ETV Bharat / bharat

అభ్యర్థుల ఎంపికలో నితీశ్ 'సోషల్​ ఇంజినీరింగ్'​ మంత్రం

author img

By

Published : Oct 9, 2020, 8:17 PM IST

ఎన్నికల్లో విజయం సాధించాలంటే.. బలమైన నేతలు, అంగ-అర్థ బలం, ప్రచార జోరు, ప్రజల్లో నమ్మకం వంటి అస్త్రాలు అవసరం. అయితే, వీటితో పాటు మరొకటి కీలకంగా నిలుస్తుంది. అదే 'సోషల్​ ఇంజినీరింగ్​'. ఇందులో ఆరితేరిన వారికి.. ఇదే పాశుపతాస్త్రం. బిహార్​ నేతల్లో ఈ అంశంలో తలపండిపోయిన ఉద్ధండులు ఉన్నారు. బిహార్ ఎన్నికల కోసం తాజాగా ప్రకటించిన జేడీయూ అభ్యర్థుల జాబితాలో.. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్​​ మార్కు సోషల్​ ఇంజినీరింగ్ స్పష్టంగా కనిపిస్తోంది.

social engineering
జేడీయూ అభ్యర్థుల జాబితాలో నితీశ్ 'సోషల్​ ఇంజినీరింగ్'​ మంత్రం

బిహార్​ ఎన్డీఏలో కీలకంగా ఉన్న అధికార పక్షం జేడీయూ.. పొత్తులో భాగంగా తాము పోటీ చేస్తున్న 115 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. మరోసారి అధికారం దక్కించుకోవటమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న జేడీయూ.. ఈ జాబితాలో అన్ని జాగ్రత్తలూ తీసుకుంది. పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​ అన్నీతానై ప్రత్యేకంగా ఈ జాబితాను రూపొందించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా.. అత్యంత వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యం దక్కింది. ఆర్జేడీ.. ముస్లిం-యాదవ్​ ఓటు బ్యాంకుకు గండి కొట్టేలా సోషల్​ ఇంజినీరింగ్​ లెక్కలతో అభ్యర్థులను ఎంపిక చేశారు.

వెనుకబడిన వర్గాలే లక్ష్యం

ఈబీసీ ఓటర్లు రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నారు. జేడీయూ జాబితాలో చాలా టికెట్లు వీరే దక్కించుకున్నారు. అధికారంలో ఉన్నపుడే వెనుకబడిన వర్గాలపై ప్రత్యేక దృష్టి సారించిన నితీశ్​.. వారి సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఉద్యోగ నియామకాల్లోనూ వారికి అగ్రపీఠం వేశారు. ఇవన్నీ సోషల్ ఇంజినీరింగ్.. సామాజిక సర్దుబాటుగానే భావించాలంటున్నారు విశ్లేషకులు. ముఖ్యంగా ఇన్నాళ్లూ లాలూ వెంట ఉన్న ఈ ఓటర్లందరినీ తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నాలుగా పేర్కొంటున్నారు. జాబితాలో యాదవ్​ వర్గానికి స్పష్టమైన ప్రాధాన్యం దక్కింది.

ఆర్జేడీ ఆస్తిపై కన్ను..

ఒక్క యాదవ వర్గానికే.. 19 సీట్లు దక్కాయి. వీరే రాష్ట్రంలో సంఖ్యాపరంగా అత్యధికంగా ఉన్న సామాజిక వర్గం. ఆర్జేడీ బలమంతా యాదవులే. ఇలా ప్రత్యర్థి కుంభస్థలంపై కొట్టాలనే దిశగా నితీశ్​ అడుగులు వేశారు. 2015 ఎన్నికల్లో ఇరుపార్టీలు కలిసి పోటీ చేసిన కారణంగా.. యాదవుల ఓట్లు జేడీయూకు పడ్డాయి. ఈ నేపథ్యంలో కొంత బలమైన యాదవ నేతలను పార్టీలో చేర్చుకుంది. ఇలా ఓట్లు కొల్లగొట్టాలని జేడీయూ చూస్తోంది.

ముస్లిం ఓట్లు దక్కేనా ?

అలాగే, 11 మంది ముస్లింలకు టికెట్లు ఇచ్చింది జేడీయూ. ఆర్జేడీ లక్ష్యంగానే ఈ ఎత్తులంటూ అభివర్ణిస్తున్నారు పరిశీలకులు. అంటే, మొత్తం స్థానాల్లో దాదాపు 10% వీరికే కేటాయించారు. ఇప్పటివరకూ ముస్లింలు ఆర్జేడీకే మద్దతు తెలుపుతూ వస్తున్నారు. బిహార్​ ఫలితాలను ప్రభావితం చేయగలిగిన స్థాయిలోనే వీరి సంఖ్య ఉంది. దాదాపు 15% ఓటర్లు ఉన్నారు. తాజాగా ఎంఐఎం సైతం ఇక్కడి ముస్లింలను ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. అయితే, జేడీయూకు వీరు పెద్దగా మద్దతిచ్చిన దాఖలాలు లేవు. ఆర్జేడీ-కాంగ్రెస్​ల ఓటు బ్యాంకును ఒడిసిపట్టాలనే యోచనలో ఉంది నితీశ్​ కుమార్​ పార్టీ. ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో మత ఘర్షణలు తలెత్తకుండా చూడటంలో ఆయన విజయం సాధించారనే వాదనలున్నాయి.

Bihar JD(U)
అభ్యర్థుల జాబితాలో సోషల్​ ఇంజినీరింగ్

ముఖ్యమంత్రి సామాజిక వర్గం..

అయితే, సంఖ్యా పరంగా రాష్ట్రంలో తక్కువగానే ఉన్నారు కుర్మీలు. జేడీయూ వీరికి 12 స్థానాలు కేటాయించటం వెనుక మర్మమేంటో తెలయట్లేదంటున్నారు పరిశీలకులు. ఇది ముఖ్యమంత్రి నితీశ్​ సొంత సామాజిక వర్గం. ఓబీసీల్లో బలమైన వర్గంగా ఉన్న కుశ్వాహా సామాజిక వర్గానికి 15 స్థానాలు కేటాయించారు.

ఎస్సీలపై ఆశ..

ఇక సామాజిక సర్దుబాట్లలో భాగంగానే.. షెడ్యూల్డు కులాలకు కేటాయించిన 7 స్థానాలను మాంఝీల సాయంతో ఎలాగైనా గెలవాలనే తలంపుతో ఉన్నారు నితీశ్. చిరాగ్​ పాసవాన్​ పార్టీ.. ఇందుకు ప్రధాన అడ్డంకిగా ఉంది.

అగ్రవర్ణాలకు అగ్రపీఠం

రాష్ట్రంలో కీలకంగా ఉన్న అగ్రవర్ణాలకు 19 సీట్లు కేటాయించింది జేడీయూ. భాజపా మద్దతుతో వీటిని గెలుచుకోవాలని భావిస్తోంది. వీరిలో 7 స్థానాల్లో రాజ్​పుత్​లను బరిలో నిలిపింది. 10 సీట్లు భుమిహర్​లకు కేటాయించి అగ్రవర్ణాల్లో అతిపెద్ద వర్గాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఇలా నితీశ్ పూర్తిస్థాయి ​ సామాజిక సర్దుబాట్లతో అన్ని వర్గాలను ఆకట్టుకోవటమే లక్ష్యంగా.. ప్రత్యర్థి పార్టీలను దెబ్బతీసే విధంగా సీట్లు కేటాయించారంటున్నారు పరిశీలకులు.

మహిళలకు పెద్దపీట..

మరోవైపు మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది అధికార పార్టీ. మొత్తం కేటాయింపుల్లో సామాజిక సర్దుబాట్ల తర్వాత దాదాపు ఐదోవంతు.. మహిళలే టికెట్లు దక్కించుకున్నారు. పార్టీ ఇప్పటికే రాష్ట్రంలో మహిళా సాధికారతపై ప్రత్యేక దృష్టి సారించామని ప్రచారంలో హోరెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో అత్యధిక సీట్లు కేటాయించి.. మహిళా ఓటర్లను తమవైపు తిప్పుకోవాలనే యోచనలో ఉంది.

అయితే, సోషల్​ ఇంజినీరింగ్​ ద్వారా.. నితీశ్​ కుమార్​ పక్కా లెక్కలతో స్థానాలు కేటాయించారు. అయినా, కొన్ని చోట్ల అభ్యర్థులపై ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. అభ్యర్థిత్వంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. వీరిలో కొందరిపై నేరారోపణలు ఉండటమే ఇందుకు కారణం.

ఇదీ చూడండి:పాసవాన్​ మృతితో బిహార్​ ఎన్నికలపై భారీ ప్రభావం!

ఇదీ చూడండి: బిహార్​లో తెరపైకి మరో కూటమి- 6 పార్టీలతో ఏర్పాటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.