దిల్లీ శాసనసభ ఎన్నికల్లో 10 మంది అభ్యర్థులతో రెండో జాబితా విడుదల చేసింది భారతీయ జనతా పార్టీ. నామపత్రాల దాఖలుకు నేటితో గడువు పూర్తి కానున్న నేపథ్యంలో అభ్యర్థులను ప్రకటించింది.
న్యూదిల్లీ స్థానంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ప్రత్యర్థిగా రాష్ట్ర యువమోర్చా అధ్యక్షుడు సునీల్ యాదవ్‌ను బరిలోకి దింపింది భాజపా. అయితే సునీల్ యాదవ్ అభ్యర్థిత్వంపై భాజపా పునరాలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
పౌరసత్వ సవరణ చట్టం కారణంగా దిల్లీలో భాజపాతో కలిసి పోటీ చేయలేమని శిరోమణి అకాలీదళ్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో 10 మంది అభ్యర్థులతో మిగిలిన అభ్యర్థుల పేర్లను విడుదల చేసింది భాజపా.