ETV Bharat / bharat

దిగ్గజ బాక్సర్లతో మినీ క్యూబాగా 'భీవాణీ' - భారత్​లో చిన్న కాశీ

దేశవ్యాప్తంగా ఉన్న బాక్సర్లలో దాదాపు 50 శాతం మంది హరియాణాలోని భివాణీకి చెందిన వారే. గతంలో.. ఎన్నో ఆలయాలకు నెలవుగా ఉన్న ఈ ప్రాంతాన్ని చిన్న కాశీ అనిపిలిచేవారు. కానీ, విజేందర్, అఖిల్​ మొదలైన ఎందరో బాక్సర్లకు జన్మస్థానమైన భివాణీని ప్రస్తుతం మినీ క్యూబాగా పిలుస్తున్నారు. ఈ గుర్తింపు రావడానికి రెండు దశాబ్దాల బాక్సర్లు అవిరామంగా కృషి చేశారని ప్రస్తుత బాక్సర్లు అభిప్రాయపడుతున్నారు.

BHIWANI_BOXER
'దిగ్గజ బాక్సర్లందరూ ఆ ప్రాంతం వారే'
author img

By

Published : Oct 17, 2020, 5:23 AM IST

Updated : Oct 17, 2020, 6:10 AM IST

బాక్సర్లకు నెలవుగా భివాణీ

ప్రపంచ గుర్తింపు పొందిన బాక్సర్ల సత్తాతో.. హరియాణలోని భివాణీ మినీక్యూబాగా ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందింది. 21వ కామన్వెల్త్ ఆటల్లో హరియాణ నుంచి పాల్గొన్న ఆరుగురు బాక్సర్లలో ముగ్గురు భివాణీకి చెందినవారే. వారిలో వికాస్ యాదవ్‌ స్వర్ణం కైవసం చేసుకోగా.. మనీష్ కౌశిక్ రజతం, నమన్ కాంస్య పతకాలు గెలుచుకున్నారు.

"విజేందర్ కూడా ఇక్కడివాడే. అఖిల్‌, జితేంద్ర మా ప్రాంతంవారే. వాళ్లే కాదు..ఇక్కడ చాలా మంది బాక్సర్లున్నారు. దినేష్ కూడా ఇక్కడివాడే. భివాణీకి చెందిన చాలామంది బాక్సర్లు ఒలంపిక్స్‌లో పాల్గొన్నవారే".

-ప్రమోద్ కుమార్, అంతర్జాతీయ బాక్సర్

"భివాణీ బాక్సర్లు పంచ్‌ మెషీన్‌ కంటే వేగంగా ఉంటారు. వీళ్ల దెబ్బ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. ఒలంపియన్లందరూ భివాణీలో తయారైనవాళ్లే".

-నీరజ్ పరాశార్, అంతర్జాతీయ బాక్సర్

'అందుకే మినీ క్యూబా అంటారు'

భివాణీలో 2 వేల మంది బాక్సర్లు ఉన్నారు. 20 వేలకు పైగా వివిధ క్రీడాకారులు ఉంటారు. ఈ ప్రత్యేకతే భివాణీకి మినీ క్యూబాగా పేరుతెచ్చింది. ఎక్కువ సంఖ్యలో ఆలయాలు ఉండడం వల్ల, గతంలో భివాణీని చిన్నకాశీగా పిలిచేవారు. కానీ.. గడచిన ఇరవేయ్యళ్లలో ఇక్కడి బాక్సర్లు ఎంత ఆదరణ పొందారంటే భివాణీ పేరు మినీక్యూబాగా మారిపోయింది. భివాణీలో ప్రతి 4, 5 ఇళ్లకు ఒక బాక్సర్ ఉంటాడు.

"ఈ ఊరిని బాక్సింగ్‌ క్రీడాకారులకు పెట్టింది పేరుగా మార్చడంలో ఈ క్లబ్‌ పాత్ర ఎంతో ఉంది. దేశానికి ఎంతోమంది అంతర్జాతీయ స్థాయి బాక్సర్లను ఇచ్చిందీ బాక్సింగ్ క్లబ్.

అబ్బాయిలు మాత్రమే కాదు..అమ్మాయిలు కూడా ఇక్కడ బాక్సింగ్ చేస్తారు. అందుకే రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో మాకు పతకాలు వచ్చాయి".

-సాక్షి, బాక్సర్

"30 నుంచి 40 చిన్నారులు ఇక్కడ బాక్సింగ్ సాధన చేస్తారు. అందరూ చాలా బాగా సాధన చేస్తారు. చెమటోడ్చి, కష్టపడి బాక్సింగ్ ఆడతారు".

-అక్షయ్, బాక్సర్

"బాగా కష్టపడి, బాక్సింగ్ కోసం ఏదైనా చేయాలని మేం అనుకుంటున్నాం".

-రోనిత్ యాదవ్, బాక్సర్

దిగ్గజ బాక్సర్లకు కోవెలలా 'భివాణీ'

2003 ఫిబ్రవరి 3న భివాణీ బాక్సింగ్ క్లబ్‌ ప్రారంభించారు. ఒలంపిక్ విజేత విజేందర్ సింగ్ చిన్న వయసులోనే భివాణీ బాక్సింగ్‌ క్లబ్‌లో చేరాడు. ఇక్కడ శిక్షణ తీసుకున్న వారిలో దాదాపు అందరూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో స్టార్ బాక్సర్లుగా ఎదిగారు. 1960 దశకంలో అంతర్జాతీయ స్థాయిలో మొదటిసారిగా భివాణీకి విజయం దక్కింది. బ్యాంకాగ్‌లో జరిగిన 1966 ఆసియన్ గేమ్స్‌లో హవాసింగ్ స్వర్ణం గెలుచుకున్నారు. అతని అద్భుత ప్రదర్శనకుగానూ అర్జున పురస్కారం వరించింది.

మినీ క్యూబా అన్న పేరు భివాణీకి అంత సులభంగా రాలేదు. గడిచిన రెండు దశాబ్దాలకు చెందిన బాక్సర్ల అవిరామ కృషికి ఫలితమది. ఇక్కడి ఆటగాళ్లు ఖేల్‌రత్న అవార్డు మొదలుకుని, అర్జున అవార్డుల వరకూ గెలుచుకున్నారు. మొత్తంగా 14 అర్జున పురస్కారాలు, ఒక ఖేల్‌రత్న అవార్డు కైవసం చేసుకున్నారు. దేశంలోని బాక్సర్లలో 50% పైగా భివాణీకి చెందినవారే.

ఇదీ చదవండి:'కీ' షాక్​- మహిళల భద్రతకు వినూత్న ఆవిష్కరణ

Last Updated : Oct 17, 2020, 6:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.