ETV Bharat / bharat

'అద్దం' ఫార్ములాతో బహిరంగ మూత్ర విసర్జనకు చెక్​

author img

By

Published : Jan 14, 2020, 12:40 PM IST

వీధి గోడలపై మూత్ర విసర్జన చేసేవారిని అరికట్టేందుకు బెంగళూరు మహానగర పాలిక వినూత్న ప్రయోగం చేసింది. గోడలపై భారీ అద్దాలను ఏర్పాటు చేసింది. కేంద్రం ఇచ్చే స్వచ్ఛ సర్వేక్షన్​ ర్యాంకింగ్స్​లో ఉన్నత స్థానాన్ని కైసవం చేసుకునేందుకు ఇలా కృషి చేస్తోంది.

BBMP installs huge mirror to prevent urinating in the streets
'అద్దం' ఫార్ములాతో బహిరంగ మూత్ర విసర్జనకు చెక్​

దేశాన్ని పరిశుభ్రంగా ఉంచాలని కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్​ కార్యక్రమాన్ని తీసుకొచ్చినా కొంతమంది బాధ్యతా రాహిత్యంగానే ఉంటున్నారు. వీధిగోడలపై మూత్ర విసర్జన చేస్తూ పరిసరాలను మలినం చేస్తున్నారు. ఇలాంటి వారిని నియంత్రించి వీధులను శుభ్రంగా ఉంచేందుకు సరికొత్త ఆలోచన చేసింది బృహత్​ బెంగళూరు మహానగర పాలిక. నగరంలోని పలు గోడలపై భారీ అద్దాలను ఏర్పాటు చేసింది. ఒక్కో అద్దం ఖరీదు రూ. 50వేలు. వీటిని నగరంలోని కేఆర్ మార్కెట్, ఈఎస్​ఐ హాస్పిటల్​, ఇందిరానగర్, క్వీన్స్​ రోడ్​ వీధుల్లోని గోడలకు అతికించింది.

BBMP installs huge mirror to prevent urinating in the streets
అద్దం' ఫార్ములాతో బహిరంగ మూత్ర విసర్జనకు చెక్​

గోడలపై మూత్ర విసర్జన చేసి నగర అందాన్ని మసకబార్చి నిర్లక్ష్యంగా వ్యహరించే వారు అద్దంలో తమను తాము చూసుకోనైనా మారతారనే ఉద్దేశంతోనే ఇలా చేసినట్లు బీబీఎంబీ అధికారులు తెలిపారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచి కేంద్రం ఇచ్చే స్వచ్ఛ సర్వేక్షన్​ ర్యాంకింగ్స్​లో ఉన్నత స్థాయిలో ఉండటమే తమ లక్ష్యమన్నారు.

2019లో అత్యంత పారిశుద్ధ్య నగరంగా నిలిచి వరుసగా మూడో ఏడాది పురస్కారం కైవసం చేసుకుంది ఇండోర్​.

ఇదీ చూడండి: సీఏఏను సవాల్​ చేస్తూ సుప్రీంలో కేరళ సర్కారు పిటిషన్​

Intro:Body:

dd

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.