దేశంలో కరోనా వేగంగా విజృంభిస్తోంది. రోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ లాక్డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి పలు రాష్ట్రాలు.
బిహార్లో..
బిహార్లో ఇటీవల కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే రికార్డు స్థాయిలో 1,432 మందికి వైరస్ సోకింది. రాష్ట్రంలో ఒక్కరోజు వ్యవధిలో ఇప్పటివరకు ఇవే అత్యధికం.
ఈ తరుణంలో రాష్ట్రవ్యాప్తంగా మరోసారి లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించారు ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ. జులై 16 నుంచి 31 వరకు లాక్డౌన్ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. లాక్డౌన్ మార్గదర్శకాలనూ విడుదల చేశారు. కొన్నింటికి మినహాయించి.. ప్రభుత్వ, ప్రైవేటు వాణిజ్య కార్యకలాపాలకు అనుమతి ఉండదని ప్రకటించారు.
⦁ వ్యవసాయ పనులకు, ఇతర నిత్యవసర వస్తువుల కొనుగోలుకు అనుమతి
⦁ ప్రార్థనా మందిరాలు మూసివేత
కర్ణాటకలో..
కర్ణాటక కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. ఈ నేపథ్యంలో దక్షిణ కన్నడ జిల్లాలో జులై 15 రాత్రి 8 గంటల నుంచి జులై 23 ఉదయం 5 గంటల వరకు లాక్డౌన్ విధిస్తున్నట్లు ఆ జిల్లా అధికార యంత్రాంగం ప్రకటించింది.