర్కారు నడుస్తుందని స్పష్టీకరిస్తోంది. ‘సాధారణ మెజారిటీ ఉందనుకుంటే ఫడణవీస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు’నంటూ తనదారికి కమలం పార్టీ రావాల్సిందేనన్న ధీమా ఒలకబోస్తున్న శివసేన- పవార్‌ పార్టీ మద్దతు తనకు ఉందన్నట్లుగా వ్యంగ్య చిత్రాలతో సంకీర్ణ రాజకీయాన్ని సంక్షుభితం చేస్తోంది. రేపోమాపో సంకీర్ణ కూటమి సర్కారు ప్రమాణస్వీకారం ఖాయమన్నది కమలనాథుల ధీమా! ఠాక్రేల మొట్టమొదటి రాజకీయ వారసత్వాన్ని ముఖ్యమంత్రి పీఠంపై ప్రతిష్ఠించడం ద్వారా శివసేన పార్టీ పునాదుల విస్తరణను లక్షిస్తున్న ఉద్ధవ్‌ ఠాక్రే- బెట్టు ఏ మేరకు సడలిస్తారన్నదాన్నిబట్టే ముగుస్తుంది హైడ్రామా!

మహారాష్ట్రలో పులిగాండ్రింపుల రాజకీయం కమలం పార్టీకి కొత్తకాదు. 1995లో మొదటిసారిగా శివసేన, భాజపా కూటమి సాధారణ మెజారిటీకి చేరువై నలభై మంది స్వతంత్రుల దన్నుతో సంకీర్ణ ప్రభుత్వాన్ని కొలువుతీర్చినప్పుడే ‘పులిస్వారీ’లోని కష్టనష్టాలు కమలం పార్టీకి అనుభవంలోకి వచ్చాయి. ఆనాడు 169 స్థానాల్లో పోటీచేసిన శివసేన 27.7 శాతం ఓట్లతో 73 సీట్లు సాధించి 60 చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. అదే కూటమి భాగస్వామిగా భాజపా 116 సీట్లలో పోటీపడి 32 శాతం ఓట్లతో 65 సీట్లు గెలిచి పాతిక స్థానాల్లో ధరావతు కోల్పోయింది. తదాదిగా పోటీ చేసే సీట్ల సంఖ్యాపరంగా భీమభాగం శివసేనదైనా- తెచ్చుకొనే ఓట్లు, గెలుచుకొనే సీట్ల పరంగా ఎప్పుడూ మెరుగైన ఫలితాలే సాధిస్తూ వచ్చిన కమలం పార్టీ, మహారాష్ట్రలో చిన్న తమ్ముడి పాత్రకే పరిమితమవుతూ వచ్చింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ ప్రభంజనం మహారాష్ట్రనూ ఊపేయడంతో మొత్తం 48 లోక్‌సభ స్థానాలకు 41 భాజపా శివసేన కూటమి గెలుచుకోగా- క్షేత్రస్థాయి వాస్తవాల్ని గుర్తించకుండా ఉద్ధవ్‌ ఠాక్రే గొంతెమ్మ కోర్కెలు కోరబట్టే క్రితంసారి అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి బీటలు వారింది. కీలక రాష్ట్రంలో ఎవరి సొంత బలమెంతో నిగ్గుతేల్చిన 2014 అసెంబ్లీ ఎన్నికల్లో- 31 శాతం ఓట్లతో 122 సీట్లు గెలిచిన భాజపా ఏకైక పెద్దపార్టీగా ఎదిగింది. 19.8 శాతం ఓట్లు 63 సీట్లు గెలుచుకొని 129 చోట్ల డిపాజిట్లు కోల్పోయిన శివసేన- అవసరార్థం పెద్దరికాన్ని త్యజించి జూనియర్‌ భాగస్వామిగా నాటి ప్రభుత్వంలో చేరింది. క్రితంసారి క్యాబినెట్లో ఇచ్చిన 12 మంత్రి పదవులకు అదనంగా మరో రెండు, ఉపముఖ్యమంత్రి పదవి, కేంద్రంలో మరో సహాయమంత్రి పదవి ఇవ్వడానికి కమలనాథులు సంసిద్ధత చూపుతున్నా- శివసేన పంతం వీడుతుందా లేదా అన్నదే ఉత్కంఠ రేపుతోంది!

ఏకాభిప్రాయానికి, పంచుకొనే విధానానికి భాజపా కూటమి సర్కారు పెద్దపీట వేస్తుందంటూ లోగడ వాజ్‌పేయీ కనబరచిన ఔదార్యం- సంక్షుభిత సంకీర్ణాల సంద్రంలో ఎన్‌డీఏ నావకు సరైన చుక్కానిగా మారింది. అదే రాష్ట్రాల విషయంలో ‘చెరి సగం పదవీ కాలం’ వంటి ఒడంబడికలు కమలం పార్టీకి అచ్చిరాలేదని యూపీలో మాయావతి, కర్ణాటకలో కుమారస్వామి అనుభవాలు చాటుతున్నాయి. 2014లో సీట్ల పంపకాలప్పుడే ముఖ్యమంత్రిత్వం కోసం పట్టుపట్టి కూటమికి చెల్లుకొట్టిన శివసేన- నేడు భాజపాకు తాను తప్పితే గత్యంతరం లేదన్న రాజకీయ సంకట స్థితిని సొమ్ము చేసుకోవాలనుకొంటోంది. పాతికేళ్లపాటు తానే పెద్ద దిక్కుగా ఉండి భాజపాను మహారాష్ట్రలో నడిపిస్తే- 2017 నాటి బృహన్‌ ముంబయి నగర పాలిక ఎన్నికల్లోనూ కమలం పార్టీ గణనీయ విజయాలు నమోదు చెయ్యడం, పెద్దపులికి మింగా కక్కాలేని పరిస్థితి సృష్టించింది. క్రితంసారి ప్రభుత్వంలో భాగస్వామి అన్నమాటేగాని ప్రభావశీల మంత్రిత్వశాఖ ఒక్కటీ తనకు దక్కకపోవడం, 22 వేల పైచిలుకు సహకార సంఘాలతో అలరారుతున్న మహారాష్ట్రలో ఆ శాఖ ద్వారా నలు చెరగులకూ పార్టీ విస్తరణ ప్రణాళికలతో ఫడణవీస్‌ దూసుకెళుతుండటం ఉద్ధవ్‌ ఠాక్రేకు కలవర కారకమవుతోంది. ముఖ్యమంత్రిత్వంతో పాటు కీలక మంత్రిపదవుల కోసమూ శివసేన గాండ్రించడానికి కారణం అదే. హోం, రెవిన్యూ, పట్టణాభివృద్ధి, సహకారం వంటి శాఖల్ని వదులుకొనేది లేదంటున్న కమలం పార్టీ స్కంధావారాలు పెద్దపులి అలకను ఎలా తీరుస్తాయో చూడాల్సిందే. పరస్పర విశ్వాసం, ఉభయకుశలోపరి వ్యవహారం వంటివి ఏ కూటమి దీర్ఘకాల మనుగడకైనా ప్రాణాధారం. ఒంటెత్తు ధోరణులతో ఏ సంకీర్ణమూ మనజాలదన్నదే చరిత్ర చెప్పే గుణపాఠం!

ఇదీ చూడండి : బాగ్దాదీపై ఉన్న రూ.177 కోట్లు అతనికే!

RESTRICTION SUMMARY: PART NEWS USE ONLY. STRICTLY NOT TO BE USED IN ANY COMEDY/SATIRICAL PROGRAMMING OR FOR ADVERTISING PURPOSES. ONLINE USE PERMITTED BUT MUST CARRY CLIENT`S OWN LOGO OR WATERMARK ON VIDEO FOR ENTIRE TIME OF USE. NO ARCHIVE.
SHOTLIST:
PARLIAMENTARY RECORDING UNIT - NEWS USE ONLY. STRICTLY NOT TO BE USED IN ANY COMEDY/SATIRICAL PROGRAMMING OR FOR ADVERTISING PURPOSES. ONLINE USE PERMITTED BUT MUST CARRY CLIENT`S OWN LOGO OR WATERMARK ON VIDEO FOR ENTIRE TIME OF USE. NO ARCHIVE.
London - 22 October 2019
1. SOUNDBITE (English) John Bercow, Speaker of the House of Commons:
"Order, order!"
PARLIAMENTARY RECORDING UNIT - NEWS USE ONLY. STRICTLY NOT TO BE USED IN ANY COMEDY/SATIRICAL PROGRAMMING OR FOR ADVERTISING PURPOSES. ONLINE USE PERMITTED BUT MUST CARRY CLIENT`S OWN LOGO OR WATERMARK ON VIDEO FOR ENTIRE TIME OF USE. NO ARCHIVE.
London - 17 January 2018
2. Bercow receiving result of lawmakers' vote on approving EU withdrawal bill
3. SOUNDBITE (English) John Bercow, Speaker of the House of Commons:
"The ayes to the right 324, the nos to the left 295, the ayes have it. The ayes have it. Unlock."
4. Wide of parliament
5. Speaker John Bercow calling parliament to order UPSOUND (English) "Order! Order!"
6. Members of parliament bowing
PARLIAMENTARY RECORDING UNIT - NEWS USE ONLY. STRICTLY NOT TO BE USED IN ANY COMEDY/SATIRICAL PROGRAMMING OR FOR ADVERTISING PURPOSES. ONLINE USE PERMITTED BUT MUST CARRY CLIENT`S OWN LOGO OR WATERMARK ON VIDEO FOR ENTIRE TIME OF USE. NO ARCHIVE.
London - 5 February 2013
7. SOUNDBITE (English) John Bercow, Speaker of the House of Commons:
"Division, clear the lobbies."
8. Members of parliament getting up and leaving Parliament
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
London - 29 October 2019
9. EU and British flags waving outside Victoria Tower at Westminster
10. Close of Bercow's biographer Sebastian Whale
11. SOUNDBITE (English) Sebastian Whale, John Bercow's biographer:
"Undoubtedly, he has as many detractors as he has people who worship the floor that he walks on. And that's the nature of the man. He is the Speaker for the times. He's divisive, abrasive and controversial."
12. Close of Whale's hands clenched together
13. SOUNDBITE (English) Sebastian Whale, John Bercow's biographer:
"He was bullied at school, and I think when you understand that, you can start to really understand the man. I think he has an antipathy towards the powerful using their majority for means that he thinks aren't correct or right. You can see that with how he stands up to government."
PARLIAMENTARY RECORDING UNIT - NEWS USE ONLY. STRICTLY NOT TO BE USED IN ANY COMEDY/SATIRICAL PROGRAMMING OR FOR ADVERTISING PURPOSES. ONLINE USE PERMITTED BUT MUST CARRY CLIENT`S OWN LOGO OR WATERMARK ON VIDEO FOR ENTIRE TIME OF USE. NO ARCHIVE.
London - 22 June 2009
++4:3++  
14 Speaker announcing votes for Bercow
15. Bercow listening to announcement
16. Parliament applauding
17. Parliament applauding Bercow
PARLIAMENTARY RECORDING UNIT - NEWS USE ONLY. STRICTLY NOT TO BE USED IN ANY COMEDY/SATIRICAL PROGRAMMING OR FOR ADVERTISING PURPOSES. ONLINE USE PERMITTED BUT MUST CARRY CLIENT`S OWN LOGO OR WATERMARK ON VIDEO FOR ENTIRE TIME OF USE. NO ARCHIVE.
London - 13 June 2017
18.  SOUNDBITE (English) John Bercow, Speaker of the House of Commons:
"I will strive to ensure that all parts of the House are heard fully and fairly"
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
London – 28 October 2019
19. Establishing shot of Bronwen Maddox, director of the independent think-tank "Institute for Government"
20. SOUNDBITE (English) Bronwen Maddox, Director, "Institute for Government":
"He made all kinds of small changes that were not controversial, but calling on more backbenchers to speak, allowing Prime Minister's questions to go on a bit longer, allowing more urgent questions, and so on. And all those things, really, I think, have contributed to a sense that backbenchers of all kinds could get up and have their say. It was when he began running across conventions, changing conventions, in ways that shape the Brexit process, that it all got very, very controversial."
UK POOL - AP CLIENTS ONLY
London – 24 September 2019
21. SOUNDBITE (English) John Bercow, Speaker of the House of Commons:
"That judgment is that the prorogation of parliament was unlawful. Unlawful because it prevented or frustrated Parliament in the discharge of its core duties."
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
London – 29 October 2019
22. Brexit protesters with flags outside House of Parliament
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
London– 29 October 2019
23. SOUNDBITE (English) Bronwen Maddox, Director, "Institute for Government":
"I think John Bercow will be remembered for making a lot of innovations or changes to convention that really did shape the course of Brexit. That is the most controversial bit. And the government certainly feels that he did it in a way that was partisan and reflected his dislike of Brexit itself. And you can find, absolutely, rulings he made that suited the government and not the opposition. But their argument would be that he went more one way than the other way. His argument would be that he was defending parliament."
PARLIAMENTARY RECORDING UNIT - NEWS USE ONLY. STRICTLY NOT TO BE USED IN ANY COMEDY/SATIRICAL PROGRAMMING OR FOR ADVERTISING PURPOSES. ONLINE USE PERMITTED BUT MUST CARRY CLIENT`S OWN LOGO OR WATERMARK ON VIDEO FOR ENTIRE TIME OF USE. NO ARCHIVE.
London - 12 Dec 2011
24. SOUNDBITE (English) John Bercow, Speaker of the House of Commons:
"Order, order. I am worried about the health of the honourable member from Mid-Sussex. He must calm himself, have a liedown if necessary, while we listen to the leader of the opposition."
25. Debate in Parliament
PARLIAMENTARY RECORDING UNIT - NEWS USE ONLY. STRICTLY NOT TO BE USED IN ANY COMEDY/SATIRICAL PROGRAMMING OR FOR ADVERTISING PURPOSES. ONLINE USE PERMITTED BUT MUST CARRY CLIENT`S OWN LOGO OR WATERMARK ON VIDEO FOR ENTIRE TIME OF USE. NO ARCHIVE.
London - 29 March 2017
26. SOUNDBITE (English) John Bercow, Speaker of the House of Commons:
"This is very unseemly heckling, you are a distinguished QC, you wouldn't behave like that in a Scottish court, you'd be chucked out. Prime Minister."
27. Former British Prime Minister Theresa May walking to lectern
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
London - 29 October 2019
28. SOUNDBITE (English) Sebastian Whale, John Bercow's biographer:
"I did speak to a former co-worker of his who worked with him in the late 80s, early 90s, who said he was reading a Jane Austen novel. And ever since that, he used to speak with the same affectations as these characters he read in these Jane Austen novels. However, I've also spoken to people before that time who said that he always spoke in this rather pompous, shall we say, way, using five words where one would do. But that's just who he is, he' s quite an kind of eccentric character. And as I understand it, he's like that in private as he is in public. He doesn't necessarily change because the camera's on him. He just is that kind of slightly bewildering character from a different age."
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Londonderry - 12 March 2019
29. Zoom out from TV showing Bercow to people in bar watching him announce the defeat of former UK Prime Minister Theresa May's Brexit deal, imitating him speaking
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
London - 28 October 2019
30. SOUNDBITE (English) Dominic Ademoglu, accountant from London:
" I think he's done a good job, I think he's a strong individual, unbiased, and he's making sure that our democracy is working in the way it ought to, according to the way it's set up. So, it's disappointment."
31. SOUNDBITE (English) Andy Nicolaou, retired, London resident
"I think he just dictates to people too much. You know, like the way he carries on in the Houses of Parliament and "Order" and all this. He tries to assert himself too much as far as I'm concerned."
32. Zoom out from parliament's Victoria Tower
33. SOUNDBITE (English) Bronwen Maddox, director, "Institute for Government":
"I think the Commons may well go for a safe pair of hands after this and someone less controversial. But the questions are still there. What exactly is the Speaker's discretion to decide when backbenchers can bring an amendment to a government motion, and not? And exactly what powers does Parliament have compared to the government?"
UK POOL - AP CLIENTS ONLY
Buckingham Palace, London - 10 May 2016
34. Bercow and Queen Elizabeth II meeting with delegations from Parliament on her 90th birthday
35. Bercow presenting Queen with ceremonial document to congratulate her on her birthday
UK POOL - AP CLIENTS ONLY
London – 27 February 2014
36. Bercow greeting German chancellor Angela Merkel
                
PARLIAMENTARY RECORDING UNIT - NEWS USE ONLY. STRICTLY NOT TO BE USED IN ANY COMEDY/SATIRICAL PROGRAMMING OR FOR ADVERTISING PURPOSES. ONLINE USE PERMITTED BUT MUST CARRY CLIENT`S OWN LOGO OR WATERMARK ON VIDEO FOR ENTIRE TIME OF USE. NO ARCHIVE.
London – 30 October 2019
37. SOUNDBITE (English) Boris Johnson, British Prime Minister:
"Although we may disagree about some of the legislative innovations that you have favoured, there is no doubt in my mind that you have been a great servant of this Parliament."
38. Bercow in parliament with tears in his eyes
39. Wide of parliament
STORYLINE:
The speaker of Britain's House of Commons, who has become a global celebrity for his loud ties, even louder voice and star turn at the centre of Britain's political drama over Brexit, is stepping down on Thursday after 10 years in the job.
Some lawmakers are sad to see him go, but others are delighted.
Bercow, whose role is supposed to be strictly neutral, has become a hero to Brexit opponents, a villain to its advocates and a thorn in the side to Britain's Conservative government.
He often incurred the wrath of government ministers with his willingness to bend the rules to give lawmakers more power.
"Undoubtedly, he has as many detractors as he has people who worship the floor that he walks on," said Sebastian Whale, author of a "Called to Order," a forthcoming biography of Bercow.
"And that's the nature of the man. He is the speaker for the times. He's divisive, abrasive and controversial."
Prime Minister Boris Johnson paid Bercow a respectful but barbed tribute in the House of Commons on Wednesday.
"Although we may disagree about some of the legislative innovations you have favoured, there is no doubt in my mind that you have been a great servant of this Parliament and this House of Commons," Johnson said.
Bercow transformed the role of speaker, whose powers include running Commons business, calling on lawmakers to speak - or making them shut up - overseeing votes and ruling on questions of parliamentary procedure.
Seeing himself as the champion of Parliament against the executive, he took every opportunity to let lawmakers hold the government to account.
He hugely increased the number of times ministers had to come and answer urgent questions, and at crucial moments in the Brexit process he allowed lawmakers to seize control of the agenda.
One such intervention led to the law that forced Johnson to ask for a three-month delay to Brexit.
He also sank former Prime Minister Theresa May's Brexit deal by refusing to let her bring it back repeatedly for new votes.
It's a surprising journey for the taxi driver's son who began his career in the 1980s as a right-wing acolyte of Conservative Prime Minister Margaret Thatcher.
  
He made Parliament more modern - shedding the wig, changing sitting hours - and also more diverse and accessible. But he was accused by some who had worked with him of bullying.
He is supposed to be impartial, but revealed in 2017 that he had voted to remain in the EU in the 2016 referendum.
Pro-Brexit politicians accused him of favouring Remainers in his decisions but he pointed out that he had often championed the rights of the Brexiteers when they were in the minority.
Bercow's replacement will be elected by lawmakers on Monday.
There are nine candidates, including Bercow's three deputy speakers.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.