శబరిమలకు అయ్యప్ప భక్తులు పోటెత్తారు. ఈ నెల 26న సూర్యగ్రహణం, 27న మండలపూజ ముగుస్తుండడంతో రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. ఎరుమేలి నుంచి పంబాకు వెళ్లే మార్గంలో వాహనాల రద్దీ ఎక్కువైంది. ఐదు కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సన్నిధానం వద్ద భక్తులు గంటల తరబడి నిరీక్షిస్తున్నారు.
భక్తుల తాకిడి పెరిగిన నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. సూర్యగ్రహణం నేపథ్యంలో ఈ నెల 26న ఉదయం 7.30గంటల నుంచి 11.30గంటల వరకు నాలుగు గంటలపాటు ఆలయాన్ని మూసివేయనున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.