ETV Bharat / bharat

బాబ్రీ తీర్పు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం: కాంగ్రెస్​

A Special CBI court in Lucknow will pronounce its verdict in the Babri Masjid demolition case on Wednesday nearly 28 years after the mosque in Ayodhya was demolished on December 6, 1992. Out of the 49 accused, 17 died while 32 accused are still on trial. As the nation awaits the verdict on the case which left a deep imprint in the national politics, ETV Bharat explains the case in detail.

Babri Masjid demolition judgement
బాబ్రీ తీర్పు
author img

By

Published : Sep 30, 2020, 10:19 AM IST

Updated : Sep 30, 2020, 2:44 PM IST

14:42 September 30

బాబ్రీ కేసులో నిందితులు అందరినీ నిర్దోషులుగా ప్రకటించడంపై కాంగ్రెస్​ తీవ్రంగా స్పందించింది. ఈ నిర్ణయం... రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. లఖ్​నవూ కోర్టు తీర్పును  కేంద్రం, యూపీ ప్రభుత్వం సవాలు చేస్తాయని రాజ్యాంగంపై విశ్వాసం ఉన్నవారంతా భావిస్తారని వ్యాఖ్యానించింది కాంగ్రెస్.

14:01 September 30

మన‌ఃస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా: అడ్వాణీ

  • సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పును మన‌ఃస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా: అడ్వాణీ
  • ఈ తీర్పుతో వ్యక్తిగతంగా నాపై, భాజపాపై ఉన్న అపవాదులు తొలగాయి: అడ్వాణీ
  • రామజన్మభూమి ఉద్యమం విషయంలో నాపై అపవాదులు తొలగినట్లే: అడ్వాణీ
  • 2019 నవంబరులో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఈ తీర్పు రావడం సంతోషకరం: అడ్వాణీ
  • ఈ తీర్పులతో నా చిరకాల స్వప్నం రామమందిర నిర్మాణానికి మార్గం సుగమం: అడ్వాణీ
  • పార్టీ కార్యకర్తలు, నాయకులు, సాధువులకు కృతజ్ఞతలు: అడ్వాణీ
  • అయోధ్య ఉద్యమంలో నిస్వార్థంగా పనిచేసిన వారందరికీ కృతజ్ఞతలు: అడ్వాణీ
  • న్యాయవాదుల బృందానికి కృతజ్ఞతలు: అడ్వాణీ
  • రామమందిరం పూర్తికి కోట్లమంది భారతీయుల్లాగే నేనూ ఎదురుచూస్తున్నా: అడ్వాణీ

13:47 September 30

జావడేకర్‌ హర్షం

  • అడ్వాణీ, జోషి, ఇతరులను నిర్దోషులుగా ప్రకటించడం సంతోషంగా ఉంది: జావడేకర్‌

13:46 September 30

తీర్పును స్వాగతిస్తున్నా: రాజ్‌నాథ్‌సింగ్‌

  • సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పును స్వాగతిస్తున్నా: రాజ్‌నాథ్‌సింగ్‌
  • ఎప్పటికీ సత్యమే గెలుస్తుందని ఈ తీర్పు ద్వారా మరోసారి నిరూపితమైంది: రాజ్‌నాథ్‌

13:44 September 30

తీర్పు కాపీ అందిన తర్వాత స్పందిస్తాం: సీబీఐ

13:27 September 30

బాబ్రీ కేసులో తీర్పును హృదయ పూర్వకంగా స్వాగతిస్తున్నట్లు చెప్పారు భాజపా సీనియర్ నేత ఎల్​కే అడ్వాణీ. ఈ తీర్పు రామ జన్మభూమి ఉద్యమం పట్ల తన, భాజపా విశ్వాసానికి, నిబద్ధతకు నిదర్శమని తెలిపారు.
 
13:18 September 30

  • It's a historic decision by the court. This proves that no conspiracy was hatched for December 6 incident in Ayodhya. Our program and rallies were not part of any conspiracy. We are happy, everyone should now be excited about Ram Mandir's construction: Murli Manohar Joshi, BJP https://t.co/dwpyHkDM6X pic.twitter.com/2Uf5WrINZp

    — ANI (@ANI) September 30, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు చారిత్రకమని చెప్పారు బాబ్రీ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న భాజపా సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి. ఈ ఘటన వెనుక కుట్ర లేదనే విషయం రుజువైందన్నారు. తాము నిర్వహించిన కార్యక్రమాలు, ర్యాలీలు కుట్రలో భాగం కాదని తెలిపారు. తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. ఇప్పుడిక రామ మందిర నిర్మాణం కోసం అందరూ అత్రుతగా ఎదురు చూస్తున్నారని జోషి అన్నారు.

13:16 September 30

  • మా ఉద్యమం సామాన్యులతో కూడినది: మురళీమనోహర్ జోషి
  • ఎలాంటి కుట్ర లేదని కోర్టు ద్వారా నిరూపితమైంది: మురళీమనోహర్ జోషి

13:08 September 30

బాబ్రీ తీర్పుపై రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ హర్షం వ్యక్తంచేశారు. ఆలస్యమైనా న్యాయమే గెలుస్తుందనేందుకు ఈ తీర్పు నిదర్శనమని వ్యాఖ్యానించారు.

12:51 September 30

దిల్లీలోని అడ్వాణీ నివాసానికి భాజపా నేతలు

బాబ్రీ కేసులో భాజపా అగ్రనేత అడ్వాణీని నిర్దోషిగా తేలుస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ఈ నేపథ్యంలో  ఆయన నివాసానికి పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు చేరుకుంటున్నారు.

12:47 September 30

బాబ్రీ తీర్పు: యూపీ, దిల్లీలో హైఅలర్ట్‌

  • కోర్టు తీర్పు నేపథ్యంలో యూపీ, దిల్లీలో హైఅలర్ట్‌
  • సున్నిత ప్రాంతాల్లో పారామిలిటరీ దళాల మోహరింపు
  • ఉత్తర్‌ప్రదేశ్‌, దిల్లీలో సభలు, సమావేశాలపై నిషేధం

12:42 September 30

బాబ్రీ మసీదు ఘటన కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. భాజపా సీనియర్ నేతలు ఎకే అడ్వాణీ, మురళీమనోహర్​ జోషితో పాటు ప్రముఖ నేతలు ఉమాభారతి, కల్యాణ్ సింగ్ ప్రస్తుత రామాలయ నిర్మాణ బాధ్యతలు చూస్తున్న ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్‌ సహా అందరినీ నిర్దోషులుగా సీబీఐ ప్రత్యేక కోర్టు తేల్చింది.

తీర్పు సమయంలో ప్రస్తుతమున్న 32మంది నిందితులంతా కోర్టులో హాజరు కావాలని సెప్టెంబర్‌ 16న న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు. అయితే, వయోభారం, కరోనా కారణంగా ఆడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషి, మహంత్‌ నృత్యగోపాల్‌ దాస్‌‌లు కోర్టుకు హాజరు కాలేకపోయినట్లు తెలుస్తోంది. ఉమాభారతి, కల్యాణ్‌ సింగ్‌లకు కరోనా సోకడంతో వారు ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దీంతో వారు తీర్పు సమయంలో కోర్టుకు హాజరుకాలేదు. వీరంతా తీర్పు సమయంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అందుబాటులో ఉన్నారు. ఇక సాక్షి మహారాజ్‌, వినయ్ కటియార్‌, ధరమ్‌ దాస్‌, పవన్‌ పాండే, వేదాంతి, లల్లూసింగ్‌, చంపత్‌రాయ్‌లతోపాటు మిగతావారంతా కోర్టుకు హాజరయ్యారు. ఇక ఈ కేసు విచారణను సెప్టెంబర్‌ 30నాటికి పూర్తి చేసి, తీర్పు వెలువరించాలని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని సుప్రీంకోర్టు ఇదివరకే ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీబీఐ కోర్టు నేడు తీర్పును వెలువరించింది. తీర్పు సందర్భంగా సీబీఐ కోర్టు బయట భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

12:25 September 30

  • బాబ్రీ మసీదు కేసులో నిందితులందరిపై అభియోగాలు కొట్టివేత
  • బాబ్రీ మసీదు కేసులో నిందితులందరినీ నిర్దోషులుగా తేల్చిన సీబీఐ ప్రత్యేక కోర్టు
  • సరైన ఆధారాలు లేవని అందరిపై అభియోగాలు కొట్టివేత
  • నేరపూరిత కుట్రకు పాల్పడ్డారనేందుకు ఆధారాలు లేవన్న కోర్టు
  • బాబ్రీ మసీదు కేసులో 28 ఏళ్ల తర్వాత వెలువడిన తీర్పు

11:57 September 30

తీర్పు కాపీ చదువుతున్న న్యాయమూర్తి ఎస్‌.కె.యాదవ్‌

  • బాబ్రీ మసీదు కేసులో కాసేపట్లో తీర్పు
  • తీర్పు ఇవ్వనున్న లఖ్‌నవూలోని సీబీఐ ప్రత్యేక కోర్టు
  • తీర్పు కాపీ చదువుతున్న న్యాయమూర్తి ఎస్‌.కె.యాదవ్‌
  • బాబ్రీ మసీదు కేసులో మొత్తం 49 మంది నిందితులు
  • కేసు విచారణలో ఉండగానే మరణించిన 17 మంది నిందితులు
  • మిగిలిన 32 మందిలో కోర్టుకు హాజరుకాని ఆరుగురు నిందితులు
  • కోర్టుకు హాజరుకాని వారిలో అడ్వాణీ, మురళీమనోహర్‌ జోషి, కల్యాణ్‌సింగ్‌, నృత్యగోపాల్‌దాస్‌, ఉమాభారతి

11:31 September 30

సీబీఐ ప్రత్యేక కోర్టు వద్ద భారీ బందోబస్తు

లఖ్‌నవూ సీబీఐ ప్రత్యేక కోర్టు వద్ద భారీ బందోబస్తు

బాబ్రీ మసీదు కేసు తీర్పు దృష్ట్యా భద్రతా చర్యలు

10:59 September 30

కోర్టుకు హాజరైన 21 మంది నిందితులు

  • మిగతా 32 మందిలో కోర్టుకు హాజరైన 21 మంది నిందితులు

10:43 September 30

సీబీఐ ప్రత్యేక కోర్టుకు చేరుకున్న న్యాయమూర్తి

బాబ్రీ మసీదు కేసులో కాసేపట్లో తీర్పు

తీర్పు ఇవ్వనున్న లఖ్‌నవూలోని సీబీఐ ప్రత్యేక కోర్టు

సీబీఐ ప్రత్యేక కోర్టుకు చేరుకున్న న్యాయమూర్తి ఎస్‌.కె.యాదవ్‌

అడ్వాణీ, మురళీమనోహర్ జోషి కోర్టుకు హాజరు కాకపోవచ్చు: న్యాయవాది కె.కె.మిశ్రా

ఉమాభారతి, కల్యాణ్‌సింగ్‌, నిత్యగోపాల్‌దాస్‌ కోర్టుకు హాజరు కాకపోవచ్చు: న్యాయవాది కె.కె.మిశ్రా

సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరైన వినయ్‌ కటియార్‌, ధరమ్‌దాస్‌

సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరైన వేదాంతి, లల్లూసింగ్‌, చంపత్‌రాయ్‌

సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరైన పవన్‌పాండే, సాధ్వి రితంబరా

10:33 September 30

భద్రత కట్టుదిట్టం

  • Lucknow: Security tighetened around Special CBI court. The court will pronounce its verdict today, in Babri Masjid demolition case. pic.twitter.com/ArCv47NDsB

    — ANI UP (@ANINewsUP) September 30, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

బాబ్రీ కేసు తీర్పు నేపథ్యంలో లఖ్​నవూలో పోలీసులు  భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెళ్లడించారు.

10:29 September 30

  • బాబ్రీ మసీదు కేసులో కాసేపట్లో తీర్పు
  • సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ

  • బాబ్రీ మసీదు కేసులో 28 ఏళ్లపాటు జరిగిన విచారణ

  • విచారణలో భాగంగా 351 మంది సాక్షులను ప్రశ్నించిన సీబీఐ
  • నిందితులుగా అడ్వాణీ, మురళీమనోహర్ జోషి, ఉమాభారతి, కల్యాణ్‌సింగ్
  • తీర్పు రోజున నిందితులంతా కోర్టుకు రావాలని ఆదేశించిన సీబీఐ కోర్టు
  • కరోనా బారినపడి చికిత్స తీసుకుంటున్న ఉమాభారతి, కల్యాణ్‌సింగ్

10:02 September 30

లైవ్​ అప్​డేట్స్​: 'బాబ్రీ మసీదు' కేసు తీర్పు

28 సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం బాబ్రీ మసీదు ఘటన కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మరికాసేపట్లో తీర్పు వెలువరించనుంది భాజపా సీనియర్ నేతలు ఎల్‌కే అడ్వాణీ, ఎమ్ఎమ్ జోషీ సహా 32మంది ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. తీర్పు నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్ లఖ్‌నవూలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

అసలేం జరిగింది?

1992, డిసెంబర్​ 6న లక్షలాదిమంది కరసేవకులు.. సుప్రీం కోర్టు అనుమతితో కర సేవ పేరుతో భారీ కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా బాబ్రీ మసీదు వద్ద పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. హింస చెలరేగిన వెంటనే.. స్థానిక రామ్​ జన్మభూమి పోలీస్​ స్టేషన్​లో సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు.

ఈ ఘటనలో లక్షలాదిమంది కర సేవకులను నిందితులుగా చేర్చారు. అయితే ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు. మరో 10 నిమిషాల తర్వాత 6:25కు ఎల్​కే అడ్వాణీ సహా మరికొంత మంది ప్రముఖులపై కేసు నమోదు చేశారు.

రెండో ఎఫ్​ఐఆర్​ నమోదు చేసిన తర్వాత స్థానిక పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. అనంతరం రెండవ రోజు ఈ కేసు సీబీసీఐడీకి బదిలీ అయ్యింది. రాష్ట్రంలో చెలరేగిన ఈ విధ్వంసానికి బాధ్యతవహిస్తూ.. నాటి యూపీ ముఖ్యమంత్రి కల్యాణ్​ సింగ్ రాజీనామా చేశారు. వెంటనే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. అప్పటినుంచి ఈ అంశం రాజకీయమైంది.

ఇక దర్యాప్తులో భాగంగా సీబీసీఐడీ ఈ కేసుకు సంబంధించిన ఛార్జ్​షీట్ దాఖలు చేసింది. తర్వాత ఈ కేసు పూర్తిగా సీబీఐ చేతికి వెళ్లింది.

అదే సమయంలో ఈ కేసుకు సంబంధించి రెండు చోట్ల విచారణ మొదలైంది. రాయబరేలీలో ఈ కేసులోని ప్రముఖులకు సంబంధించిన విచారణ జరుగుతుండగా.. లఖ్​నవూలో ఇతర నిందితులకు సంబంధించిన కేసు నడుస్తుండేది. అయితే, సుప్రీం కోర్టు రాయబరేలీ కేసును కూడా లఖ్​నవూకు మార్చేసింది. ఇక్కడి సీబీఐ ప్రత్యేక కోర్టులోనే పూర్తి స్థాయిలో.. వివిధ కోణాల్లో ముగిసిన దర్యాప్తు, విచారణల అనంతరం సెప్టెంబర్​ 30న తీర్పు వెలువడేందుకు సర్వం సిద్ధమైంది.

ఈ కేసు విచారణ తీవ్రమైన నేరానికి కుట్రకు సంబంధించిన కోణంలో జరిగింది. అయితే, 2001లో ట్రయల్​ కోర్టు ఈ కేసును కొట్టివేసింది. అలహాబాద్​ హైకోర్టు 2010లో ఈ తీర్పును సమర్థించింది. కానీ 2017లో ఈ కేసుకు సంబంధించి అప్పీళ్లు రాగా హైకోర్టు తీర్పు సంస్పెండ్​ చేస్తూ మరోసారి విచారణ చేపట్టాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ప్రత్యేక జడ్జి ఆధ్వర్యంలో విచారణ నిర్వహిస్తూ రెండేళ్లలో తీర్పు వెలువరించాలన్న సుప్రీం ఆదేశాల మేరకు.. ఈ ఏడాది అగస్టు 31న తీర్పు రావాల్సింది. సీబీబీ మరో నెల రోజులు గడువు కోరటం వల్ల సెప్టెంబర్​ 30కి వాయిదా పడింది.

నిందితులు:

ఎల్​ కే అడ్వాణీ,మురళీ మనోహర్​ జోషి, సుధీర్ కక్కర్, సతీష్​ ప్రధాన్, రాం చంద్ర ఖత్రి, సంతోష్​ దుబే, కల్యాణ్​ సింగ్, ఉమా భారతి, రాం విలాస్​ వేదాంతి, వినయ్​ కతియార్, ప్రకాశ్​ శర్మ, గాంధీ యాదవ్, జై భాన్​ సింగ్, లల్లూ సింగ్, కమలేశ్​ త్రిపాఠి, బ్రిజ్​ భూషన్​ సింగ్, రాంజీ గుప్తా, మహంత్ నృత్య గోపాల్​ దాస్, చంపత్​ రాయ్, సాక్షి మహారాజ్, వినయ్ కుమార్​ రాయ్, నవీన్​ భాయ్​ శుక్లా, ధర్మదాస్, జై భగవాన్​ గోయల్​, అమరనాథ్​ గోయల్​, సాధ్వి రితంభర, పవన్​ పాండే, విజయ్​ బహదూర్​ సింగ్​, ఆర్​ ఎం శ్రీవాస్తవ, ధర్మేంద్ర సింగ్​ గుజ్జర్​, ఓం ప్రకాశ్​ పాండే, ఆచార్య ధర్మేంద్ర

మరణించిన నిందితులు:

పరమహంస రామచంద్ర దాస్​, వినోద్​ కుమార్​ వత్స్, రాం నారాయణ్ దాస్​, డీబీ రాయ్​, లక్ష్మీ నారాయణ దాస్​, హర్​గోవింద్​ సింగ్​, రమేష్​ ప్రతాప్​ సింగ్​, దేవేంద్ర బహదూర్, ఆశోక్​ సింఘాల్​, గిరిరాజ్​ కిశోర్​, విష్ణుహరి దాల్మియా, మోరేశ్వర్​, మహంత్​ జగదీశ్​ ముని మహరాజ్​, వైకుంఠ్ లాల్​ శర్మ, సతీష్​ కుమార్​ నాగర్​, బాలా సాహెబ్​ ఠాక్రే.

ఇదీ చూడండి:- 'బాబ్రీ' పరిమాణంలోనే అయోధ్య మసీదు: ఐఐసీఎఫ్​

బాబ్రీ కేసు టైమ్​లైన్​

1992, డిసెంబర్​ 6- బాబ్రీ మసీదు ఘటన. ఫైజాబాద్​లో రెండు కేసుల నమోదు. అడ్వాణీ, మురళీ మనోహర్​ జోషి, బాల్​ ఠాక్రే, ఉమా భారతితో పాటు 49మందిపై క్రిమినల్​ కేసు​ నమోదు.

1993- సీబీఐ చేతికి ఈ హై-ప్రొఫైల్ కేసు దర్యాప్తు. కరసేవకులు, 49మంది నేతలపై రాయబరేలీ, లఖ్​నవూలో దర్యాప్తు ప్రారంభం. భాజపా అగ్రనేతలను నేరానికి కుట్ర కేసులో భాగం చేసిన దర్యాప్తు సంస్థ.

​1996- రెండు కేసులను కలుపుతూ నోటిఫికేషన్​ విడుదల చేసిన యూపీ సర్కార్​. కేసుపై అడ్వాణీ సహా నేతలు సవాల్​ చేయగా.. రెండింటిని నేర కుట్ర విభాగంలోకి చేర్చిన సీబీఐ.

2001, మే 4- అడ్వాణీ సహా ఇతన నేతలపై నేరారోపణలను కొట్టేసిన సీబీఐ ప్రత్యేక కోర్టు.

2003- మరో ఛార్జ్​షీట్​ దాఖలు చేసిన సీబీఐ. అడ్వాణీకి వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు లేవన్న రాయబరేలీ కోర్టు. హైకోర్టు జోక్యంతో తిరిగి కొనసాగిన విచారణ.

2010, మే 23- అడ్వాణీ సహా ప్రముఖులపై నేరానికి కుట్ర కేసును కొట్టేసిన అలహాబాద్​ హై కోర్టు.

2012- అలహాబాద్​ హై కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించిన సీబీఐ. పునర్విచారణ చేపట్టాలని ఆదేశించిన సర్వోన్నత న్యాయస్థానం.

2017, ఏప్రిల్- రెండేళ్లలో విచారణ పూర్తి చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టును ఆదేశించిన సుప్రీం కోర్టు. రాయబరేలీ కేసును సైతం లఖ్​నవూలోనే కలిపి విచారించాలని ఉత్తర్వులు.

2017-మే- ప్రారంభమైన రోజువారీ విచారణ. వాదనలు విన్న సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి. నిందుతులందరికీ ముందస్తు బెయిల్​ కోరిన అడ్వాణీ.

2020 జులై- కరోనా కారణంగా అడ్వాణీ, మురళీ మనోహర్​ జోషి వాంగ్మూలాన్ని వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా రికార్డు చేసిన న్యాయస్థానం

2020, మే 8- అగస్టు 31 నాటికల్లా విచారణ పూర్తి చేయాలన్న సుప్రీం కోర్టు. కరోనా కారణంగా సెప్టెంబర్​ 30 వరకు పొడిగింపు.

ప్రస్తుతం సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సురేంద్ర యాదవ్​.. సెప్టెంబర్​ 1 నాటికి కేసుకు సంబంధించిన విచారణ పూర్తి చేశారు. ఇరుపక్షాల వాదనలు, వాంగ్మూలాలు, వాద-ప్రతివాదనలు విన్న తర్వాత సెప్టెంబర్​ 2 నుంచి తీర్పు రాయటం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 30న చార్రితక కేసులో తీర్పు వెలువరిస్తున్నట్లు ప్రకటించారు.

Last Updated : Sep 30, 2020, 2:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.