ETV Bharat / bharat

స్వతంత్రుల మద్దతు.. ముఖ్యమంత్రిగా ఖట్టర్​!

హరియాణాలో భాజపా జెండా ఎగరడం దాదాపు ఖాయమైంది. కాషాయ పార్టీ బలం 48కి చేరడం వల్ల స్వతంత్ర అభ్యర్థులతో కలిసి ప్రభుత్వాన్ని స్థాపించడానికి ఖట్టర్​ సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో శనివారం పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. అనంతరం గర్వర్నర్​ను కలిసే అవకాశముంది.

స్వతంత్రుల మద్దతు.. ముఖ్యమంత్రిగా ఖట్టర్​!
author img

By

Published : Oct 25, 2019, 3:17 PM IST

హరియాణాలో ప్రభుత్వ ఏర్పాటుకు భాజపా సిద్ధమైంది. ఎన్నికల్లో సాధారణ మెజార్టీ సాధించడంలో విఫలమైనప్పటికీ స్వతంత్రుల మద్దతుతో కలిసి ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌.. మరోసారి అధికార పీఠాన్ని అధిష్టించనున్నారు. భాజపాకు మద్దతిస్తామని ఏడుగురు స్వతంత్రులతోపాటు హరియాణా లోక్‌హిత్‌ ఎమ్మెల్యే ప్రకటించిన నేపథ్యంలో.. రేపు ముఖ్యమంత్రిగా ఖట్టర్‌ ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది.

హరియాణాలో హంగ్ ఫలితం వచ్చిన వేళ.. అతిపెద్ద పార్టీగా అవతరించిన భాజపా అధికారం దక్కించుకునేందుకు వేగంగా పావులు కదిపింది. 24 గంటల్లోపే అవసరమైన మద్దతు కూడగట్టింది. 90 అసెంబ్లీ స్థానాలున్న హరియాణాలో సాధారణ మెజార్టీకి 46 మంది ఎమ్మెల్యేలు అవసరంకాగా.. భాజపా 40 చోట్ల గెలిచింది. కాంగ్రెస్‌ 31, జేజేపీ 10 చోట్ల విజయం సాధించాయి. ఏడుగురు స్వతంత్రులతోపాటు హరియాణా లోక్‌హిత్‌ పార్టీ ఎమ్మెల్యే భాజపాకు మద్దతు ప్రకటించడం వల్ల భాజపా బలం 48కి చేరింది. ఈ మేరకు పలువురు స్వతంత్ర ఎమ్మెల్యేలతో కలిసి దిల్లీలో భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసిన ఖట్టర్‌.. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు. అందుకు నడ్డా ఆమోదం తెలిపినట్లు సమాచారం.

శనివారం భాజపా శాసనసభాపక్ష సమావేశం నిర్వహించి.. మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ను తమ నేతగా ఎన్నుకోనున్నారు. అనంతరం ఖట్టర్‌ గవర్నర్‌ను కలిసి.. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. తనకు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు ఉందన్న ఖట్టర్.. త్వరలోనే అసెంబ్లీలో బలం నిరూపించుకుంటానని చెప్పారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Baghdad  - 25 October 2019
1. Long shot/tracking shot - protesters running away as security forces fire tear gas to disperse crowds, wounded protester on ground, tear gas smoke in background; AUDIO gunfire
2. Protesters carrying injured person; AUDIO: gunfire
STORYLINE:
Iraqi police fired live shots into the air and tear gas on Friday to disperse thousands of protesters on the streets of Baghdad, where planned anti-government demonstrations resumed after a three-week hiatus.
Protests over corruption, unemployment and lack of basic services triggered the demonstrations earlier this month.
The rallies turned deadly as security forces cracked down, using live ammunition.
The protests spread to several southern provinces and authorities imposed a curfew and shut down the internet for days in an effort to quell the unrest.
After a week of violence in the capital and the country's southern provinces, a government-appointed inquiry into the protests determined that security forces had used excessive force, killing 149 people and wounding over 3,000.
Eight members of the security forces were also killed.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.