లోక్సభ సభ ఎన్నికల కోసం భాజపా కొత్త నినాదాన్ని ప్రకటించింది. 'మోదీ హైతో ముమ్కిన్ హై'(మోదీ ఉంటే అన్నీ సాధ్యమే) నినాదంతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన బ్లాగ్లో వెల్లడించారు.
ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు అరుణ్ జైట్లీ. మోదీ ఐదేళ్ల నుంచి 24గంటలూ తీరిక లేకుండా పనిచేస్తున్నారని అన్నారు. ప్రధాని చురకైన వ్యక్తని, ఏ విషయాన్నైనా సులభంగా, త్వరగా నేర్చుకుంటారని తెలిపారు.
"మోదీ పనితీరును దేశమంతా గుర్తిస్తోంది. భారతదేశం తీసుకుంటున్న నిర్ణయాలను ప్రపంచదేశాలు అభినందిస్తున్నాయి. అందుకే వచ్చే ఎన్నికల కోసం 'మోదీ హైతో ముమ్కిన్ హై' అనే నినాదాన్ని ఎంపిక చేశాం. ఈ నినాదం ఎంతో సరైనది."
-- అరుణ్ జైట్లీ, కేంద్ర ఆర్థిక మంత్రి.
మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను జైట్లీ కొనియాడారు. జీఎస్టీ, ఆయుష్మాన్ భారత్ విశిష్టమైనవన్నారు.