ETV Bharat / bharat

మమతకు 'షా' ఘాటు లేఖ..  స్పందించిన సర్కార్​

శ్రామిక్ రైళ్లను రాష్ట్రంలోని అనుమతిచ్చే విషయమై కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాసిన లేఖపై సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వం స్పందించింది. 8 శ్రామిక్​ రైళ్లను రాష్ట్రంలోకి అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది.

mamata responds to sha latter
అమిత్ షా లేఖకు మమతా స్పందన
author img

By

Published : May 9, 2020, 12:36 PM IST

వలస కార్మికులతో వస్తున్న రైళ్లను బంగాల్​లోకి రానివ్వకపోతే వారికి అన్యాయం జరుగుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్​ షా రాసిన లేఖపై స్పందించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. 8 శ్రామిక్ రైళ్లను రాష్ట్రంలోకి అనుమతిస్తూ మమతా ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.

లేఖాస్త్రం ఇలా..

ఉపాధికోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లి లాక్​డౌన్​తో అక్కడే చిక్కుకున్న వారిని ఇటీవల సొంత రాష్ట్రాలకు తరలించే కార్యక్రమాన్ని ప్రారంభించింది కేంద్రం. ఇందుకోసం శ్రామిక్ రైళ్లను నడుపుతోంది. అయితే ఈ రైళ్లను తమ రాష్ట్రంలోకి వచ్చేందుకు అనుమతి ఇవ్వడం లేదు బంగాల్. ఈ విషయంపై ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మమతాకు లేఖ రాశారు షా.

వలస కూలీలును అడ్డుకుని వారికి మరిన్ని కష్టాలు తెచ్చిపెడుతున్నారంటూ ఆ లేఖలో పేర్కొన్నారు షా. కూలీలను తరలించేందుకు తాము ప్రయత్నం చేస్తున్నా బంగాల్ తమతో సహకరించడం లేదని ఆరోపించారు.

ఇదీ చూడండి:భారత్​లో 1981కి పెరిగిన కరోనా మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.