హరియాణా హిసార్ జిల్లా ఆర్యానగర్‌కు చెందిన ఓ ఆటోడ్రైవర్.. హాథ్రస్ ఘటన నిందితులకు శిక్ష పడేంతవరకు తాను చెప్పులేసుకోనని శపథం చేశాడు.
"దేశంలో పుట్టినప్పటినుంచే మహిళలకు కష్టాలు ఎదురవుతున్నాయి. ఎన్నో హత్యా ఘటనల్లో మహిళలకు న్యాయం జరగట్లేదు" అని వాపోయాడు రాజ్‌పాల్ బుమ్రా.

నిర్భయ ఘటనలో అలా..
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ ఘటన నిందితులకు శిక్ష పడిన రోజు రాజ్‌పాల్ వార్తల్లోకెక్కాడు. ఆ రోజంతా మహిళలకు ఉచితంగా ఆటో సేవలందించాడు. ఏటా రాఖీ పౌర్ణమి సందర్భంగానూ ఇలాంటి సౌకర్యమే కల్పిస్తుంటాడు రాజ్‌పాల్.
ఇదీ చదవండి: ఆ వృద్ధురాలికి వీధి కుక్కలే ప్రపంచం