అసోం ఇంకా వరద గుప్పిట్లోనే ఉంది. భారీ వర్షాల వల్ల ఇప్పటివరకు 102 మంది మరణించారు. 23 జిల్లాల్లో 24,76,431 మంది ప్రభావితమయ్యారు.
బ్రహ్మపుత్ర నది ఉగ్రరూపం దాల్చడం వల్ల నివాస ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఇప్పటికీ వరద నీటిలో చిక్కుకుపోయిన పలు గ్రామాల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. వేలాది ఎకరాల్లో పంట నీట మునిగిపోయింది. రవాణా, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
ఇదీ చూడండి: ఇలాంటివి చూస్తుంటే నా రక్తం మరిగిపోతోంది: రాహుల్